Breaking News

Tag Archives: Nizamabad

ఎన్‌.ఎస్‌. యూ.ఐ అధ్వర్యంలో మాస్కుల‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు, తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మణికం ఠాగూర్‌, పి.సి.సి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌ రెడ్డి ఆదేశానుసారం ఎన్‌.ఎస్‌.యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆద్వర్యంలో శుక్రవారం భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్‌ నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రజల‌కు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ ఎన్‌.ఎస్‌.యూ.ఐ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్‌ మాట్లాడుతూ శుక్రవారం భారత మాజీ ప్రధాని ...

Read More »

తగ్గుతున్న వైరస్‌ వ్యాప్తి, కేసులు

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ కేసులు 25 నుండి పది శాతానికి తగ్గాయని, వైరస్‌ వ్యాప్తి కూడా తగ్గుతున్నదని, ఆసుపత్రుల‌లో బెడ్స్‌, ఆక్సిజన్‌, రెమ్డెసివర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తుల‌ను గాంధీ, కోఠి లోని ఈఎన్‌టి ఆసుపత్రుల‌కు పంపించాల‌ని, లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో మార్కెట్లలో రద్దీని తగ్గించడానికి మరిన్ని తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేయాల‌ని, రెస్టారెంట్లు, హోటల్‌లో సీట్ల సామర్థ్యాన్ని 50 శాతానికి తగ్గించుకోవాల‌ని టిఫిన్‌ సెంటర్లలో టేక్‌ అవే మాత్రమే ...

Read More »

నిత్యావసర వస్తువుల నియంత్రణలో 15 కేసులు నమోదు

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజల‌కు నిత్యావసర వస్తువుల ధరల‌ను నియంత్రణలో ఉంచే విధంగా తీసుకునే చర్యల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 15 కేసులు నమోదు చేసినట్లు ఇందుకుగాను 32 వేల‌ రూపాయలు జరిమానా విధించినట్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర వస్తువుల‌ బ్లాక్‌ మార్కెటింగ్‌ కాకుండా, అధిక ధరల‌కు విక్రయించకుండా అక్రమాల‌కు పాల్ప‌డేవారిపై తీసుకునే చర్యల్లో భాగంగా ఈనెల‌ 16 నుండి 20వ తేదీ వరకు ...

Read More »

అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల‌ ఫులాంగ్‌ చౌరస్తా వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల‌ని గురువారం పరిశీలించారు. ఫులాంగ్‌ చౌరస్తా వద్ద నాటిన పాల్మ్‌ ట్రీ ని పరిశీలించి ప్రస్తుతం వేసవి కాలం అయినందున చెట్లకి సరిపడా నీటి వసతి కల్పించాల‌ని కోరారు. ఫులాంగ్‌ బ్రిడ్జి పైనా నిర్మిస్తున్న వాకింగ్‌ ట్రాక్‌ పరిశీలించి కాంట్రాక్టర్‌కి పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట కాంట్రాక్టర్‌ తదితరులున్నారు.

Read More »

సేవా హీ సంఘటన్‌

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌ పాల్‌ సూర్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలోని 5వ డివిజన్‌ (బోర్గాం) లో నిరుపేదల‌కు ఆహార వితరణ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్‌ సందగిరి సౌజన్య, బీజేవైయం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమందు విజయ్‌, భాస్కర్‌ రెడ్డి, ఆశీష్‌, ఉల్లెంగ నవీన్‌, నితిన్‌ రెడ్డి తదితరులు ...

Read More »

అంతరాష్ట్ర కార్మికుల‌ వివరాలు అందజేయాలి…

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌కు చెందిన కార్మికులు ఇతర రాష్ట్రాల‌లో పనిచేసి వారి స్వంత గ్రామాల‌కు తిరిగి వస్తే వారి దగ్గరలో ఉన్న, వారి పరిధిలో ఉన్న సహాయ కార్మిక అధికారుల‌కు వారి పూర్తి వివరాలు అందజేయాల‌ని ఉప కార్మిక కమీషనర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేరు, తండ్రిపేరు, వయస్సు, లింగము, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు, మోబైల్‌ నెంబర్‌, గతంలో పనిచేసిన ప్రదేశం తదితర వివరాలు అందజేయాల‌న్నారు. అలాగే రెండు జిల్లాల్లోని ఇటుక‌ బట్టీల‌ ...

