Breaking News

Tag Archives: covid 19

క‌రోనా బాధితునికి ఆక్సీజ‌న్ అంద‌జేత

కామారెడ్డి, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేస్తున్న మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ వారి షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకి సమయానికి కాంగ్రెస్ నాయకులు ఆక్సిజన్ సిలిండర్ అందించి ప్రాణాలు కాపాడారు. కామారెడ్డి పట్టణానికి చెందిన స్వాతంత్ర సమర యోధుడు ఇసన్నపల్లీ నారాయణరెడ్డి కుమారుడు భూమన్న కరోన వ్యాధితో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి శ్వాస తీసుకోలేక బాధపడుతున్నాడు. విష‌యం తెలుసుకున్న ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు ఆక్సిజన్ సిలిండర్ అందించి ...

Read More »

సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ కొరకు 18 కేంద్రాలు

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈనెల 28, 29 తేదీలలో సూపర్ స్ప్రెడర్లకు అందించే వ్యాక్సింగ్ కొరకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సివిల్ సప్లై వ్యవసాయ సమాచార పౌర సంబంధాలు వైద్య ఆరోగ్య శాఖ, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్, ఆర్డివోలు తదితర అధికారులతో ప్రత్యేక వ్యాక్సినేషన్ పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరకు 28, 29 తేదీలలో 50 ...

Read More »

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయుట కొరకు డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా కామారెడ్డి పట్టణ కేంద్రంలోని అన్ని వీధుల‌ను, ప్రధాన రహదారుల‌ను పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల‌ సూచనలు, లాక్‌ డౌన్‌ నియమ నిబంధనలు మీడియా ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా అందరికి తెలిసినప్పటికిని చాలామంది అవేమీ తమకి పట్టవు అంటూ ఇంకా రోడ్ల ...

Read More »

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు మందులు ఇస్తున్నారా మీ ఆరోగ్య విషయాలు పర్యవేక్షణ చేస్తున్నారా అని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కరోనా వచ్చిన పేషంట్‌ల‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డోర్‌ టు డోర్‌ సర్వే ద్వారా కరోనా ల‌క్షణాలు ఉన్న 12 మందికి ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డోర్‌ టు డోర్‌ సర్వే రెండు విడతల్లో ఆశా ...

Read More »

కరోనా సోకిన వారికి చేయూత

బీర్కూర్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలు ఇద్దరికి కరోనా సోకడంతో వారి కుటుంభ సభ్యులు ఈ విషయాన్ని టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌కి తెలిపారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకుల‌తో కలిసి వెళ్ళి కరోనా సోకిన కుటుంబానికి వారం రోజులు సరిపడ నిత్యావసర సరుకులు, మెడికల్‌ ఎక్విప్‌ మెంట్స్‌, పండ్లు, బ్రేడ్‌ ప్యాకెట్స్‌, గుడ్లు, బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ...

Read More »

జగిత్యాల‌లో 158 వాహనాలు సీజ్‌

జగిత్యాల్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :  జగిత్యాల‌ జిల్లాలో లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమల‌వుతుందని, అందుకు ప్రజలందరూ సహకరిస్తున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్‌  అన్నారు. ఆదివారం జగిత్యాల‌ పట్టణంలో లాక్‌ డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా పోలీస్‌ బందోబస్తుతో లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  అందుకు ప్రజలందరూ సహకరిస్తున్నారన్నారు. కొంతమంది అనవసరంగా బయట తిరిగే వారిని, కారణం లేకుండా బయటికి ...

Read More »

నందిపేట్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

నందిపేట్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల‌లో గడిచిన 24 గంటల‌ వ్యవధిలో నిర్వహించిన కరోన టెస్ట్‌లో శనివారం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాకపోవడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 33 మందికి టెస్ట్‌లు చేయగా ఎవరికి ఏమి సమస్య రాకుండ జీరో అయింది. డొంకేశ్వర్‌ ఆసుపత్రి పరిధిలో 18 మందికి టెస్టులు చేయగా ఒకే ఒక్క కేసు నమోదు అయింది. అక్కడ కూడ త్వరలో జీరోకు చేరుకొంటామని డాక్టర్‌ గంగ ...

