కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయని కారణంగా ఇటీవల ప్రైవేట్ టీచర్లు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వేములవాడ, నాగార్జునసాగర్‌లో భార్య భర్తలు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కుడా లేదని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, చనిపోయిన రవి ఇద్దరు పిల్లల భవిష్యత్ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని, పిల్లల పేర్ల మీద 10 ...
Read More »ప్రభుత్వ విప్ సమక్షంలో తెరాసలో చేరిక
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామ సర్పంచ్ శ్యామయ్యతో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో తెరాస కండువాలు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరేందుకు ఇష్టపడినట్టు వారు చెప్పారు. వారికి గులాబి కండువాలు కప్పి గంప గోవర్ధన్ పార్టీలోకి ఆహ్వానించారు.
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 13 లక్షల 86 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 608 మందికి 3 కోట్ల 96 లక్షల 64 వేల 300 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, ...
Read More »ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ సినిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్‌ను జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కంట్రోల్ రూమ్ అధికారులు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. 08468-220051 నెంబరుతో ఏడు క్లస్టర్ పాయింట్లతో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్‌లో ఏ రోజు ఎంత మంది రైతుల నుండి ...
Read More »సిబ్బంది వివరాలు సేకరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రయివేటు స్కూల్స్ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలను మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు కలిసి క్షేత్రస్థాయిలో సేకరించి వెంటనే పంపాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన విద్యాశాఖ ఎంఇఓలతో, మున్సిపల్ కమీషనర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో సమావేశమై ప్రభుత్వం ప్రయివేటు స్కూల్స్ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి 2 వేల రూపాయల ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం సరఫరా చేయనున్న నేపథ్యంలో సంబంధిత ప్రయివేటు ...
Read More »డ్రైవర్ కావలెను
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షులుగా గల నియామకాల కమిటీ ద్వారా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో పంపిణీ చేయబడిన సంచార రక్త సేకరణ వాహనంలో పనిచేయటానికి అనుభవం గల వైద్యుడు, డ్రైవర్ పోస్టులకు ఔట్సోర్సింగ్ పద్దతిలో పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబిబిఎస్ పూర్తిచేసి రక్తసేకరణ, వర్గీకరణ మొదలైన అంశాలలో అనుభవంగల వైద్యులు అర్హులని, వైద్యుని నెలసరి భత్యం రూ. ...
Read More »వాక్సినేషన్ కేంద్రాలు పెంచాలి
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య కేంద్రాలలో వాక్సినేషన్ పాయింట్స్ పెంచాలని, 45 సంవత్సరముల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సెల్ కాన్ఫరెన్సు ద్వారా పిహెచ్సి, సిహెచ్సి వైద్య అధికారులు, స్టాటిస్టికల్ ఆఫీసర్లతో కరోనా పరీక్షలు, ట్రేసింగ్, వాక్సినేషన్‌పై ఆరోగ్య కేంద్రాల వారిగా సమీక్షించారు. ఎర్రపహాడ్ ఆరోగ్య కేంద్రం వాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించినందుకు వైద్య సిబ్బందిని అభినందించారు. వాక్సినేషన్ నిజాంసాగర్ ...
Read More »తాగునీటికి అంతరాయం కలగకుండా చూడాలి
కామారెడ్డి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల తాగునీటికి అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ మిషన్ భగీరథ, గ్రామీణ మంచి నీటి సరఫరా ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో మున్సిపాలిటీలు, గ్రామాలలో మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజనీర్లు, మున్సిపల్ ఇంజనీర్లు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, సరఫరాలో కానీ, పైప్ లైన్ల లీకేజీలో కానీ అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించి పునరుద్దరణ చర్యలు చేపట్టాలని, గ్రామాలలో ...
Read More »అలక్ష్యం చేస్తే చర్యలు
కామారెడ్డి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను, మిల్లర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 345 కేంద్రాల ద్వారా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతున్నందున, అధికారులు మిల్లర్లు పూర్తి సమన్వయంతో పనులు చేపట్టాలని, ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ ద్వారా ధాన్యం కొనుగోళ్లను వేగంగా నిర్వహించాలని అధికారులను, కొనుగోళ్ళు చేసిన ధాన్యాన్ని ...
Read More »చత్తీస్ఘడ్ అమర జవాన్లకు నివాళి
కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఛత్తీస్ ఘడ్ బీజాపూర్‌లోని మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని భారతీయ జనతా యువ మోర్చా కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేయం రాష్ట్ర నాయకుడు నరేంధర్ రెడ్డి మాట్లాడుతూ ఛత్తీస్ ఘడ్లో జరిగిన నక్సలైట్ దాడి అతిదారుణమైన సంఘటన అని దాడులలో వీర మరణం పొందిన 22 మంది సైనికులకు వినయపూర్వక శ్రద్ధాంజలి ...
