Breaking News

Tag Archives: Kamareddy Collector Satyanarayana

అంబేడ్కర్‌ బాటలో యువత నడవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సమాజమే దేవాలయంగా భావించారని, ఆయన చూపిన బాటలో యువత నడిచి అన్ని రంగాల్లో రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను మునిసిపల్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. అంతకుముందు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాలను అభివృద్ది మార్గంలో నడిపించి వారికోసం హక్కులు కల్పించి అందరికి అంబేడ్కర్‌ ఆదర్శప్రాయుడయ్యారన్నారు. శరీరం, మనసు, ఆత్మ అనుసందానం ద్వారా ...

Read More »

ఘనంగా జ్యోతిబాఫూలే జయంతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాఫూలే 191వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట ఫూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతోపాటు ఇతర అదికారులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిబాఫూలే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అక్షరాస్యత కోసం చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఎస్‌పి శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రె, ఆయా శాఖల అదికారులు ఝాన్సీ, అలీం, తదితరులు ...

Read More »

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మంగళవారం వీడియో కాన్పరెన్సు ద్వారా ఆర్డీవోలకు సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో వినియోగించే కంట్రోల్‌ యూనిట్లలో క్లియరెన్సు ఆఫ్‌ ఓట్స్‌ నిర్వహించిన అనంతరం మాక్‌ పోలింగ్‌ జరిపి సంబంధిత రిపోర్టును మొదటగా సెక్టోరల్‌, ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి అందించాలని ఆదేశించారు. మాక్‌పోల్‌ ముగిసిన అనంతరం క్లోజ్‌ బటన్‌ ...

Read More »

జాతి సమగ్రతకు జగ్జీవన్‌రాం చేసిన సేవలు ప్రశంసనీయం

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతి సమగ్రతకు, సమసమాజ స్థాపనకు తన జీవితాన్ని ధారపోసిన నిష్కలంక దేశభక్తుడు, భారత మాజీ ప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రాం సేవలు మరిచిపోలేనివని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ కొనియాడారు. శుక్రవారం జగ్జీవన్‌రాం 112వ జయంతి ఉత్సవాలను స్థానిక మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్‌ జగ్జీవన్‌ రాం చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ ...

Read More »

10,11 హాలిడేస్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభల పోలింగ్‌ సందర్భంగా ఏప్రిల్‌ 10,11న రెండ్రోజులపాటు స్థానికంగా సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పబ్లిక్‌ బిల్డింగ్స్‌, విద్యాసంస్థలు, ఇతర బిల్టింగ్‌లను పోలింగ్‌ స్టేషన్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లుగా వినియోగిస్తున్నందున జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో లోకల్‌ హాలిడే ప్రకటించామన్నారు. అన్ని ప్రబుత్వ కార్యాలయాలు, లేబర్‌, ఎప్లైమెంట్‌ ట్రెని, మునిసిపల్‌ కౌన్సిల్స్‌, లోకల్‌ బాడిస్‌ లోకల్‌ హాలిడేగా ప్రకటించబడ్డాయన్నారు. జిల్లా ట్రెజరీ, సబ్‌ ట్రెజరీలు ఏప్రిల్‌ 10,11న ...

Read More »

పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కంకిటి మండలం బాబుల్‌గాం గ్రామంలో పోలింగ్‌ కేంద్రం 98ని సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సందర్శించారు. పోలింగ్‌ కేంద్రంలో జరగనున్న పోలింగ్‌ నిర్వహణ నేపథ్యంలో ఆయన పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. గ్రామంలో 762 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. పోలింగ్‌ ఏర్పాట్లపై ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ బావయ్యలకు పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం మద్నూర్‌ మండల కేంద్రంలోని ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలు ...

