Breaking News

Tag Archives: Free training

ఆర్‌ఎంపి వైద్యులకు ఉచిత శిక్షణ

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌ఎంపి వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు తెలంగాణ ఆర్‌ఎంపి, పిఎంపి వెల్పేర్‌ అసోసియేసన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ తెలిపారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడ పట్టణంలో పారామెడికల్‌ ట్రెనింగ్‌ సెంటర్‌లో కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన ఆర్‌ఎంపి, పిఎంపి వైద్యులకు ప్రాథమిక చికిత్స, వైద్య సంబంధిత అంశాలపై శిక్షణ ...

Read More »

రైల్వే ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైల్వే శాఖలో నిర్వహించే గ్రూప్‌-డి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్టు ఏఆర్‌ ఐబెక్స్‌ నిర్వాహకులు యాదగిరి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులకు తమ సంస్థ ద్వారా గ్రూప్‌-డి ఉద్యోగాలైన కలాసీలు, గ్యాంగ్‌మెన్‌, రాక్‌మెన్‌ తదితర ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. నిరుపేద యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి తమ సంస్థ ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. ...

Read More »

నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సులు

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతకు న్యాక్‌ ఆధ్వర్యంలో ఉపాధి కోర్సులను అందిస్తున్నట్టు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎన్‌.రమేశ్‌ తెలిపారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు న్యాక్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన కోర్సులను అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసుగలవారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 1. మేస్త్రి, తాపీ మేస్త్రీ కాల వ్యవధి మూడునెలలు, విద్యార్హత ...

Read More »

మేరు సంఘం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో బుదవారం టేలర్స్‌ డే పురస్కరించుకొని మేరు సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో గాంధీ గంజ్‌ నుంచి పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిదులు మాట్లాడుతూ ప్రభుత్వం మేరు ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి వందకోట్ల రూపాయలతో ప్రతి యేడు బడ్జెట్‌ ఏర్పాటు చేయాలన్నారు. మేరు కుల వృత్తిపై ఆధారపడి ఉన్నవారికి అధునాతన ...

Read More »

కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాల్‌సెంటర్‌ ఉద్యోగాల కొరకు మెప్మా, ఎడుబ్రిడ్జ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంయుక్తంగా నిరుద్యోగ యువత కొరకు ఉపాధి నిమిత్తం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు సంస్థ తెలంగాణ మేనేజర్‌ సుమన్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. తమ సంస్థ ఎంతోమంది నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిందని, కాల్‌సెంటర్‌ శిక్షణతోపాటు రిటైల్‌ ఇండస్ట్రీ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అభ్యర్థులకు శిక్షణతోపాటు స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ ...

Read More »

వాలీబాల్‌ శిక్షణా శిబిరం ప్రారంభం

  గాంధారి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండలం పేట్‌సంగం పాఠశాల ఆవరణలో వాలీబాల్‌ వేసవి శిక్షణా శిబిరం సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం వేసవిలో విద్యార్థుల కొరకు వివిధ క్రీడావిభాగాల్లో ఉచిత శిక్షణా శిబిరాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా మండలంలోని పేట్‌సంగం పాఠశాలలో పిఇటి లక్ష్మణ్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో ఉచితంగా విద్యార్థులకు వాలీబాల్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నెలరోజులపాటు విద్యార్థులకు వాలీబాల్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం కొబ్బరికాయ కొట్టి శిక్షణా శిబిరం ప్రారంభించారు. ...

Read More »

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో అక్షయ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీ ఆద్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఇన్సిట్యూట్‌ ఎండి భూపాల్‌ తెలిపారు. సిఎంవివైకె-2 మెప్మా, డిజిటల్‌ ఇండియా సంయుక్తంగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ తర్వాత ఎంఎన్‌సి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని కోరారు. వివరాలకు 9949173338, 8121988336 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.

Read More »