Read More »

భగీరథకు ఘన నివాళి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైశాఖ శుద్ధ సప్తమి రోజున భగీరథ జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో భగీరథ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా యంత్రాంగం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోవిడ్‌ ప్రోటో కాల్‌ తో నిర్వహించారు. A solid tribute to Bhagiratha భగీరథ చిత్రపటానికి కలెక్టర్‌ నారాయణ రెడ్డి పూల‌మాల‌వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ...

Read More »

గరిబోళ్ల కోసం బీజేపీ దీక్ష

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈనెల‌ 19న బుధవారం గరిబోళ్ల కోసం బీజేపీ దీక్ష పేరుతో ఉదయం 10 గంటల‌ నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వారి వారి ఇళ్ళల్లో నిరసన దీక్ష చేయాల‌ని నిర్ణయించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాల‌ని, ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స పరిమితిని రూ .2 ల‌క్షల‌ నుంచి రూ .5 ల‌క్షల‌కు పెంచాల‌ని, తెలంగాణలోనూ ఆయుష్మాన్‌ భారత్ అమలు చేయాల‌ని ప్రధాన డిమాండ్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ...

Read More »

సీతక్క గరిట పడితే ఘుమఘుమలే

రంగారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పట్టణంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క హల్‌ చల్‌ చేశారు. సీతక్క ఏం చేసినా ప్రజాదరణ పొందుతోంది. ఆమె సర్వసాధారణంగా సహజ సిద్ధంగా ఉంటారు. ఏ పని చేసినా అంకిత భావంతో పనిచేస్తారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యే సీతక్క ఎన్‌ఎస్‌యుఐ జాతీయ నాయకుడు దినేష్‌ సాగర్‌ ఆధ్వర్యంలో రోగుల‌కు ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వంటకాల‌ ఏర్పాట్లను ఎమ్మెల్యే ...

Read More »

ప్రాధాన్య కార్యక్రమాల‌పై ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలి

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ రోగుల‌కు ఓపి సేవ‌లు పెరగాల‌ని, ల‌క్షణాలున్న వారికి కిట్స్‌ ఇవ్వాల‌ని, కొనసాగుతున్న ప్రాధాన్య కార్యక్రమాల‌పై అత్యంత శ్రద్ధ కనబరచాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి సంబంధిత అధికారుల‌తో వివిధ అంశాల‌పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌, కోవిడ్‌ రోగుల‌ ఓపి, హౌస్‌ టు హౌస్‌ సర్వే, వరి కొనుగోలు కేంద్రాల‌ వద్ద అన్లోడింగ్‌ తదితర అంశాల‌పై పిహెచ్‌సి నోడల్‌ ...

Read More »

స్కానింగ్‌ ఫీజు రూ. 2 వేల‌కు అంగీకారం

నిజామాబాద్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేషంట్ల నుండి స్కానింగ్‌ చేసినందుకుగాను ఫీజు కింద 4, 5 వేల‌ రూపాయల‌కు బదులు రూ. 2000 తీసుకోవడానికి సంబంధిత యాజమాన్యాలు అంగీకరించినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి సూచన మేరకు కలెక్టర్‌ ఆదివారం తన చాంబర్లో ఐఎంఏ ప్రతినిధులు, స్కానింగ్‌ సెంటర్ల యాజమాన్యాల‌తో తన చాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లేబరేటరీలు ఆసుపత్రుల‌ ప్రజల‌కు ...

Read More »

నిజామాబాద్‌ జిల్లాలో 2 వేల‌కే సిటిస్కాన్‌

నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి సిటీ స్కాన్‌ టెస్ట్‌ తప్పనిసరి అయినందున పేద ప్రజల‌పై అధిక ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో సిటీ స్కాన్‌ టెస్ట్‌ ధరను డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లు 2 వే రూపాయలు మాత్రమే తీసుకోవాల‌ని మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌ జిల్లా సిటిస్కాన్‌ యజమాన్యాల‌ను కోరారు. ఇందూరు సిటీ స్కాన్‌ యజమాని డా.రవీందర్‌ రెడ్డి, ఆర్మూర్‌ అమృత ల‌క్ష్మీ సిటీ స్కాన్‌ డా.జయ ...

Read More »

చికిత్స అందించక డబ్బులు తీసుకొని పంపిస్తే ఆస్పత్రుల‌పై చర్యలు

నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేవలం ఫీజుల‌ కోసం కరోనా పేషెంట్లను అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించకుండా పంపిస్తే ఆయా ఆసుపత్రుల‌పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన తిరుమల‌, మనోరమ, ప్రతిభ ప్రైవేటు ఆసుపత్రుల‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్ల వివరాలు రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ వివరాల‌ను రిజిస్టర్‌లో పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి యాజమాన్యాల‌తో మాట్లాడుతూ, పేషెంట్లకు సరైన చికిత్సను అందించగల‌ స్తోమత, పరిజ్ఞానము ఉంటేనే ...

