Breaking News

Tag Archives: Mp Kavitha

మోపాల్‌ మండలంలో ఎంపి కవిత విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండల కేంద్రంలో నిజామాబాద్‌ ఎంపి కవిత, రూరల్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌తో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇరువురు రోడ్‌షోలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ పార్టీని గెలిపిస్తాయని, రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టడం ఖాయమని, ఇప్పటికే పలు సర్వేలు తెరాస అధికారం చేపడుతుందని తెలిపాయని అన్నారు. అదేవిధంగా రూరల్‌ ...

Read More »

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు అర్థరహితం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ అభివృద్దిపై అర్థరహిత వ్యాఖ్యలు చేశారని నిజామాబాద్‌ ఎంపి కవిత విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్‌ ఎంపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, తెలంగాణ అభివృద్దిపై రాహుల్‌గాంధీకి కనీస అవగాహన లేదని అన్నారు. గురువారం ఆర్మూర్‌ బహిరంగసభలో స్క్రిప్ట్‌ రైటర్లు రాసిన దాన్ని రాహుల్‌గాంధీ చదువుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని, రాహుల్‌గాంధీకి చిత్తశుద్ది ...

Read More »

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపి కవిత

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఎంపి కవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా సుద్దపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమంలో ఎంపి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెరాస అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తాయని అన్నారు. అభివృద్దిని అడ్డుకునేందుకు మహాకూటమి పేరిట కాంగ్రెస్‌, టిడిపి, మరో రెండు పార్టీలు జతకట్టాయని ఆమె విమర్శించారు. మహాకూటమిలో ప్రజలు ఎవరు లేరని ...

Read More »

తెరాస నాయకుడిని పరామర్శించిన ఎంపి కవిత

రెంజల్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కాలి గాయంతో బాధపడుతున్న తెరాస నాయకుడు వికార్‌ పాషాను శనివారం రాత్రి ఆయన నివాసంలో ఎంపి కవిత, మాజీ ఎమ్మెల్యే షకీల్‌లు పరామర్శించారు. గాయపడిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బోధన్‌ మాజీ ఎంపిపి గిర్దావర్‌ గంగారెడ్డి, మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, అన్వర్‌, సుల్తాన్‌ ఉన్నారు.

Read More »

బాలికల రక్తహీనత లోపం తగ్గించాలి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికల్లో రక్తహీనత లోపం తగ్గించాలని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాందీ ఆడిటోరియంలో జ్యోతి అనే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలికలకు రక్తహీనత నిర్దారణ పరీక్షల ముగింపు కార్యక్రమానికి ఆమె జిల్లా కలెక్టర్‌తో కలిసి హాజరై మాట్లాడారు. మహిళలు మనదేశంలో వారి కుటుంబ పరంగా చాలా బాధ్యతలు నిర్వహిస్తారని, అందుకు వారు ఆరోగ్యపరంగా బలంగా ఉండాల్సిన అవసరముందన్నారు. రక్తహీనత నిర్దారణ 79 శాతం మంది ...

Read More »

అంబేడ్కర్‌ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలి

రెంజల్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంతోపాటు కళ్యాపూర్‌ గ్రామంలో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ అంబేడ్కర్‌ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితను కలిసి గురువారం వినతి పత్రం సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్‌ డివిజన్‌ ఉపాధ్యక్షుడు నీరడి రవి నేతృత్వంలో ఎంపిని న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి మండలంలో దళితులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను వివరించారు. రెంజల్‌, ...

Read More »

అర్థాంతరంగా నిలిచిన పనులపై గ్రామస్తుల నిలదీత

రెంజల్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి, రెంజల్‌, కూనేపల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు యాదవరావు, చందూరు సవిత, ఆకుల లక్ష్మణ్‌ అధ్యక్షతన వర్షాకాలపు గ్రామసభలు గురువారం ప్రారంభించారు. ఎంపి కవిత దత్తత గ్రామం కందకుర్తి కావడం వల్ల 85 లక్షల నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీల పనులకుగాను శ్రీకారం చుట్టారు. ప్రారంభమైన పనులు నిర్లక్ష్యంగా వదిలి వేయడంతో స్థానిక ప్రజలకు సమస్యగా ఏర్పడింది. దీంతో సభ్యులతోపాటు గ్రామస్తులు సర్పంచ్‌ యాదవరావు పనితీరుపై మండిపడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ...

