Breaking News

Tag Archives: Nizamabad Collector rammohan rao

హరితహారానికి సిద్దమవ్వండి

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు ప్రారంభమైనందున హరిత హారంలో మొక్కలు నాటడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ ఆదేశాలు జారీ కాగానే మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉన్నందున లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాలలో, మున్సిపాలిటీలలో రహదారుల ప్రక్కన, ఇతర ప్రాంతాలలో మొక్కలను పెద్ద ...

Read More »

భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ రెవెన్యూ భూముల విషయంలో సంయుక్త విచారణ జరిపి సమస్యలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం తన ఛాంబర్లో అటవీ, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు శాఖలకు సంబంధించిన భూముల వివరాలకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలను ఇరు శాఖల సంయుక్త విచారణ ద్వారా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు అటవీశాఖ హద్దులకు సంబంధించి కూడా అపరిష్కతంగా ఉన్న సమస్యలను పరిశీలించాలన్నారు. రెవెన్యూ భూములకు ...

Read More »

30లోగా ఓటర్ల గణన పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నగరపాలక సంస్థ మున్సిపాలిటీలలో బిసి ఓటర్ల గణన సర్వే ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్‌లో రాబోయే ఎన్నికల ఏర్పాట్లపై మున్సిపల్‌ కమిషనర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. బీసీ ఓటర్ల గణన సర్వే జూలై 4వ తేదీ లోగా పూర్తి చేయాలని ప్రభుత్వము నిర్దేశించిన నందున జిల్లాలో మాత్రం ఈనెల 30వ తేదీలోగా పూర్తి ...

Read More »

ఆర్థిక గణన పక్కాగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ఆర్థిక విషయాలకు సంబంధించి గణన పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ఏడవ ఆర్థిక గణనకు సంబంధించి సెన్సస్‌ నిర్వహించే సూపర్‌వైజర్లకు ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాథమిక ఉత్పత్తి విద్యుత్తు సరఫరా త్రాగునీటి సరఫరా నిర్మాణాలు, వ్యాపారాలు సేవలకు సంబంధించిన ప్రజలకు అందుతున్న సేవలు ప్రజల ఆర్థిక అభివద్ధిపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఏడవ ...

Read More »

వర్షాలు కురుస్తున్నాయి… అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వర్షాలు పడుతున్నందున రైతులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను కోరారు. సోమవారం ప్రగతిభవన్‌లో గ్రీవెన్స్‌డే సందర్భంగా సమావేశమైన అధికారులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున రైతులకు విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటాయో క్షేత్రస్థాయి అధికారులతో రోజు వారిగా సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ...

Read More »

ఋతుపవనాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుతుపవనాలు ప్రారంభం కానున్నందున అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో రాబోయే రుతుపవనాలను దష్టిలో పెట్టుకొని అవసరమైన చర్యలకై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ శాఖలు, వైద్య ఆరోగ్యశాఖ వారి వంతుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ముందే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ...

Read More »

ప్రజల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ

జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జూన్‌ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, అటవీ శాఖ, జన విజ్ఞాన వేదిక, ఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుండి బస్టాండ్‌ ద్వారా బాల్‌ భవన్‌ వరకు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ర్యాలీని ప్రారంభించిన అనంతరం బాలభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచీకరణ, నగరీకరణ, జనాభా ...

Read More »

ప్రశాంతంగా స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెలలో స్థానిక సంస్థలైన జెడ్‌పిటిసి, ఎంపీటీసీలకు 6, 10, 14 తేదీలలో నిర్వహించిన ఎన్నికలకు ఈనెల 4న మంగళవారం జిల్లాలోని మూడు డివిజన్లలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ స్థాయిలో 297 ఎంపీటీసీలు, 26 జడ్పిటిసిలకు ఓట్ల లెక్కింపు ఆయా డివిజన్‌ పరిధిలో నిర్వహించగా కలెక్టర్‌ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్‌ ...

Read More »

మండల జిల్లా పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికలకు సమయాన్ని పాటించాలి

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ జారి చేసిన సమయాన్ని కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ, జెడ్‌పి అధ్యక్ష ఎన్నికలకు విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు పార్టీల వారీగా పరోక్షంగా జరగనున్నందున రాష్ట్ర ఎన్నికల ...

Read More »

ప్రభుత్వ పథకాలు త్వరితగతిన పూర్తిచేయాలి

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశం సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివద్ధి పథకాలను నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికను తయారు చేసుకొని తద్వారా అమలు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో వివిధ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ...

