Breaking News

Tag Archives: kamareddy crime news

రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌జిల్లా రామాయంపేట బైపాస్‌రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌కు చెందిన ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం. పెళ్ళి పత్రికలు పంచేందుకు వెళ్ళిన వీరు బైక్‌పై వీడియో కాల్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తుండగా డివైడర్‌ను ఢీకొని సంఘటన స్థలంలోనే ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

మహిళ ఆత్మహత్య

కామారెడ్డి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడకు చెందిన కన్నం రాధిక (32) అనారోగ్యం కారణంగా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని పట్టణ ఎస్‌ఐ గోవింద్‌ తెలిపారు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకున్నట్టు తెలిపారు. మృతురాలి భర్త లింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Read More »