Breaking News

Tag Archives: Kamareddy Collector Satyanarayana

హరితహారంలో 2.88 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరి భాగస్వామ్యంతో ఈయేడు కామారెడ్డి జిల్లాకు హరితహారంలో నిర్దేశించుకున్న 2 కోట్ల 88 లక్షల మొక్కలు నాటడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన సదాశివనగర్‌ మండలం వడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులే కాకుండా పాఠశాల, కళాశాలల విద్యార్తులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజలను హరితహారంలో భాగస్వాములను చేయాలని సూచించారు. గత సంవత్సరం 1.32 కోట్ల మొక్కలు ...

Read More »

ప్రణాళికబద్దమైన ప్రగతికి గణాంకాలు ఉపయోగపడతాయి

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళిక బద్దమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లడానికి గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. 13వ జాతీయ గణాంక దినోత్సవం, మొదటి ప్రణాళిక కమీషన్‌ మెంబరు ప్రశాంత చంద్ర మహాలనోవిష్‌ జయంతి సందర్బంగా శనివారం జిల్లా ప్రణాళిక శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. ప్రశాంతచంద్రకు ప్రముఖ గణాంకవేత్తగా పేరుందని, తాను ప్రతిపాదించిన గణాంక సూత్రాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రణాళిక బద్దంగా సామాన్యులకు చేరడంలో ఎంతో ...

Read More »

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం

కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అర్హులైన ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు టిఎస్‌ఐపాస్‌, టిప్రైడ్‌ ద్వారా పెట్టుబడి సబ్సిడీ అందించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన అధ్యక్షతన జిల్లా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 8 ఎంటర్‌ప్రైజెస్‌లకు ఎస్‌సిపి, టిఎస్‌పి విభాగాలకు 23 లక్షల 54 వేల 479 రూపాయలను మంజూరు లభించిందని, మహిళలకు 45 శాతం సబ్సిడీతో ఆమోదం లభించినట్టు వివరించారు. సమావేశంలో జిల్లా ...

Read More »

జిల్లాలో ఇసుక లభ్యతపై నివేదిక అందజేయాలి

కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలో ఇసుక లభ్యతపై అధికారులు పూర్తిస్థాయి నివేదికలు సిద్దం చేయాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఆయన జిల్లా మైన్స్‌, బూగర్భజలాలు, ఇరిగేషన్‌ శాఖల అదికారులతో సమీక్షించారు. వివిధ అభివృద్ది కార్యక్రమాలకు అవసరమైన ఇసుక జిల్లాలో 46 వేల క్యూబిక్‌ మీటర్లు అందుబాటులో ఉందని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టి నివేదికలు ఇవ్వాలన్నారు. మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో అప్పర్‌ ...

Read More »

రోడ్లపై సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లపై సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. శుక్రవారం జనహితలో రోడ్లు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్లపై వేగం తగ్గించేందుకు రంబుల్‌ స్ట్రిప్స్‌, రోడ్లపై పూర్తిస్తాయిలో కాంతి ఉండేలా చూడాలన్నారు. ఆర్టీసి బస్సులు జంక్షన్‌లలో ఆగకుండా కేవలం బస్టాండ్‌లలో నిలుపుదల చేయాలన్నారు. ట్రాఫిక్‌ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన అన్ని ప్రాంతాల్లో సిసి ...

Read More »

అటవీ భూముల స్వాధీనంపై కఠిన చర్యలు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములు ప్రభుత్వ భూములని, ప్రభుత్వానికి సంబంధించిన భూములను ఆక్రమించుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర అటవీశాఖమంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ యాచారంలో అక్రమంగా అటవీ భూమిని ట్రాక్టర్లతో దున్నడాన్ని అడ్డుకున్న వెంకటస్వామిపై పలువురు దాడిచేసిన సంఘటన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ త్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, డిఎఫ్‌వో వసంత మంత్రికి మొక్కలు, పుస్తకాలు ఇచ్చి స్వాగతం ...