Read More »

ఆవిర్భావ వేడుకలకు ఘనమైన ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భా దినోత్సవ వేడుకల సందర్భంగా ఘనమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై ఆయా జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జెడ్‌పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఇంకా అమలులో ఉన్నందున దాన్ని అనుసరించి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. వేడుకలు గతంలో కంటే భిన్నంగా ఉంటాయని అందుకు పటిష్టమైన ...

Read More »

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27న జరుగు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బంది ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌ నుండి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు నియామకం పూర్తి చేసి శిక్షణ ...

Read More »

పలు శాఖలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్పరెన్సు

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) కింద మంజూరు చేసిన వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం, పెండింగ్‌ వాటిని వెంటనే పూర్తి చేసి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించేలా జిల్లా కలెక్టర్‌లు దష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె జోషి అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ సచివాలయం నుండి పంచాయతి రాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్‌ ...

Read More »

పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు వసతులు కల్పించాలి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్‌ డివిజన్‌లో జరుగు మూడో విడత జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు సందర్భంగా ఆదివారం సాయంత్రం వేల్పూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో చల్లటి త్రాగునీరు, టెంటు, ఓఅర్‌యస్‌ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని, దివ్యాంగులకు ...

Read More »

సిఎంసిని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన డిచ్‌పల్లిలోని సీఎంసీని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పర్యటించి పరిశీలించారు. ఆదివారం ఆయన క్రిస్టియన్‌ కళాశాలలో పర్యటించి పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి ఈవిఎంలను భద్రపరిచిన రూములను వాటికి వేసిన సీల్‌లను పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బందిని, అందుబాటులో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజిటర్స్‌ రిజిస్టర్లో పర్యటించిన వారి వివరాలను పరిశీలించారు. రిజిస్టర్లో తాను పర్యటించిన వివరాలను నమోదు చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే ...

Read More »

ధాన్యం సేకరణలో సమస్యలు రాకుండా చూడండి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నుండి సేకరిస్తున్న వరి ధాన్యానికి రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన చాంబర్లో పౌరసరఫరాల శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోనె సంచులు వీలైనంత ఎక్కువగా అందుబాటులో ఉంచాలని, వాటిని ఎక్కడ నుండి లభిస్తే అక్కడ నుండి తెప్పించాలని తెలిపారు. అదేవిధంగా ధాన్యం సేకరణలో నిర్ణీత ...

Read More »

నేడు రెండోవిడత

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ డివిజన్‌లో రెండో విడత జడ్పీటిసి ఎంపిటిసి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసినందున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జిల్లాలో రెండో విడత జెడ్‌పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు బోధన్‌ డివిజన్‌లోని 8 మండలాల్లో ఈ నెల 10 వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగతుందని చెప్పారు. 8 జడ్పీటిసిలు, ...

Read More »

పోలింగ్‌ ప్రశాంతం

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ డివిజన్లో జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. నిజామాబాద్‌ డివిజన్లో జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. 8 జడ్పిటిసిలకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా మిగతా ఏడు జడ్పిటిసిలకు, 100 ఎంపీటీసీలకు గాను ఆరు ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా 94 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్‌ను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్‌ ...

Read More »

వెబ్‌కాస్టింగ్‌ పరిశీలన

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ డివిజన్లో జరుగు ఎంపీటీసీ జెడ్‌పిటిసి ఎన్నికలలో ఎన్నిక సరళిని పరిశీలించేందుకు ప్రగతిభవన్లో ఏర్పాటుచేసిన వెబ్‌ కాస్టింగ్‌ను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా 49 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క తొలి కేంద్రం ఓపెన్‌ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 135 సున్నిత అతి సున్నిత పోలి కేంద్రాలుగా పోలీసు శాఖ గుర్తించినందున అలాంటి కేంద్రాలలో ఏలాంటి ...

Read More »

మొదటి విడత నేడే

పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలు నైతికతను పాటించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టమవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జిల్లాలో మొదటి విడత జెడ్‌పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు నిజామాబాద్‌ డివిజన్లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్‌ మోపాల్‌, నవీపేట నిజామాబాద్‌, సిరికొండ మండలాలలో 8 జడ్పీటిసిలు, 100 ఎంపీటీసీలు కాగా అందులో 7 జడ్పీటిసి లకు, 94 ఎంపిటిసిలకు ఎన్నికలు ...

Read More »