Tag Archives: govt centers

అంబర్‌పేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండలం అంబర్‌పేట్‌ గ్రామంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తుందని, రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యం విక్రయించి మద్దతుధర పొందాలన్నారు. అంతకుముందు వాటర్‌డే కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఈత మొక్కలకు నీరుపోశారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు తీసుకొచ్చి నాటాలని కమిటీ సభ్యులకు సూచించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న స్థానికులకు కలెక్టర్‌ …

Read More »

దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళారులకు వరి ధాన్యం తక్కువ ధరకు విక్రయించి రైతులు మోసపోవద్దని మైలారం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ అప్పారావు అన్నారు. శుక్రవారం మైలారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలు చెప్పి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే దళారులకు విక్రయించవద్దని ఆయన సూచించారు. ఆరుగాలం కష్టించిన రైతుకు ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇస్తుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో …

Read More »

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

  నందిపేట, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఐలాపూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్‌ ఉమాకాంత్‌, సొసైటీ ఛైర్మన్‌ లక్ష్మినారాయణతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారుల బెడద నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఏగ్రేడ్‌ ధాన్యానికి రూ. …

Read More »

ధాన్యం దళారుల పాలు చేయొద్దు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం దళారుల పాలు చేసి రైతులు మోసపోవద్దని బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ అన్నారు. బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో, నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌, బొమ్మన్‌దేవుపల్లి గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించిన రైతు దళారుల మాయమాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం విక్రయించొద్దని సూచించారు. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో ప్రతిగ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు …

Read More »