Read More »

లాక్‌ డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు కలెక్టర్‌, సిపి

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ డౌన్‌ నిబంధనలు ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ ఆదేశించారు. లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాల‌ని అప్పుడే వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారుల‌ను ఆదేశించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, నగర కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌డిఓ రవి ...

Read More »

బోధన్‌లో లాక్‌ డౌన్‌ కఠినతరం

బోధన్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజమాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో లాక్‌ డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు బైక్ ల‌పై తిరుగుతూ ప్రజలెవరు బయటకి రావద్దని హెచ్చరించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారుల‌ను చెదర గొట్టారు. బోధన్‌ ఏసీపీ రామారావు నేత ృత్వంలో పకడ్బందీ చర్యల‌ను పోలీసులు చేపడుతున్నారు. బోధన్‌ పట్టణం ఆచన్‌ పల్లి, శక్కర్‌ నగర్‌, పోస్ట్‌ ఆఫీసు, రాకాసిపెట్‌ గుండా పోలీసులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపార షాపుల‌ను మూసివేయించారు. లాక్‌ డౌన్‌ సమయంలో ...

Read More »

కేసీఆరే నా నిండు ప్రాణం…

హైదరాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటల‌కు ఎంజీఎం దవాఖానకు చేరుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నేరుగా కోవిడ్‌ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగుల‌ను పరామర్శించారు. కోవిడ్‌ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్‌ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్‌ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్‌ జిందాబాద్‌ కేసీఆరే ...

Read More »

కొనసాగుతున్న జ్వర సర్వే

బోధన్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం శాసనసభ్యులు ఎండీ. షకీల్‌ ఆమ్మేర్‌ ఆదేశాల‌ మేరకు బోధన్‌ మండలం కుమ్మన్‌ పల్లి, కొప్పర్తి క్యాంపు గ్రామంలో ఇంటింటి జ్వరం సర్వే జరుగుతున్న తీరును ఎన్‌డిసిసిబి బ్యాంక్‌ డైరెక్టర్‌ గిర్దవర్‌ గంగారెడ్డి, మాజీ రైసస మండల్‌ కోఆర్డినేటర్‌ బుద్దె రాజేశ్వర్‌లు పరిశీలించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయంటువంటి విధముగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏఎన్‌ఎం, అంగన్వాడీ టీచర్‌, ఆశవర్కర్‌ గ్రామ కార్యదర్శితో టీం లు ఏర్పాటు చేసి ...

Read More »

ల‌క్షణాలు ఉన్న వారు మందుల‌ కిట్‌ తీసుకోవాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వైరస్‌ పై ఇంటింటి సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది వచ్చినప్పుడు వారి ఆరోగ్య వివరాలు తెలియజేసి ల‌క్షణాలు ఉన్నట్లయితే మందుల‌ కిట్లు తీసుకొని వాటిని వాడుకోవాల‌ని తద్వారా వైరస్‌ నుండి బయటపడాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కోరారు. బుధవారం కలెక్టర్‌, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి 35, 36 డివిజన్ల పరిధిలోని నాందేవ్‌వాడలో పర్యటించారు. ఇంటింటి సర్వే కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ...

Read More »

నకిలీ వాగ్దానాలు, తప్పుడు వాదనలు సరికావు…

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కెసిఆర్‌ తప్పుడు వాదనలు చేస్తూ, కోవిడ్‌ను అరికట్టడంలో నిర్వహిస్తున్న వైఫల్యాల‌ను కప్పిపుచ్చడానికి నకిలీ వాగ్దానాలు చేస్తున్నారని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ ఆలీ షబ్బీర్‌ విమర్శించారు. ప్రజల‌ను తప్పుదోవ పట్టించడానికి మరియు కోవిడ్‌ -19 పరిస్థితిని నిర్వహించడంలో తన ప్రభుత్వ వైఫల్యాల‌ను కాపాడటానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోవిడ్‌ -19 పరిస్థితిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వైఫల్యాల‌ను హైకోర్టు ఎత్తిచూపినప్పుడల్లా సిఎం కెసిఆర్‌ ఒక సమీక్ష సమావేశం ...

