Breaking News

Tag Archives: Nizamabad

అధిక వసూలు చేస్తే కాల్‌ చేయండి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రయివేటు అంబులెన్స్‌ యజమానులు ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి హెచ్చరించారు. కరోనాను అవకాశంగా చేసుకొని ప్రజల‌ నుంచి అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. కావున అంబులెన్స్‌ ఓనర్‌లు, డ్రైవర్లు తెలంగాణ మోటర్‌ వెహికల్‌ చట్టం నిబంధనలు, డిఎం ఆక్ట్‌ 2005 అనుగుణంగా డబ్బు వసూలు చేయాల‌న్నారు. నిబంధనల‌ ప్రకారం వసూల్‌ చెయ్యని యజమానుల‌పై సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని ...

Read More »

కరోనా మరణాల‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సీపీఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఎన్‌ఆర్‌ భవన్‌లో విలేకరుల‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా (ఇన్చార్జి) కార్యదర్శి వనమాల‌ కృష్ణ మాట్లాడుతూ కరోనా వచ్చి సంవత్సరం పైగా అవుతున్నా ఇప్పటికీ నిర్ధారణ, చికిత్స సౌకర్యాల‌ విషయంలో ప్రభుత్వాల‌ దగ్గర పరిష్కారం లేకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి కానీ ప్రజల‌కు ...

Read More »

రెండు రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల‌ వర్షాల వల‌న ఏర్పడిన నష్ట నివారణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్‌ సప్లయి అధికారులు, కొనుగోలు కేంద్రాల‌ నిర్వాహకుల‌తో కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్సులో మాట్లాడారు. అకాల‌ వర్షాల‌కు తక్కువగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి తూకం వేయాల‌న్నారు. ఎక్కువ మొత్తం తడిసిన ధాన్యాన్ని బాయిల్్డ మిల్లుల‌కు పంపించాల‌ని సంబంధిత ...

Read More »

అక్రమాల‌కు పాల్ప‌డే ఆసుపత్రుల‌ నుండి సంజాయిషీ తీసుకోవాలి

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమాల‌కు పాల్ప‌డే ఆసుపత్రుల‌ నుండి సంజాయిషీ తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. రెమిడెసివర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ వాడకంపై ప్రైవేటు ఆసుపత్రుల‌లో తనిఖీ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీ అధికారులు నిజామాబాద్‌ నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల‌లో శుక్రవారం, శనివారం తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేశారు. వారి నివేదిక ...

Read More »

ప్రైవేట్‌ ఆస్పత్రుల‌ తనిఖీ

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల‌లో రెమిడెసివర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ ఉపయోగంపై జిల్లా కలెక్టర్‌ నియమించిన టాస్క్‌ఫోర్సు అధికారులు శ్రీల‌క్ష్మి, శ్రీవిష్ణు, తిరుమల‌, శ్రీ సాయి, సాయి అశ్విన్‌, జయ, మనోరమ, వేదాన్ష్‌, శ్రీ వెంకటేశ్వర, సూర్య, ప్రతిభ కిడ్స్‌ కేర్‌ తదితర ఆస్పత్రుల‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఇంజక్షన్‌తో ఆక్సిజన్‌ పేషెంట్లకు ఇచ్చిన వివరాల‌ను సరఫరా, వాడకం, నిలువ తదితర విషయాల‌ను రికార్డుల‌ ద్వారా పరిశీలించారు. రోగుల‌ కుటుంబ సభ్యుల‌కు కాల్‌ చేసి ...

Read More »

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ఘంతూత్‌ ట్రాన్సుపోర్టు అండ్‌ జనరల్‌ కాంట్రాక్టింగ్‌ నుండి తనకు రావల‌సిన 16 సంవత్సరాల‌ కష్టార్జితం ‘ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌’ (ఉద్యోగ ముగింపు ప్రయోజనాలు) ఇప్పించాల‌ని పెట్టెం కిషన్‌ అనే గల్ఫ్‌ కార్మికుడు శుక్రవారం మంచిర్యాల‌ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. మంచిర్యాల‌ జిల్లా ల‌క్షెటిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పెట్టెం కిషన్‌ అనే కార్మికుడు 2004 లో అబుదాబికి ...

Read More »

గురువారం నాటి ఘటనపై కలెక్టర్‌ ఆగ్రహం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ అని చెప్పి సెలైన్‌ వాటర్‌ ఉంచిన బాటిల్స్‌ అమ్మడం, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఈ ఇంజక్షన్లు బ్లాక్‌లో అమ్మడం ఘటనను యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తున్నదని, ఇందుకు పాల్ప‌డిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధుల‌తో ఈ విషయాల‌పై సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కరోనా వల‌న ప్రజలు రకరకాలుగా ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల ...

