Breaking News

Tag Archives: MLA

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బాధితులకు పంపిణీ చేశారు. 15 మంది లబ్ది దారులకు 6 లక్షల 70 వేల 500 రూపాయల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ నీతూ కిరణ్‌, నుడ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, తెరాస కార్పొరేటర్లు, కో అప్షన్‌ మెంబర్లు నాయకులు పాల్గొన్నారు.

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయంగా చెక్కులు మంజూరు చేయించారు. సిరికొండ మండల కేంద్రానికి చెందిన రాజనర్సుకి 24 వేలు, సిరికొండ మండల కేంద్రానికి చెందిన నాగమణికి 19 వేల 500 చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు ...

Read More »

ధైర్యంగా కరోనాను ఎదుర్కొండి

నిజామాబాద్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి వ్యాధిని నిర్మూలించడానికి ప్రజలందరూ ధైర్యంగా ఎదుర్కోవాల‌ని, వ్యాధి సోకగానే అధైర్య పడవద్దని, వ్యాధిగ్రస్తుని పట్ల ఎలాంటి వివక్షత చూపవద్దని, సరైన డాక్టర్ సల‌హాలు, సూచనలు పాటిస్తే కరోనాను జయించవచ్చని నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు, బాజిరెడ్డి హెల్త్‌ కేర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్‌ కరోనా వ్యాధితో పోరాడుతున్న వారికి పలు సూచనలు చేస్తూ బాజిరెడ్డి హెల్త్‌ కేర్‌ ఫౌండేషన్‌ మెడిజన్‌ ధర్పల్లి ఫార్మసీలో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ...

Read More »

స్వచ్ఛ గాంధారి

గాంధారి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం గాంధారి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ గాంధారిలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తడి పొడి చెత్త బుట్టలు ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ చేతుల‌ మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా పరిశుభ్రత కొరకు చెత్తబుట్టలు సద్వినియోగం చేసుకొని పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని కోరారు. కార్యక్రమంలో గాంధారి మండల‌ నాయకులు పాల్గొన్నారు.

Read More »

తెరాసలో చేరిన ఎంపిటిసి నిమ్మ శంకర్‌

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల‌ కేంద్రం 1వ ఎంపీటీసీ సభ్యుడు నిమ్మ శంకర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సమక్షంలో తెరాసలో చేరారు. గులాబీ కండువా వేసి టిఆర్‌ఎస్‌లోకి ఎంపీటీసీ శంకర్‌ను గంప గోవర్ధన్‌ ఆహ్వానించారు. ఎంపీటీసీ సభ్యుడు శంకర్‌ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్దే ల‌క్ష్యంగా పని చేస్తున్న ఎమ్మెల్యే బాటలో తాను సైతం ఉంటానన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి మార్కెట్‌ కమిటీ ఛైర్మెన్‌ గోపిగౌడ్‌, మాజీ జడ్పీటీసీ ...

Read More »

కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండల‌ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాల‌య ఆవరణలో రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే 14 మంది ల‌బ్ధిదారుల‌కు కల్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోన నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాల‌న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత విజయ్‌, సర్పంచ్‌ విజయల‌క్ష్మి, నాయకులు తదితరులు ఉన్నారు.

Read More »

నందిపేట్‌ జడ్పిటిసి తెరాసలోకి…

ఆర్మూర్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి సమక్షంలో గురువారం నందిపేట్‌ జడ్పీటీసీ యమున ముత్యం తెరాస పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పథకాలు, కేసీఆర్‌ జనరంజక పాల‌న చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు ఆమె ప్రకటించారు. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహకారంతో నందిపేట్‌ మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు.

Read More »

భౌతికదూరం పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం

గాంధారి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాను నియంత్రించడంలో ప్రజలు భాగస్వాములు కావాల‌ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పిలుపునిచ్చారు. భౌతికదూరం పాటించి కరోనా మహమ్మారిని తరిమికొడదామని అన్నారు. బుధవారం గాంధారి మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో కల్యాణల‌క్ష్మి, షాదిముబారక్‌ చెక్కుల‌ను ల‌బ్ధిదారుల‌కు అందజేశారు. మండలంలో మొత్తం 31 మంది ల‌బ్ధిదారుల‌కు ఈ విడతలో చెక్కుల‌ను పంపిణి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మొత్తం దేశం కరోనా రోగంతో విల‌విల‌లాడుతోందని ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌న్నారు. మాస్క్‌ ...