Read More »

ఎరువులు, మందుల విక్రయ దారులు రైతుకు సహకరించాలి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు ఇబ్బంది పడకుండా పంటలు తెగుళ్ళ బారిన పడకుండా రైతుకు అధిక దిగుబడి వచ్చేలా సరైన క్రిమిసంహారక మందులు, ఎరువులు అమ్మి డీలర్లు రైతులకు దన్నుగా నిలవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. బుధవారం జనహితలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబిరంగు పురుగు, సమగ్ర యాజమాన్య పద్దతులపై కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్‌లకు చెందిన ఇన్‌పుట్‌ డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ శాఖాధికారులు వర్షాకాలంలో ...

Read More »

స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో మూడోవిడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మూడో విడత నామినేషన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నిజాంసాగర్‌, ఎల్లారెడ్డి, ఎంపిడిఓ కార్యాలయాల్లో నామినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 6వ తేదీన మొదటివిడత కింద 99 జడ్పిటిసి, 88 ఎంపిటిసి, మే 10న రెండో విడత కింద 7 జడ్పిటిసి, 77 ఎంపిటిసి, మే 14న మూడో విడత కింద ...

Read More »

విద్యార్థులకు సంపాదన, శ్రమ పట్ల అవగాహన కల్పించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుకునే సమయంలోనే విద్యార్థులకు సంపాదన, శ్రమ పట్ల అవగాహన కల్పిస్తే విద్యార్తులు మరింత పరిపక్వత సాధిస్తారని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద వ్యవసాయ క్షేత్రంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌, పాలిటెక్నిక్‌ కళాశాల సంయుక్త సహకారంతో జిల్లా ఉద్యానవన శాఖ నిర్వహిస్తున్న కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకాన్ని ఆయన సందర్శించారు. ఐదెకరాల స్థలంలో డ్రిప్‌, మల్చింగ్‌ పద్దతిలో పాలిటెక్నిక్‌ విద్యార్థుల భాగస్వామ్యంతో నూతన పరిజ్ఞానంతో జరుగుతున్న హైబ్రిడ్‌ ...

Read More »

నామినేషన్‌ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడో విడత జడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్ల సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నాగిరెడ్డిపేట, లింగంపేట్‌ ఎంపిడివో కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణవాయువైన ఓటు హక్కును ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. మొత్తం 22 జడ్పిటిసి, 236 ఎంపిటిసి ఎన్నికలకు జరిగే మూడో విడత ఎన్నికల్లో 6 లక్షల 7 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు వివరించారు. ...

Read More »

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు యూనిట్ల మంజూరు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశ్రమలు నెలకొల్పేందుకు కావాల్సిన టిఎస్‌ఐపాస్‌ క్లియరెన్సులపై గురువారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు టిప్రయిడ్‌ ద్వారా 16 యూనిట్లను ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీకింద మంజూరు చేసినట్టు తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల అనుమతి మంజూరు చేశామని పేర్కొన్నారు. సమావేశంలో ఇండస్ట్రి అధికారి రఘునాథ్‌, అధికారులు నాగేంద్రయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మలేరియా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మలేరియా వ్యాప్తి చెందకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఎదుట మలేరియా అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మలేరియా అరికట్టడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జీరో మలేరియా స్టార్ట్స్‌ విత్‌మి అనే థీమ్‌ను ప్రారంభించారు. డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో శోభారాణి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో మలేరియా ...

Read More »

విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు అభివృద్ది చెందాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాస్త్రవేత్తలు అందించిన విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రైతులు మొక్కవోని ధైర్యంతో వ్యవసాయాన్ని అభివృద్ది పథంలో నడిపించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. వ్యవసాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వం, కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్‌ సంయుక్తంగా నిర్వహించిన కిసాన్‌మేళ, రైతు సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. విజ్ఞానం, వికాసం, విత్తం అనేవి మూడు ప్రధాన అంశాలు మాత్రమే మానవాళికి, రైతుల అభివృద్దికి దోహదపడతాయని తెలిపారు. సమన్వయ సమితి ...