Read More »

పోలీసువారి హెచ్చరిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 1వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నకిలీ రెమిడెసివియర్‌ ఇంజక్షన్‌ కరోనా రోగుల‌కు విక్రయించిన ఇద్దరు వ్యక్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వాడిన రెమిడెసివియర్‌ సీసాలో సిలేన్‌ వాటర్‌ పోసి కరోనా రోగుల‌కు విక్రయించి మోసం చేసిన వారిపై కేసు నమోదు చేసి రినూండ్‌కు తరలించడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అధిక ధరల‌కు (1 ఇంజక్షన్‌ ...

Read More »

గల్ఫ్‌లో ఎగవేసిన జీతాలు ఇలా పొందవచ్చు !

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సందర్బంగా గల్ఫ్‌ తదితర దేశాల‌ నుండి వాపస్‌ వచ్చిన వల‌స కార్మికుల‌కు వారి యాజమాన్యాల‌ నుండి రావల‌సిన జీతం బకాయిలు, బోనస్‌, పిఎఫ్‌, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ఇప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల‌ని ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల ఒక ప్రకటనలో కోరారు. ‘జస్టిస్‌ ఫర్‌ వేజ్‌ తెఫ్ట్‌’ (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) ...

Read More »

27న ప్రచారం ముగించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 30 వ తేదీన బోధన్‌ మున్సిపాలిటీ లోని 18 వ వార్డ్‌కు ఎల‌క్షన్‌ జరగనున్నందున రాష్ట్ర ఎన్నికల‌ కమిషన్‌ ఆదేశాల‌ మేరకు 72 గంటల‌ ముందుగా అనగా 27వ తేదీ సాయంత్రం 5 గంటల‌ లోగా ప్రచారం ముగించాల‌ని స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్ ల‌త తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల‌ కమిషనర్‌ పార్థసారధి మున్సిపల్‌ ఎన్నికలు జరిగే జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారని, ఈ సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు ...

Read More »

నిజామాబాద్‌ జిల్లాలో కరోనాతో ఇద్దరు జర్నలిస్టుల‌ మృతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా నిజామాబాద్‌ నియోజకవర్గంలోని ధర్పల్లి మండల‌ సాక్షి దినపత్రిక పాత్రికేయుడు అల్లాడి శేఖర్‌ (48) అదేవిధంగా నిజామాబాద్‌ రూరల్ ఎల‌క్ట్రానిక్‌ మీడియా టివి-5 పాత్రికేయుడు వేణుగోపాల్‌ (49)లు కరోనాతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. గత వారం రోజుల‌ క్రితం వీరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా అల్లాడి శేఖర్‌ ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స ...

Read More »

ఖాళీగా ఉన్న స్థానిక ఎన్నికల‌కు సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల‌లో ఖాళీగా ఉన్న నాలుగు సర్పంచ్‌ 77 వార్డ్‌ మెంబర్‌ ఎన్నికల‌కు విధులు నిర్వహించే పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్ ‌ల‌త ఆధ్వర్యంలో శనివారం ఈ ప్రక్రియ నిర్వహించారు. అదనపు సిబ్బందితో కలిపి 106 మంది 106 మంది ప్రిసైడింగ్‌ అధికారులు 119 మంది అదనపు పోలింగ్‌ సిబ్బంది నియామకం గురించి ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 26వ తేదీన ...

Read More »

ఎన్నికలు వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 మహమ్మారి జిల్లాలో విస్తరిస్తున్న కారణంగా ఈ నెల‌ 25 న జరగాల్సిన నిజామాబాద్‌ జిల్లా న్యాయవాద పరస్పర సహకార సొసైటీ ఎన్నికల‌ ఓటింగ్‌ ప్రక్రియను తాత్కాలిక వాయిదా వేసినట్లు ఎన్నికల‌ అధికారులు బండారి కృష్ణానంద్‌, జగన్‌ మోహన్‌ గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీ ఎన్నికల‌ ఓటింగ్‌ ప్రక్రియ తిరిగి ఎప్పుడు నిర్వహించేది తేదీని త్వరలోనే న్యాయవాద సభ్యుల‌కు తెలియడం జరుగుతుందని జిల్లాలో న్యాయవాది సభ్యులు అందరూ సహకరించవల‌సిందిగా విజ్ఞప్తి ...

