కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బీబీపేటలో రాములు (82) మృతి చెందగా మృతుని కుమారుడు ఆంజనేయులు ఆమోదంతో నేత్రదానం చేశారు. వాసవీ క్లబ్ బీబీపేట ఆధ్వర్యంలో డాక్టర్ హనుమయ్య సహకారంతో మృతుని నేత్రాలు సేకరించి వాసన్ ఐకేర్ కంటి ఆసుపత్రికి అందించామని నేత్రకమిటీ అధ్యక్షుడు బాశెట్టి నాగేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్, ప్రతినిధులు శ్రీనివాస్, మనోజ్, పి.శ్రీనివాస్, బాలరాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Read More »