Read More »

కళాకారుల‌కు నిత్యావసర సరుకుల‌ పంపిణీ

కామరెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాల‌య ఆవరణలో నూతనంగా కొనుగోలు చేసిన తడి చెత్త, పొడి చెత్త సేకరించే 10 వాహనాల‌ను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ మంగళవారం ప్రారంభించారు. అనంతరం 41 మంది మెప్మా రిసోర్స్‌ పర్సన్‌ల‌కు, 101 మంది కళాకారుల‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ ప్రస్తుత ఆపత్కాల‌ సమయంలో వైరస్‌ మహమ్మారి నిర్మూల‌నకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌కు, ఆశా వర్కర్లకు ...

Read More »

తడి, పొడి చెత్త వాహనాలు ప్రారంభం

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాపై గ్రామస్థాయిలో కళాకారులు ప్రచారం చేపట్టాల‌ని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాల‌యంలో మంగళవారం ఆయన మెప్మా రిసోర్స్‌ పర్సన్‌ల‌కు, జానపద కళాకారుల‌కు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నియంత్రణకు కళాకారులు గ్రామస్థాయిలో కళా ప్రదర్శనలు ఇచ్చి అవగాహన కల్పించాల‌ని సూచించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వ‌ల్ల‌ కలిగే ప్రయోజనాల‌ను వివరించాల‌ని కోరారు. ఏడు ల‌క్షల‌ రూపాయల‌తో ...

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతుల‌కు 25 వేల‌ రూపాయల‌ లోపు అప్పు ఉన్నవారికి ఒకేసారి రుణమాఫీ డబ్బును విడుదల‌ చేసిన సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్‌ రాంసింగ్‌, కల్హేర్‌ జడ్పీటీసీ నర్సిహ్మారెడ్డి ఆధ్వ‌ర్య‌లో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌ రెడ్డి ఆదేశాల‌మేరకు కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు కళ్ళలో ఆనందం చూస్తే కడుపునిండినట్టు ఉందని వారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కొఆప్షన్‌ సభ్యులు అలీ, వైస్‌ ఎంపిపి నారాయణ రెడ్డి, మండల‌ కోఆప్షన్‌ ఘనీ, ...

Read More »

సోడియం హైడ్రోప్లోరైడ్‌ ద్రావణం పిచికారి

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో సోడియం హైడ్రోప్లోరైడ్‌ పిచికారి చేశారు. కరోనా వైరస్‌ తరిమి వేయాల‌నే ఉద్దేశ్యంతో బుధవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ గారి ఆదేశాల‌ మేరకు 47వ వార్డు కౌన్సిర్‌ గెరిగంటి స్వప్న ల‌క్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో రెండవసారి సోడియం, హైడ్రోప్లోరైడ్‌ పిచికారి చేశారు. కావున వార్డు, పట్టణ ప్రజలు లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించి స్వీయ గృహ నిర్బంధంలో ఉండి ...

Read More »

దశాబ్దాల కల‌ నెరవేరింది

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం తాడ్వాయి మండలంలో ఎంపీ బి.బి.పాటిల్‌, స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ కల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబారక్‌కు సంబంధించిన రూ.7 ల‌క్షల‌ రూపాయల‌ చెక్కుల‌ను ల‌బ్దిదారుల‌కు పంపిణీ చేశారు. అనంతరం ఎల్లారెడ్డి పట్టణంలో 3.54 కోట్లతో 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న పెద్ద చెరువు కట్ట రోడ్డు పనుల‌ను ఎంపీ బి.బి.పాటిల్‌, ఎమ్మెల్యే జె.సురేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రోడ్డు పనులు ప్రారంభించడం ద్వారా ఎల్లారెడ్డి ప్రజల‌ దశాబ్దాల క‌ల‌ నెరవేరిందన్నారు. ...