Read More »

ఎంపి కవితను విమర్శించే స్థాయి అర్వింద్‌కు ఎక్కడిది?

రెంజల్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన పార్లమెంటు సభ్యురాలిగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది గత నాలుగేఫళ్లుగా విశేషంగా పాలన అందిస్తున్న నిజామాబాద్‌ ఎంపి కవితను విమర్శించే స్థాయి బిజెపి నాయకుడు అర్వింద్‌కు ఎక్కడిదని రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు ఆరోపించారు. మండలంలోని సాటాపూర్‌ చౌరస్తాలో బుధవారం ఆయన ఏఎంసి వైస్‌ఛైర్మన్‌ ధనుంజయ్‌, మైనార్టీ సెల్‌ నాయకుడు రఫిక్‌, సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌తో కలిసి మాట్లాడారు. ఇటీవలే తమ నాయకురాలు ...

Read More »

అన్ని కులాలకు తగిన ప్రాధాన్యత

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని కులాలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని నిజామాబాద్‌ ఎంపి కవిత కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఎంపి కార్యాలయంలో 16 మున్నూరుకాపు సంఘాల ప్రతినిదులతో ఆమె సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని, అన్ని కులాలు సామాజికంగా, ఆర్తికంగా బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆమె అన్నారు. మున్నూరుకాపుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకొని లబ్దిపొందాలని ఆమె సూచించారు. కుల పెద్దలు పథకాల పట్ల ...

Read More »

ఎంపి కవితను కలిసిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌

నిజామాబాద్‌ టౌన్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితను బుధవారం హైదరాబాద్‌లోని ఎంపి నివాసంలో కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరీన్‌ను ఎంపి అభినందించారు. ఇటీవల బెలెగ్రేడ్‌లో జరిగిన 56వ అంతర్జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జరీన్‌ బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. జరీన్‌ తోపాటు అసముద్దీన్‌ అంతర్జాతీయంగా తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు తెచ్చారని ఎంపి ప్రశంసించారు. వీరిద్దరు నిజామాబాద్‌కు చెందినవారు కావడం నగరవాసులకు సంతోషకరవిషయమన్నారు. ...

Read More »

బుధవారం పలుకార్యక్రమాల్లో పాల్గొననున్న ఎంపి కవిత

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత బుధవారం బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ది, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మెండోరా మండలం పోచంపాడ్‌ వద్ద జాతీయరహదారి 44 నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరకు కోటి 94 లక్షలతో బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పైన కట్టవెంబడి రూ.12.8 కోట్లతో బిటిరోడ్డు, రక్షణ గోడ నిర్మాణ పనులకు ఎంపి శంకుస్థాపన చేయనున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో మిషన్‌ భగీరథలో భాగంగా ...

Read More »

తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన హస్ముద్దిన్‌

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన క్రీడాకారుడు హస్ముద్దిన్‌ అని ఎంపి కవిత అన్నారు. కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన 24 ఏళ్ళ బాక్సర్‌ హస్ముద్దిన్‌ శుక్రవారం నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖండాంతరాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటిన హస్ముద్దిన్‌ను ఈ సందర్భంగా ఎంపి ప్రశంసించి సత్కరించారు. హస్ముద్దిన్‌ ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఎంపి ఆకాంక్షించారు. హస్ముద్దిన్‌ తన ప్రతిభతో భారతీయులు గర్వించేలా చేశారని ...