Read More »

పోలీసుల‌కి మాస్కుల‌ పంపిణీ

కామరెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల‌ కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్లో పోలీసుల‌కి అఖిల‌ భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాజేశ్వర్‌ గౌడ్‌ చేతుల‌ మీదుగా మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా ఇంచార్జ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించాల‌ని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సామాజిక ...

Read More »

స్కానింగ్‌ ఫీజు రూ. 2 వేల‌కు అంగీకారం

నిజామాబాద్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేషంట్ల నుండి స్కానింగ్‌ చేసినందుకుగాను ఫీజు కింద 4, 5 వేల‌ రూపాయల‌కు బదులు రూ. 2000 తీసుకోవడానికి సంబంధిత యాజమాన్యాలు అంగీకరించినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి సూచన మేరకు కలెక్టర్‌ ఆదివారం తన చాంబర్లో ఐఎంఏ ప్రతినిధులు, స్కానింగ్‌ సెంటర్ల యాజమాన్యాల‌తో తన చాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లేబరేటరీలు ఆసుపత్రుల‌ ప్రజల‌కు ...

Read More »

46వ వార్డులో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి పట్టణం 46 వార్డులో కరోన సెకండ్‌ దశలో రెండవ సారి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయడం జరిగింది. వార్డు కౌన్సిల‌ర్‌ కోయల్‌ కార్‌ కన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ను అందరూ సహకరిస్తూ తమ తమ ఇళ్లలోనే ఉంటూ తమ కుటుంబాన్ని కాపాడుకుంటే దేశాన్ని కాపాడినట్టేనని, అవసరం ఉంటేనే బయటకు వెళ్లండి, విధిగా మాస్కు కచ్చితంగా పెట్టుకోవాల‌ని, అలాగే చేతుల‌కు శానిటైజర్‌ కచ్చితంగా వాడాలి, కోవిడ్‌ నిబంధనలు ...

Read More »

కోవిడ్‌ సేవల‌పై నిరంతర పర్యవేక్షణ

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఊహించకుండానే విరుచుకుపడి ప్రజల‌ను భయాందోళనకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తున్న కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల‌ మేరకు మంత్రిగా తాను, జిల్లా కలెక్టర్‌ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని సేవల‌ను మెరుగు పరచడంతో పాటు సదుపాయాల క‌ల్ప‌నకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి ఆర్మూర్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రుల‌లోనూ ...

Read More »

నిర్ణయించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రైవేటు ల్యాబ్‌ యాజమానులు కరోనా టెస్టుల‌ పేరుతో ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నందున జిల్లా కలెక్టర్‌ జిల్లా వ్యాప్తంగా ఆరు టాస్క్‌ ఫోర్స్‌ టీంల‌ను ఏర్పాటు చేసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. 23 కేంద్రాల‌లో తనిఖీలు చేసి కొన్ని కేంద్రాల‌లో సరియైన సౌకర్యాలు కల్పించట్లేదని విచారణలో తేలింది. వీటి విషయమై విచారణ అనంతరం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ...

Read More »

ఆన్‌లైన్‌ రిజిష్టర్‌ చేసుకున్నవారికే టీకాలు

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికే కోవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాలు వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45 సంవత్సరాలు పై బడిన వారు ప్రతి ఒక్కరు కోవిన్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకోవాల‌న్నారు. వివరాలు నమోదు చేసుకున్నవారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 42 సెంటర్లు ఉన్నాయని, నచ్చిన సెంటర్‌ను ఎంపిక చేసుకొని అక్కడికి వెళ్లి టీకా తీసుకోవచ్చని ...

Read More »

అధిక వసూలు చేస్తే కాల్‌ చేయండి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రయివేటు అంబులెన్స్‌ యజమానులు ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి హెచ్చరించారు. కరోనాను అవకాశంగా చేసుకొని ప్రజల‌ నుంచి అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. కావున అంబులెన్స్‌ ఓనర్‌లు, డ్రైవర్లు తెలంగాణ మోటర్‌ వెహికల్‌ చట్టం నిబంధనలు, డిఎం ఆక్ట్‌ 2005 అనుగుణంగా డబ్బు వసూలు చేయాల‌న్నారు. నిబంధనల‌ ప్రకారం వసూల్‌ చెయ్యని యజమానుల‌పై సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని ...

Read More »