Read More »

మహాత్మా బసవేశ్వరునికి ఘనంగా నివాళి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్‌ చాంబర్లో అధికారులు సిబ్బంది మహాత్మ బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని కోవిడ్‌ నిబంధనల‌తో ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ముఖ్యఅతిథిగా మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూల‌మాల‌వేసి జ్యోతి వెలిగించి నివాళి అర్పించారు. సాంస్కృతిక శాఖ, కలెక్టరేట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల‌ శాఖ అధికారులు, ...

Read More »

కోవిడ్‌ సేవల‌పై నిరంతర పర్యవేక్షణ

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఊహించకుండానే విరుచుకుపడి ప్రజల‌ను భయాందోళనకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తున్న కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల‌ మేరకు మంత్రిగా తాను, జిల్లా కలెక్టర్‌ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని సేవల‌ను మెరుగు పరచడంతో పాటు సదుపాయాల క‌ల్ప‌నకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి ఆర్మూర్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రుల‌లోనూ ...

Read More »

మంత్రి, కలెక్టర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండుగ సందర్భంగా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ముస్లింల‌కు, కుటుంబ సభ్యుల‌కు పండుగ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు పండుగను కుటుంబ సభ్యుల‌తో కలిసి సంతోషకర వాతావరణంలో జరుపుకోవాల‌ని కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ నిర్వహించుకోవాల‌ని వారు ప్రకటనలో కోరారు.

Read More »

ఇంటింటి సర్వేకు కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల‌ మేరకు కోవిడ్‌ నివారణకు తీసుకున్న చర్యల‌వ‌ల్ల‌ వ్యాప్తి 25 నుండి 15 శాతానికి తగ్గిందని, మరణాల‌ రేటు కూడా తగ్గిందని ఇందుకు కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు, సిబ్బందికి అభినందనలు తెలియ చేస్తున్నానని, అదేవిధంగా ఇందుకు సహకరించిన రెవిన్యూ, పోలీస్‌ అధికారుల‌కు కూడా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు రోడ్లు భవనాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ...

Read More »

వ్యాక్సినేషన్‌, కరోనా పరీక్షలు డోర్‌ టు డోర్‌ సర్వే నిర్వహించాలి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నాగారం, అర్సపల్లి పి.హెచ్‌.సిల‌ ను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్‌ డౌన్‌లో కూడా వోపి సేవ‌లు వ్యాక్సినేషన్‌ కరోనా పరీక్షలు హౌస్‌ హోల్డ్‌ సర్వే నిర్వహించాల‌ని తెలిపారు. పిహెచ్‌సిలో ఓపి రిజిస్టర్‌ పరిశీలించారు. కోవిడ్‌ వోపి. జనరల్‌ వోపి, పిహెచ్‌సి పరిశీలించారు. రెండవ డోస్‌ తీసుకోవడానికి వస్తున్నారా కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు ఈరోజు ఎన్ని జరిగాయని, కోవిద్‌ వ్యాక్సినేషన్‌ కు ఎంత మంది వచ్చార‌ని ...

Read More »

నిర్ణయించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రైవేటు ల్యాబ్‌ యాజమానులు కరోనా టెస్టుల‌ పేరుతో ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నందున జిల్లా కలెక్టర్‌ జిల్లా వ్యాప్తంగా ఆరు టాస్క్‌ ఫోర్స్‌ టీంల‌ను ఏర్పాటు చేసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. 23 కేంద్రాల‌లో తనిఖీలు చేసి కొన్ని కేంద్రాల‌లో సరియైన సౌకర్యాలు కల్పించట్లేదని విచారణలో తేలింది. వీటి విషయమై విచారణ అనంతరం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ...

Read More »

ఆన్‌లైన్‌ రిజిష్టర్‌ చేసుకున్నవారికే టీకాలు

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికే కోవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాలు వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45 సంవత్సరాలు పై బడిన వారు ప్రతి ఒక్కరు కోవిన్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకోవాల‌న్నారు. వివరాలు నమోదు చేసుకున్నవారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 42 సెంటర్లు ఉన్నాయని, నచ్చిన సెంటర్‌ను ఎంపిక చేసుకొని అక్కడికి వెళ్లి టీకా తీసుకోవచ్చని ...

Read More »