Read More »సునీల్‌ది ప్రభుత్వ హత్యయే….
కామారెడ్డి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాకతీయ యూనివర్సిటీలో పరిశోధన విద్యార్థిగా కొనసాగుతున్న సునీల్ నాయక్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కేసీఆర్ నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అబద్ధపు ప్రకటనలతో నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నారని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ...
Read More »కామారెడ్డిలో కరోన డేంజర్ బెల్స్…
కామారెడ్డి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి ఆర్టిపిఎస్, రాండమ్ రిపోర్ట్స్‌లో జిల్లాలో 93 మందికి పాజిటివ్ తేలింది. వీటిలో ఒక్క కామారెడ్డి పట్టణంలోనే 45 మందికి పాజిటివ్ వచ్చింది. భౌతిక దూరం, సానిటైజర్ వాడకం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More »సర్వే ద్వారా భూముల పరిష్కారం
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాయింట్ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల సమస్యల పరిష్కారం జరుగుతుందని జుక్కల్ నియోజకవర్గం శాసనసభ్యులు హన్మంత్ షిండే తెలిపారు. గురువారం పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో జుక్కల్ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించి రెవెన్యూ అటవీ భూముల సమస్యలపై గ్రామాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రైతులు ఎవరూ బాధపడవద్దని, వారి భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సర్వే ...
Read More »వృద్దురాలికి రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అడవి లింగాల గ్రామానికి చెందిన సత్తవ్వ (65) అనే వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన మెకానిక్ సతీష్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. గతంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడిన రక్తదాతను ...
Read More »ఆపరేషన్ నిమిత్తమై వృద్ధునికి రక్తదానం
కామారెడ్డి, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి వైద్యశాలలో ఎల్లారెడ్డికి చెందిన లతీఫ్ (80) సంవత్సరాల వృద్ధునికి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరి నరేష్ చారి మానవతా దృక్పథంతో స్పందించి ఓ పాజిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో సురేష్, టెక్నీషియన్ ...
Read More »చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామరెడ్డి, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 202 మందికి లబ్దిదారులకు 2 కోట్ల 2 లక్షల 23 వేయిల 432 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,747 మందికి 37 కోట్ల 12 లక్షల 2 వేల 332 రూపాయల కల్యాణలక్ష్మి, షాది మూభారక్ చెక్కులు ...
Read More »వాటరింగ్ డే – మొక్కలకు నీరు
కామారెడ్డి, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వాటరింగ్ డే సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ మొక్కలకు నీరు పోశారు. అనంతరం కలెక్టరేటు కార్యాలయం ప్రధాన గేటు వద్ద ప్రజల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేశ్ ధోత్రే, ఆర్డిఓ ఎస్.శీను, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, కలెక్టరేటు ఎబ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read More »ప్రతిరోజు వ్యాక్సినేషన్ రిపోర్టు సమర్పించాలి
కామారెడ్డి, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వాక్సినేషన్ ఎక్కువగా జరిగితే పాజిటివ్ రేటు తగ్గుతుందని, ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిన వారికి కోవిద్ వాక్సినేషన్ వంద శాతం జరుగాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం జనహిత భవన్లో వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిన వారికి ఆశా, ఎఎస్ఎం, అంగన్ వాడీ సిబ్బంది సహకారంతో ప్రతి ఆరోగ్య కేంద్రంలో వంద మందికి ...
Read More »వేలం ద్వారా లక్షల ఆదాయం
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా పోలీసు స్టేషన్లో పనిచేయని జనరేటర్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్, ఫర్నీచర్, ఇతర సామాగ్రిని గురువారం వేలం వేసినట్టు ఆర్మ్డ్ రిజర్వ్ డిఎస్పి ఉదయకృష్ణ తెలిపారు. కాగా వీటి ద్వారా రూ. 2 లక్షల 65 వేల 500 ఆదాయం సమకూరినట్లు చెప్పారు. జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్ కార్యాలయంలో గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. డిపివో ఏవో జగపతిరాజు, స్టోర్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ నరసింహరావు, కమ్యూనికేషన్ ఎస్ఐ ...
Read More »మొక్కలు వందశాతం బతికేలా చూడాలి
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గర్గుల్‌లో పల్లె ప్రకృతి వనంను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. మొక్కల చుట్టూ పాదులు పెద్దగా చేయాలని సూచించారు. ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీటిని అందించాలని కోరారు. నాటిన మొక్కలు 100 శాతం బతికే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ రవితేజ గౌడ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, డిపిఓ సాయన్న తదితరులు పాల్గొన్నారు.
Read More »