Read More »

వివిధ శాఖల అధికారులకు కలెక్టర్‌ పలు ఉత్తర్వులు జారీ

కామారెడ్డి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డయేరియా ప్రబలకుండా ఉండేందుకు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అదికారులను జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్‌, మిషన్‌ భగీరథ, రెవెన్యూ, మునిసిపల్‌ శాఖ అధికారులకు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అన్ని గ్రామాల్లో నెలలో ప్రతిరెండవ, నాలుగవ శుక్రవారం తప్పకుండా ఓవర్‌హెడ్‌ ట్యాంకులను బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రం చేసి, క్లోరినేషన్‌ నిర్వహించి సక్రమంగా తాగునీటి సరఫరా జరపాలని ఆదేశించారు. పైప్‌లైన్‌ ...

Read More »

పార్లమెంటు ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

కామారెడ్డి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తన చాంబరులో సమీక్షించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు మహేంద్రపాల్‌ అరోరా రెండవ విడత ర్యాండమైజేషన్‌ కార్యక్రమంలో పోలింగ్‌ సిబ్బందిని కేటాయించారు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంరస్తోగి సమక్షంలో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌, ఇతర పోలింగ్‌ అదికారులు రెండవ ర్యాండమైజేషన్‌ కార్యక్రమంలో అసెంబ్లీ సెగ్మెంట్‌ వారిగా కేటాయించారు. మొత్తం 625 లొకేషన్లకు సంబంధించి 1026 పోలింగ్‌ కేంద్రాల్లో కామరెడ్డి -5, ఎల్లారెడ్డి-25, ...

Read More »

కలెక్టరేట్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నిర్మితమవుతున్న కలెక్టరేట్‌ కాంప్లెక్సు భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలన్నారు. వివిధ విభాగాలకు కేటాయించిన ఫ్లోర్‌లను సందర్శించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట జిల్లా రోడ్లు, భవనాల శాఖ ఎ.ఇ. మహేందర్‌, డిప్యూటి ఎ.ఇ. శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సుధీర్‌, మోహన్‌ సిబ్బంది ఉన్నారు.

Read More »

మొక్కలు ఎండిపోకుండా గ్రీన్‌షెడ్స్‌ ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ప్రతి నర్సరీలో గ్రీన్‌షెడ్స్‌ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. ఆదివారం ఆయన సదాశివనగర్‌ మండలంలోని కుప్రియాల్‌, అడ్లూర్‌ ఎల్లారెడ్డి, మర్కల్‌ నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కల నేమ్‌ బోర్డులను పెట్టాలని చెప్పారు. మండలంలోని 27 అటవీ, గ్రామాబివృద్ది శాఖ నర్సరీలకు వెంటనే గ్రీన్‌ షెడ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓను ఆదేశించారు. ప్రతి వారం నివేదిక పంపాలన్నారు. ఉపాధి హామీ ద్వారా చేపట్టే ...

Read More »

పది పరీక్ష కేంద్రం పరిశీలన

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ శనివారం ఆకస్మికంగా పర్యవేక్షించారు. పరీక్ష గదుల్లో తిరిగి అక్కడి ఏర్పాట్లను, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం గురికాకుండా సజావుగా పరీక్షలు రాసేలా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.

Read More »

ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల ర్యాండమైజేషన్‌ పూర్తి

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల ర్యాండమైజేషన్‌ పూర్తిచేసి అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం 05జహీరాబాద్‌ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఏఎంసి గోదాములో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వివిద రాజకీయపార్టీల నాయకుల సమక్షంలో నిర్వహించిన ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల మొదటి ర్యాండమైజేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని నియోజకవర్గాలు కలిపి మొత్తం 789 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, యంత్రాలను ...

Read More »

స్ట్రాంగ్‌ రూంల పరిశీలన

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జహీరాబాద్‌-05 పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంది మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలోని కౌంటింగ్‌స్టేషన్‌లను, ఇవిఎం, వివిప్యాట్‌ యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌.శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ధోత్రె, కామారెడ్డి, ఎల్లారెడ్డి, సంగారెడ్డి ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

మానవ సంబంధాలే సమాజ మనుగడకు సోపానాలు

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ సంబంధాలే సమాజ మనుగడకు సోపానాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఉదయం అంతర్జాతీయ సోషల్‌ వర్క్‌ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీని జిల్లా కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థలు కునారిల్లి మానవ సంబంధాలు మృగ్యమై పోతున్నాయని, విపరీత పోకడలు, రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సోషల్‌వర్క్‌ ...

