Breaking News

Tag Archives: Nizamabad

కార్మికుల‌ సంఖ్య పెంచాలి

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఏఐటియుసి మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై ఓమయ్య, పి నర్సింగ్‌ రావు మాట్లాడుతూ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బెడ్‌ల‌కు సరిపడా కార్మికులు, సిబ్బంది లేరని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆసుపత్రి ఆవరణకు రావడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆస్పత్రి సిబ్బంది తమ ప్రాణాల‌ను పణంగా పెట్టి కరోనా ...

Read More »

వారి వ‌ల్ల‌నే నేడు స్వేచ్ఛ

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తమలాంటి పెద్ద వ‌ల్ల‌నే ఈరోజు స్వేచ్ఛగా దేశ ప్రజలు అందరం ఉండగలుగుతున్నామని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఆలంబన ఆర్‌బివిఆర్‌ఆర్‌ సొసైటీ ముబారక్‌ నగర్‌ ఆశ్రమంలో కమ్మర్‌పల్లి మండలం హాస కొత్తూరు గ్రామానికి చెందిన హనుమంత్‌ రెడ్డి, స్వాతంత్ర సమరయోధుడిని సన్మానించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఆగస్టు 15 సందర్భంగా నిర్వహించే స్వాతంత్య్ర సమరయోధుల‌ సన్మాన కార్యక్రమాన్ని కరోనా -19 ...

Read More »

ధైర్యంగా కరోనాను ఎదుర్కొండి

నిజామాబాద్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి వ్యాధిని నిర్మూలించడానికి ప్రజలందరూ ధైర్యంగా ఎదుర్కోవాల‌ని, వ్యాధి సోకగానే అధైర్య పడవద్దని, వ్యాధిగ్రస్తుని పట్ల ఎలాంటి వివక్షత చూపవద్దని, సరైన డాక్టర్ సల‌హాలు, సూచనలు పాటిస్తే కరోనాను జయించవచ్చని నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు, బాజిరెడ్డి హెల్త్‌ కేర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్‌ కరోనా వ్యాధితో పోరాడుతున్న వారికి పలు సూచనలు చేస్తూ బాజిరెడ్డి హెల్త్‌ కేర్‌ ఫౌండేషన్‌ మెడిజన్‌ ధర్పల్లి ఫార్మసీలో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ...

Read More »

వీరిని ఆదర్శంగా తీసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సివిల్స్‌ ఫలితాల‌లో 296 ర్యాంక్‌ సాధించిన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం, మాచర్ల గ్రామానికి చెందిన సచిన్‌ను రాష్ట్ర రోడ్లు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సన్మానించారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తికి 296 ర్యాంకు రావడం చాలా గర్వించదగ్గ విషయమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. భవిష్యత్తులో సివిల్స్‌ అటెండ్‌ అయ్యే వారు వీరిని ఆదర్శంగా తీసుకోవాల‌న్నారు. దళిత కుటుంబంలో పుట్టిన బిడ్డకు ...

Read More »

12 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సివిల్‌ హమాలీల‌ గత వేతన ఒప్పందం డిసెంబర్‌ 31, 2019 తో ముగిసిందని, జనవరి 1, 2020 నుండి నూతన వేతన ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉందని, దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో సివిల్‌ సప్లైస్‌ రాష్ట్ర కమిషనర్‌కి, సివిల్‌ సప్లైస్‌ మినిస్టర్‌కి జిల్లా మేనేజర్లకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య అన్నారు. శుక్రవారం నిజాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం ...

Read More »

చేనేత మండలి రద్దు సరికాదు

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేనేత అభివృద్ధి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అఖిల‌ భారత చేనేత మండలి రద్దు సరికాదని నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం అద్యక్షుడు దీకొండ యాదగిరి అన్నారు. నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో శుక్రవారం కోటగల్లిలోని సంఘ భవనంలో చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాదు నగరానికి చెందిన చేనేత కార్మికుల‌ను సన్మానించారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ చేనేత మండలి రద్దు వ‌ల్ల‌ చేనేత రంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ...