Read More »

నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్‌ కేంద్రాలైన మాచారెడ్డి, దోమకొండ, ఎంపిడివో కార్యాలయాలను బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్బంగా మాచారెడ్డి మండలంలో రెండు జడ్పిటిసి నామినేషన్‌ ఫారాలను రికార్డుల్లో రిటర్నింగ్‌ అధికారి పొందుపరిచిన సమాచారాన్ని ఆయన పరిశీలించారు. మొదటి దఫా ఎంపిటిసి, జడ్పిటిసి నామినేషన్ల సమాచారాన్ని రికార్డుల్లో పూర్తిస్తాయిలో నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపిడివోలు, అధికారులు ఉన్నారు.

Read More »

రైతు సమగ్ర సమాచార సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతు సమగ్ర సమాచార సేకరణ పకడ్బందీగా పక్కాగా నిర్వహించాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్పరెన్సు ద్వారా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 2 లక్షల 31 వేల 617 కాగా, ఇప్పటి వరకు సర్వేచేసిన రైతుల సంఖ్య 74 వేల 238 పూర్తయిందన్నారు. వ్యవసాయాధికారులను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవద్దని, మిగతా సర్వే రెండ్రోజుల్లో పూర్తిచేయాలని, ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారం పంపాలని ఆదేశించారు. ...

Read More »

స్థానిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్పంచ్‌, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించుకున్నామని, అదే క్రమంలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన గాంధారి, సదాశివనగర్‌ మండలాల్లో పివో, ఏపివోల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ఎన్నికల నియమావళిని అనుసరించి అధికారులు ఎన్నికల విధులు నిర్వహించాలని చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలను విజయవంతంగా ...

Read More »

అటవీభూములపై పూర్తిస్థాయి సర్వే జరపాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెవెన్యూ డివిజన్‌ల వారిగా ప్రభుత్వ భూములపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆయన రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ డివిజన్ల వారిగా ప్రభుత్వ భూములు, పట్టా, సేత్వార్‌, ఖాస్రా భూములపై నో ఆబ్‌జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీకి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్టు తెలిపారు. రామారెడ్డి మండలం ఉగ్రవాయి ప్రభుత్వ బూములు, అసైన్డ్‌ భూములు, అటవీభూములపై సమీక్షించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Read More »

గ్రామ కార్యదర్శులు గ్రామాల అభివృద్దికి తోడ్పడాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నియమించబడ్డ గ్రామస్థాయి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ది పరిచేందుకు పూర్తిస్థాయి నిబద్దతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం కామారెడ్డిలో పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటైన శిక్షణకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2018 పంచాయతీ రాజ్‌ చట్టం సూచన మేరకు గ్రామాలలో మౌలిక సదుపాయాలు, హరితహారంలో భాగంగా నర్సరీలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అన్నాహజారేను ఆదర్శంగా తీసుకొని గ్రామాలను పరిపూర్ణంగా అభివృద్ది పరచాలని పేర్కొన్నారు. సమావేశంలో డిపివో ...

Read More »

స్థానిక ఎన్నికల్లో అధికారులు ఖచ్చితంగా విధులు నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ, పార్లమెంటు, సర్పంచ్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించినట్టే అధికారులు జడ్పిటిసి, ఎంపిటిసి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితమైన విదులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం ఎన్నికల విదులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో నామినేషన్‌, స్క్రూటిని, ఉపసంహరణ చేపట్టాలన్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అనుసరించి ఎటువంటి నేరారోపణలు ఉన్నా అభ్యర్థి పోటీచేసినా వారి నామినేషన్‌ తిరస్కరించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన నిర్వహించబడతాయని, బ్యాలెట్‌ ...

Read More »

పట్టా పుస్తకాలను సరిచేసి దోషరహిత గ్రామాలుగా ప్రకటించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్డీవోలు, ఎమ్మార్వోలు వారంరోజుల్లో గ్రామాల వారిగా సందర్శించి రైతుల పట్టా పాసుపుస్తకాలను సరిచేసి వందశాతం దోషరహిత గ్రామాలుగా ప్రకటించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. ఎల్‌ఆర్‌యుపిలో భాగంగా డిజిటల్‌ పాసుపుస్తకాల్లో తప్పులు నమోదైన రైతుల నుంచి వాటిని సరిచేసి వెంటనే కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని సూచించారు. అర్హులైన వారికి సాదా బైనామా, పిఓటి భూముల కేటాయింపు పరిశీలన జరిపి అందించాలన్నారు. ...

Read More »