Read More »

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని యూనియన్‌ కార్యాల‌యం, కోటగల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల‌ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక రంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు కోడ్ల‌‌ను రద్దు చేయాల‌న్నారు. ప్రభుత్వరంగ సంస్థల‌ ప్రైవేటీకరణను ఆపివేయాల‌న్నారు. ప్రభుత్వ రంగ సంస్థల‌ను కాపాడుకోవడానికి కార్మిక రంగం ముందంజలో ఉండి పోరాడాల‌న్నారు. కరోనా సంక్షోభ సమయంలో దేశ వ్యాప్తంగా ...

Read More »

ఆసుప‌త్రుల్లో పడకల‌ వివరాలు ఆన్‌లైన్‌ చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల‌లో పడకల‌ వివరాలు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల‌ని తద్వారా కరోనా వైరస్‌తో బాధపడేవారు ఆయా ఆసుపత్రుల‌కు రావడానికి అవకాశం ఉంటుందని, కరోనా వ్యాధిగ్రస్తుల‌కు మెరుగైన సేవలందించడానికి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాల క‌ల్ప‌నకు కృషి చేస్తుందని, అదేవిధంగా వ్యాక్సిన్‌ కొరత లేదని ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా సరఫరా జరుగుతుందని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బుధవారం ఆయన తిరుమల‌, జయ ప్రైవేట్‌ ఆస్పత్రుల‌లో‌ ఆకస్మికంగా ...

Read More »

మరో మూడు వారాలు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున జిల్లాకు రాకపోకలు పెద్ద ఎత్తున జరగడంతో జిల్లాలో కరోనా వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని జిల్లా ప్రజలు మూడు వారాల‌ పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రజల‌కు పిలుపునిచ్చారు. మంగళవారం క్యాంపు కార్యాల‌యం నుండి మీడియా ప్రతినిధుల‌తో సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా జిల్లా ప్రజల‌కు కరోనా వైరస్‌ వ్యాప్తిపై తీసుకోవాల్సిన చర్యల‌పై మెసేజ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత ...

Read More »

కరోనా నిబంధనలు తప్పక పాటించండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 నిబంధనలు ప్రజలు అందరూ పాటించాల‌ని 1వ టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఇన్స్‌పెక్టర్‌ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎల్‌విఆర్‌ షాపింగ్‌ మాల్‌, సాయిరెడ్డి పెట్రోల్‌ బంక్‌, పూసల‌ గల్లిలో అవగాహన కల్పించారు. ప్రజలు అందరు మాస్క్‌ తప్పకుండా ధరించాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ తప్పకుండా పాటించాల‌ని, సానీటైజర్‌ వాడాల‌ని చెప్పారు. ప్రజలు అనవసరంగా బయట తిరుగవద్దని ఎవరికి అయిన ఎలాంటి కరోన ల‌క్షణాలున్నవారు సమీపంలో గల ప్రభుత్వ ...

Read More »

కోవీడు కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వైరస్‌కు సంబంధించి ప్రజల‌ నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి జిల్లాస్థాయి, డివిజన్‌ స్థాయి కంట్రోల్‌ రూమ్‌ల‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లాస్థాయి కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించి వచ్చిన కాల్స్‌ వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్‌ లో కాల్‌ చేసిన వారి వివరాల‌ను, సమస్యను నమోదు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆ విషయాల‌ను తెల‌పాల‌ని 24 గంటలు కంట్రోల్‌ రూమ్‌ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, అందుకు ...

Read More »

నిబంధనలు తప్పక పాటించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 నిబంధనలు ప్రజలు అందరూ పాటించాల‌ని 2వ టౌన్‌ నిజామాబాద్‌ పరిధిలోని మార్కెట్‌, ఖిల్లా చౌరస్తా, దుకాణ యాజమానుల‌కు అవగాహన కల్పించారు. ప్రజలు అందరు మాస్క్‌ తప్పకుండా ధరించాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ తప్పకుండా పాటించాల‌ని, సానీటైజర్‌ వాడాల‌ని చెప్పారు. ప్రజలు అనవసరంగా బయట తిరుగవద్దని ఎవరికి అయిన ఎలాంటి కరోన ల‌క్షణాలున్నవారు సమీపంలో గల ...

Read More »

గల్ఫ్‌లో మృతి, బంధువుల‌ ఊరిలో అంత్యక్రియలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఆలూర్‌కు చెందిన నలిమెల‌ జెశ్వంత్‌ రెడ్డి (29) ఇటీవల‌ బహరేన్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. అతని శవపేటిక ఆదివారం ఎయిర్‌ ఇండియా విమానంలో బహరేన్‌ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నది. ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం వారు హైదరాబాద్‌ విమానాశ్రయం నుండి శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు. మృతుడు జెశ్వంత్‌ రెడ్డి కుటుంబం నిజామాబాద్‌లో ...

Read More »