Read More »

15లోపు ప్రారంభం కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెత్తను విడదీసే ప్రక్రియ ఆగస్టు 15 వ తేదీలోపు మొదల‌వ్వాని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఎంపీవోలు, పంచాయతీ అధికారుల‌తో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్వహణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో దాదాపు 400 గ్రామ పంచాయతీలో సెగ్రిగేషన్‌ షెడ్లు పూర్తి అయినాయని, మిగిలినవి త్వరలో పూర్తి కానున్నాయని, అన్ని గ్రామ పంచాయితీలో ఆగష్టు 15 తేదీ నుండి తప్పనిసరిగా చెత్తను విడతీసి రీసైక్లింగ్‌కు ...

Read More »

త్వరలో ప్రారంభం….

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాల‌య నిర్మాణ పనుల‌ను రాష్ట్ర రోడ్లు-భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల‌ ముంగిటకే పాల‌న వెళ్లాల‌న్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణలో భాగంగా 10 జిల్లాలున్న తెలంగాణలో 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి 33 జిల్లాల తెలంగాణగా చేశారన్నారు. అలా ఏర్పడిన జిల్లాలో ప్రజల‌ సౌకర్యార్థం ప్రభుత్వ ఫలాలు ఒకే ...

Read More »

వైరస్‌ నివారణ చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశాల‌ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల‌ రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లాలో కోవిడ్‌ మేనేజ్‌ మెంట్‌ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ఆస్పత్రుల‌ సూపరింటెండెంట్ ల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ, స్థానిక జిల్లా మంత్రుల సల‌హాలు, సూచనల‌తో జిల్లాలో కరోనా వైరస్‌ ...

Read More »

పూచీకత్తు లేని రుణాలు అందించడానికి కృషి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల‌కు గ్యారెంటీ ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ క్రింద పూచీకత్తు లేని రుణాలు అంధించడానికి కలెక్టర్లు కృషి చేయాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల‌కు ఆత్మ నిర్బర్‌ అభియాన్‌ ప్యాకేజిపై జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎక్కువ మందికి ల‌బ్ది చేకూర్చే విధంగా జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలోని పరిశ్రమ ...

Read More »

ఆఫీసుకు పబ్లిక్‌ రావటాన్ని తగ్గించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డు, హరితహారం, వైకుంఠధామం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లేబర్‌ టర్నోవర్‌ తదితర అంశాల‌పై జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డిఓలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మెడికల్‌ ఆఫీసర్లు, అటవీశాఖ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కోవిడ్‌ నేపధ్యంలో ప్రతి ఒక్క అధికారి తమ సిబ్బందితో పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, పబ్లిక్‌ను వీలైనంత వరకు ఫోన్‌ ద్వారా, ...

Read More »

కరోనా కంట్రోల్ సెల్‌ నెంబర్‌ ఇదే….

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల‌యంలో నిపుణులైన వైద్యుల‌చే కరోనా కంట్రోల్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్‌ సెల్‌ 24 గంటలు పనిచేస్తుందని, జిల్లా ప్రజల‌కు కరోనాపై ఎలాంటి సందేహాలు ఉన్నా, సమస్యలున్నా 8309219718 నెంబర్‌లో సంప్రదించాల‌ని పేర్కొన్నారు.

Read More »

నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ అనేది కరోనా వైరస్‌ ద్వారా వ్యాపించే సాధారణమైన జలుబు లాంటి వ్యాధి అని, దీనికి అతిగా భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాల‌న్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటివద్దే 17 రోజుల‌ పాటు గృహ నిర్బంధంలో ఉంటూ వైద్యశాఖ సూచనలు పాటించాల‌న్నారు. హోం ఐసోలేషన్‌ కిట్‌లోని మందులు వాడాల‌ని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, రెండు ...

Read More »

మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌ బారినపడి మైల్డ్‌ సింప్టమ్స్‌ కలిగి ఉండి, ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికోసం మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ జిల్లాలో మైల్డ్‌ సింప్టమ్స్‌ ఉండి, ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండటానికి అవసరమైన వసతులు లేనివారి కోసం అన్ని వసతుల‌తో మాక్లూర్‌ లోని నర్సింగ్‌ కాలేజీలో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, సెంటర్లో ...

Read More »

అవసరమైన మెటీరియల్‌ అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదికల‌ నిర్మాణం పై సంబంధిత అధికారుల‌తో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 106 రైతు వేదికల‌కు గాను 104 మొదలు పెట్టారని, వాటి పురోగతి, సమస్యలుంటే వాటి పరిష్కారానికి చేపట్టవల‌సిన చర్యలు తదితర అంశాల‌పై సమీక్షించారు. ప్రతి మండలంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికల‌కు సంబంధించిన కాంట్రాక్టర్‌ మరియు అధికారుల‌తో సమీక్షించారు. కొన్ని ...