Read More »

400 మంది ఆటో కార్మికుల‌కు నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నాగిరెడ్డిపేట్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌ డౌన్ వ‌ల్ల నెల‌ రోజులుగా ఆటోలు నడవలేక జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. కాగా ఆటోలు నడిపే నిరుపేదల‌కు మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ ఆధ్వర్యంలో ఎంపీ బి.బి పాటిల్‌ నాగిరెడ్డిపేట్‌ మండలానికి చెందిన ఆటో నడిపే 400 మంది కార్మికుల‌కు చేయూతనందించారు. ఒక్కో కార్మికునికి నిత్యావసర వస్తువుల‌తో పాటు రూ.500 లు పంపిణి చేసారు. కార్యక్రమంలో మార్కేట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ...

Read More »

నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణంలోని రహేమాన్‌ ఫంక్షన్‌ హాల్‌లో సుమారు 150 మంది క్రైస్తవ పాస్టర్‌ల‌కు ఒక్కొక్కరికి 25 కిలోల‌ బియ్యం, కిలో పప్పు, నూనె ప్యాకెట్‌, 5 కిలోల‌ వివిధ కూరగాయల‌ నిత్యావసరాల‌ కిట్లు నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, ప్రతీ ఒక్కరూ పేద ప్రజల‌కు సహాయం చేయాల‌ని సూచించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు ఉన్నారు.

Read More »

తెరాస జెండా ఆవిష్కరించిన నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్‌ పట్టణంలోని 4వ వార్డ్‌ మహా రెడ్డి భూపాల్‌ రెడ్డి కాల‌ని వద్ద టిఆర్‌ఎస్‌ పార్టీ జెండాను నారాయణఖేడ్‌ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వార్డు వాసుల‌కు నిత్యావసర సరుకులు, మాస్కులు, సానిటైజర్‌లు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోనేందుకు అందరు సామాజిక దూరం పాటించాల‌ని, లాక్‌ డౌన్‌ పాటించి ఇళ్ల వద్దనే ఉండాల‌న్నారు. బయటకు వస్తే తప్పకుండా మాస్కు ధరించాల‌ని ...

Read More »

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని బండ రెంజల్‌, పుల్క‌ల్‌ గ్రామాల్లో రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల‌ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు దళారుల‌ను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఆరుగాలం కష్టపడి పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయరాదన్నారు. రైతుల‌కు మద్దతు ధర కల్పించి, పండిరచిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి కొనుగోలు ...

Read More »

తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఇంటి వద్ద మాస్కులు పంపిణీ చేశారు. అనతరం ఎమ్మెల్యే పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెరాస యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు చెలిమెల‌ భానుప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన రక్త దాన శిభిరానికి ముఖ్య అథిదిగా ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ హాజరై స్వయంగా రక్తదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ...

Read More »

ఆటోడ్రైవర్లకు ఎమ్మెల్యే నిత్యవసర సరుకుల‌ పంపిణీ

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన నేపథ్యంలో శుక్రవారం శెట్పల్లి సంగారెడ్డిలో ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకొని ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ వారికి నిత్యవసరా వస్తువులు, 500 రూపాయలు ప్రతి ఒక్కరికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోన రక్కసిని తరిమి కొట్టాలంటే అందరూ సామాజిక దూరం పాటించాల‌ని, విధిగా మాస్కులు ధరించాల‌ని సూచించారు. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రైతు పండిరచిన ప్రతి గింజ ప్రభుత్వం ...

Read More »

పకడ్బందీగా 30 రోజుల ప్రణాళిక

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నిజాంపేట్‌ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు. శాసన సభ్యులు యం.భూపాల్‌ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోగల కందకాలలో నీరు నిలువ ఉండడంతో సర్పంచ్‌ జగదీశ్వర్‌ చారి తయారు చేయించిన బాబుల్స్‌ నీటి గుంతలలో దోమల లార్వా చనిపోవడానికి వేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతుల గురించి, రోగుల ఆరోగ్యం విషయాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ...

Read More »