Read More »

సమస్మాతక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలి

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జుక్కల్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పోలింగ్‌ స్టేషన్ల వారిగా సమస్యాత్మక, సున్నిత కేంద్రాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిశీలకునిగా ఐఆర్‌ఎస్‌ రాంరస్తోగి నియమించబడ్డారని తెలిపారు. జనహితలో లోక్‌సభ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై నోడల్‌ అధికారులతో సమీక్షించారు. ఎన్నికల విదులు, నిర్వహణ, పోలింగ్‌ పర్సనల్స్‌ రాండమైజేషన్‌ తదితరాలపై చర్చించారు. ఎన్నికల ఖర్చు, పార్టీల ర్యాలీలు, సమావేశాలు తదితరాలపై నిఘా ...

Read More »

సిబ్బంది ఎన్నికల నియమావళి పాటించాలి

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైక్రో అబ్జర్వర్లు ఈనెల 22న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించేలా చూడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం కామారెడ్డి జనహితలో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల మైక్రో అబ్జర్వర్లు, ప్రీసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రీసైడింగ్‌ అధికారులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించి ఏడుగురు, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబందించి 17 మంది పోటీలో ఉన్నట్టు తెలిపారు. ఉదయం ...

Read More »

జర్నలిస్టులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టులు వత్తిరీత్యా నిత్యం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటు వత్తిడికి గురవుతున్నారని, తద్వారా అనేకమంది జర్నలిస్టులు గుండెపోటుతో మత్యువాత పడుతున్నారని, యిలాంటి పరిస్థితుల నుండి బయట పడాలంటే ముందుగా జర్నలిస్టులు ఆరోగ్య రక్షణ ముఖ్యమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ .సత్యనారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టీజేఏ) రాష్ట్ర కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ...

Read More »

విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్‌ బాలుర పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న 41 మంది విద్యార్థులకు పరీక్షల కిట్‌లు జిల్లా కలెక్టర్‌ బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా కంఫర్ట్‌గా, కాన్ఫిడెంట్‌గా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం 7661854856 కంట్రోల్‌ ...

Read More »

ఫామ్‌-6 పనులను వేగవంతం చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీ వరకు ఓటు నమోదు చేయించుకోవడానికి గడువు ఉన్నందున ఫామ్‌ 6 పనులు వేగంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తహసీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం బిక్కనూరు, బీబీపేట్‌ తహసీల్‌ కార్యాలయాలను సందర్శించి పాం 6 పనులను పరిశీలించారు. తహసీల్దార్లు ర్యాండమ్‌గా ఓటరు నమోదు కార్యక్రమాన్ని తనిఖీ చేయాలని, బూత్‌ లెవల్‌ అదికారుల పనితీరుపై క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, ఫామ్‌ 6 కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ...

Read More »

పార్లమెంటు ఎన్నికల కోడ్‌అఫ్‌ కండక్ట్‌ను పక్కాగా అమలు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 17వ లోక్‌సభ ఎన్నికల ప్రకటన నుంచి మాడల్‌ కోడ్‌అఫ్‌ కండక్ట్‌లో భాగంగా ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ పార్టీల ఫోటోలు తొలగించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం జనహితలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మండల స్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీసుశాఖలు సమన్వయంతో పనిచేసి కోడ్‌ అఫ్‌ కండక్ట్‌ను పక్కాగా అమలు చేయాలని సూచించారు. పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, పోటోలు వెంటనే తీసివేయాలని చెప్పారు. కోడ్‌ అమల్లో ఉన్నందున ...

Read More »