Read More »

వృత్తి నిబద్ధతకు మారుపేరు వందన కుమారి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తి నిబద్ధతకు మారుపేరు హిందీ పండిట్‌ వందన కుమారి అని ఖలీల్‌ వాడి తెలుగు మీడియం ఇంచార్జ్‌ పిజి హెచ్‌ఎం గంగయ్య అన్నారు. మంగళవారం 300 కోటర్స్‌లోని ఖలీల్‌వాడి హైస్కూల్‌లో వందన కుమారి పదవీ విరమణ కార్యక్రమాన్ని కోవిడ్‌ నిబంధనల‌కు లోబడి నిర్వహించారు. కార్యక్రమానికి గంగయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గత 27 సంవత్సరాలు తను సర్వీస్‌ను విజయవంతంగా నిర్వహించి ఎంతోమంది విద్యార్థుల‌ను తన సబ్జెక్టులో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత వందన కుమారిదన్నారు. ...

Read More »

ప్రముఖ కవి ఎండల‌ నర్సింలు మృతి

నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ కవి విశ్రాంత తెలుగు పండితుడు ఎండెల‌ నరసింహులు ఆదివారం మరణించారు. నరసింహులు ఇటీవల‌ శ్రీ ల‌క్ష్మీ నరసింహస్వామి శతకం, కుంతీపుత్ర శతకము రచించారు. జిల్లాలో, రాష్ట్రంలో జరిగిన పలు కవిసమ్మేళనాల‌లో పాల్గొని తమ కవితా గానం చేశారు. పద్య రచనలో చేయి తిరిగిన ఆయన ఎన్నో ఖండికలు రచించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని భాషాభిమానాన్ని చాటారు. ఆయన మరణం పట్ల హరిదా రచయితల‌ సంఘం అధ్యక్ష ...

Read More »

ప్రభుత్వ పనులు, కార్యక్రమాలు చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం, రైతు వేదికలు, శానిటేషన్‌, డంపింగ్‌ యార్డు ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ లేబర్‌ టర్న్‌ ఔట్‌ తదితర అంశాల‌పై సంబంధిత అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. కోవిడ్‌ ఇప్పటికిప్పుడు తగ్గే పరిస్థితి లేదు కాబట్టి మనం ప్రభుత్వ పనులు, ప్రోగ్రాంలు చేయాల‌ని, కోవిడ్‌ విషయంలో భయపడవద్దని, అలా అని అశ్రద్ధ చేయవద్దని, కోవిడ్‌ ...

Read More »

వాటిని గుర్తించి సీజ్‌ చేయండి

నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ చికిత్సకు ఉపయోగించే మందులు అధిక ధరల‌కు విక్రయించే మెడికల్‌ షాపుల‌ను గుర్తించి వెంటనే సీజ్‌ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, డ్రగ్‌ ఏ.డి రాజ్యల‌క్ష్మిల‌ను మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు. అధిక ధరల‌కు విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాద్యులైన మెడికల్‌ షాపుల‌పై కఠిన చర్యలు చేపట్టి, మందులు ప్రజల‌కు వాస్తవ ధరకు అందేట్టు చూడాల‌ని ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రస్తుతం ...

Read More »

వారిది పెద్ద మనసు

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌జి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు తెలంగాణ ప్రముఖ జానపద గాయని రెల‌రే గంగా తమ పెద్ద మనసు చాటుకున్నారు. న‌ల్ల‌గొండ జిల్లా నకిరేకల్‌ మండల‌ గ్రామ పంచాయతీలో ఆటో డ్రైవర్‌ కదిరే సైదులు వారి తల్లి, భార్యా ముగ్గురు చిన్న పిల్ల‌లు కరోనాతో పోరాడుతున్న విషయం తెలుసుకొని జాగృతి నకిరేకల్‌ నియోజకవర్గ ఇంఛార్జ్‌ డా.టిజి లింగం గౌడ్‌ ద్వారా నిత్యవసర సరుకులు అందజేశారు. నిత్యం గ్రామ ప్రజల‌కు సేవ‌లు అందిస్తున్న ఆ కుటుంబ సభ్యులు ...

Read More »