Read More »

కేంద్ర వ్యవసాయ మంత్రికి ఎంపి లేఖ

నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌కు లేఖ రాశారు. వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఆత్మ) ఢిల్లీలో నిర్వహించే సమావేశాలకు హాజరయ్యే రైతులకు రోజువారిగా ప్రస్తుతం ఇస్తున్న రూ. 800 లను రూ. 2 వేలకు పెంచాలని ఎంపి కవిత మంత్రికి రాసిన లేఖ ద్వారా కోరారు. గత 20 ఏళ్ళుగా రోజువారిగా చెల్లించే మొత్తాన్ని పెంచలేదని, దూరప్రాంతాలనుండి ఆత్మ ...

Read More »

పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపి కవిత

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత గురువారం పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బర్కత్‌పుర, గోల్‌హనుమాన్‌, రాజీవ్‌గాంధీ ఆడిటోరియం ప్రాంతాల్లో బిటి రోడ్లకు శంకుస్తాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ నగర అభివృద్దికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని, నగర అభివృద్ది కొరకు ఇప్పటికే వందకోట్ల నిధులు మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రానున్న వేసవి దృష్టిలో ఉంచుకొని ...

Read More »

హనుమాన్‌ ఆలయంలో ఎంపి కవిత ప్రత్యేక పూజలు

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత గురువారం నగరంలో ప్రసిద్దిగాంచిన గోల్‌హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ చేరుకున్న కవిత ఆలయంలో పూజలు నిర్వహించారు. కవితకు ఆలయ సిబ్బంది శాలువతో సత్కరించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌, డైరెక్టర్లు, నగర మేయర్‌ ఆకుల సుజాత, తదితరులున్నారు.

Read More »

ఎంపి కవితకు ప్రధాని మోడి జన్మదిన శుభాకాంక్షలు

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత జన్మదినం పురస్కరించుకొని దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగులో లేఖ పంపారు. ఈ లేఖలో మీ జన్మదినం సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి… మీరు దేశ ప్రజలకు సేవలందించేందుకు కావాల్సిన ఆరోగ్యకర, ఆనందకర జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నట్టు లేఖలో ప్రధాని పేర్కొన్నారు.

Read More »

ప్రెస్‌క్లబ్‌లో ఎంపి జన్మదిన వేడుకలు

    నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కత్తుల రాజేశ్‌, వాగ్మారే సుభాష్‌ కేక్‌కట్‌ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్‌ అభివృద్దికి ఎంపి 30 లక్షల నిదులు మంజూరుచేశారని, అందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ కార్యవర్గ సభ్యులు మాజీ అధ్యక్షులు, సీనియర్‌ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, విలేకరులు పాల్గొన్నారు.

Read More »

పిట్లంలో ఎంపి కవిత జన్మదిన వేడుకలు

  పిట్లం, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జడ్పిటిసి ప్రతాప్‌రెడ్డి కేక్‌కట్‌ చేసి పంచిపెట్టారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ ఏర్పాటుచేసే క్రమంలో ప్రజల మన్ననలు పొందిన కవిత మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల జాగృతి కన్వీనర్‌ నర్సాగౌడ్‌, వైస్‌ ఎంపిపి నర్సాగౌడ్‌, ...

Read More »

ఘనంగా ఎంపి కవిత జన్మదిన వేడుకలు

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో రైల్వే స్టేషన్‌ ఆవరణలో అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా పార్టీ కార్యాలయంలో తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు ప్రారంభించారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయంలో జరిగిన కవిత జన్మదిన వేడుకల్లో నగర మేయర్‌ ఆకుల సుజాత కేక్‌ కట్‌ చేసి ...

Read More »

మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎంపి కవిత

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ఆదివారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి నిజామాబాద్‌ జిల్లా నాగారం తెలంగాణ మైనార్టీ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వసతులను, రికార్డులను పరిశీలించారు. వసతి గృహాల్లో ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఎంపి అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రబుత్వం మైనార్టీ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, మైనార్టీ విద్యార్థినిలు ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో మంచి స్థానంలో చేరుకోవాలని వారికి మైనార్టీ ...

Read More »