Breaking News

Tag Archives: Nizamabad

లక్కీ లాటరీ నడుపుతున్న ఇద్దరిపై కేసు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ షాకిర్‌ అలీ తన సిబ్బందితో కలిసి 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో స్మార్ట్‌ లైఫ్‌ పేరు మీద లక్కీ లాటరీ స్కీం నడుపుతున్న వారిపై దాడులు చేసి బ్రోచర్లు బుక్కులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే 4వ టౌన్‌ పరిధిలో అక్షర ఏజెన్సీ పేరుతో లక్కీ లాటరీ స్కీం నడుపుతున్న వారిపై దాడులు చేసి బ్రోచర్లు ...

Read More »

పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో వివిధ డివిజన్లలో అభివద్ధి పనులను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ భూమిపూజ చేసి ప్రారంభించారు. మంగళవారం నగరంలోని 52, 51, 57, 31 డివిజన్లలో సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను సుమారు 40 లక్షల నిధులతో అభివద్ధి పనులకు డిప్యూటి మేయర్‌ ఇద్రిస్‌ ఖాన్‌ స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. నగర అభివద్ధిలో భాగంగా ప్రతి రోజు డివిజన్లలో పనులను ప్రారంభిస్తున్నామని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే ...

Read More »

ఫ్రంట్‌ వారియర్స్‌కు సన్మానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపద్యంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌కు జెసిఐ ఇందూర్‌ ఆద్వర్యంలో మంగళవారం నిజామాబాదులో సన్మానించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎంఓగా పనిచేస్తున్న మార కీర్తిప్రియ, ఫుడ్‌ బ్యాంక్‌ ఫౌండర్‌ నవీన్‌ చంటిలను జేసిఐ సన్మానించింది. ఈ సందర్భంగా జేసిఐ ఇందూరు కార్యదర్శి, జేసీస్‌ వీక్‌ చైర్మెన్‌ తక్కురి హన్మాండ్లు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ఫ్రంట్‌ వారియర్స్‌ అభినందనీయులన్నారు. జిల్లాలో జేసిఐ వారోత్సవాల సందర్భంగా ...

Read More »

అందరి సహకారంతో మొదటి స్థానం రావడానికి కృషి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్‌, పల్లె ప్రకతి వనాల పనులు పరిశీలించటానికి దర్పల్లి మండలంలో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్పల్లి మండలంలో పల్లె ప్రకతి వనం హెడ్‌ క్వార్టర్లో ఉన్నందుకు అభినందించారు. ఇలా ప్రతి మండలంలో ఉండాలన్నారు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మొక్కలు మంచిగా కనబడుతున్నవని, ఇది మన బావి తరాలకు మనం ఇస్తున్న వరమని, ప్రతి గ్రామము పచ్చగా ఉండాలని, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ను ఎలా ...

Read More »

గడువు అక్టోబర్‌ 30కి పెంచారు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ శాఖ, ఐ.టి శాఖ మాత్యులు కెటిఆర్‌ నిర్వహించిన మున్సిపల్‌ మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సులో నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ పాల్గొన్నారు. సోమవారం మేయర్లు, కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సమావేశంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్టం స్వచ్ఛ నిర్వహణలో ముందు భాగంలో ఉండటానికి తీసుకోవలసిన చర్యల గురించి ఆదేశాలిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో అన్ని మున్సిపల్‌ కార్పోరేషన్లలో, మున్సిపాలిటీలలో చెత్త నిర్వహణ, చెత్త ...

Read More »

గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీసన్‌లో అత్యధికంగా పండనున్న 7 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లు మరియు డీలర్లను రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి మరియు డిస్ట్రిక్ట్‌ మానేజర్‌, సివిల్‌ సప్లైస్‌లను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి. సోమవారం జిల్లాలోని వ్యవసాయ, సివిల్‌ సప్లైస్‌, కో-ఆపేరటివ్‌ ...

Read More »

వాటి వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని జెసిఐ ఇందూర్‌ కార్యదర్శి తక్కూరి హన్మాండ్లు ఉద్బోదించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. జేసీస్‌ వారోత్సవాల్లో భాగంగా జేసిఐ ఇందూర్‌ ఆద్వర్యంలో సోమవారం వెల్త్‌ అవుటాప్‌ ద వేస్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిజామాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి వ్యాపారులు, ప్రజలకు బట్ట సంచులు, కాగితపు కవర్లు పంపిణీ చేశారు. అనంతరం జెసిఐ ఇందూర్‌ కార్యదర్శి హన్మాండ్లు మాట్లాడుతూ ...

Read More »

15న విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15వ తేదీ మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని పూలాంగ్‌ చౌరస్తా వద్ద విద్యుత్‌ లైన్ల మరమ్మతులు చేస్తున్న కారణంగా ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 3 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని సంబంధిత అదికారి యం.అశోక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పూలాంగ్‌, కోటగల్లి, గోల్‌హనుమాన్‌, జెండాగల్లి, శివాజీ నగర్‌, పద్మనగర్‌, హనుమాన్‌ నగర్‌, హోటల్‌ నిఖిల్‌ సాయి ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందన్నారు.

Read More »

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరిపై పెట్టిన అక్రమ కేసును నిరసిస్తూ సోమవారం నిజామాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ప్రభుత్వ విధానాన్ని పెద్ద ఎత్తున నిరసిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్‌ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కే.భూమయ్య, సిపిఎం, సిపిఐ జిల్లా నాయకులు నూర్జహాన్‌, లతా, గోవర్ధన్‌, సూరి, ఓమయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Read More »

గోసంగిలను ఎస్సి ఏ గ్రూప్‌లో చేర్చాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా గోసంగి సంఘం ఆధ్వర్యంలో జరగబోయే ఎస్సి వర్గీకరణపై స్థానిక న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీలోని గోసంగి సంఘ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఎస్సి వర్గీకరణ జరిగినప్పుడు అత్యంత వెనకబడిన మాదిగ ఉపకులం గోసంగి కులస్తులను అభివద్ధి చెందిన మాల కులస్తులతో కలిపి ఎస్సి-సి గ్రూప్‌లో చేర్చడం జరిగిందని తద్వారా గోసంగి కులస్తులు మరింత వెనకబాటుకు గురయ్యారని జిల్లా గోసంగి సంఘం అధ్యక్షులు నిరుగొండ బుచ్చన్న ఆందోళన వ్యక్తం ...

Read More »

పలు డివిజన్‌లలో హరితహారం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ను అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తతో కలిసి నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ ప్రారంభించారు. అదేవిధంగా నూతనంగా మహిళలకు ప్రత్యేకంగా నిర్మించే ఓపెన్‌ జిమ్‌ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని 8, 9వ డివిజన్‌లోని లలిత నగర్‌, శ్రీ చక్ర అసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు విక్రమ్‌ ...

Read More »

ఆరోగ్యం, స్వచ్ఛత కోసమే ఆ నిర్మాణాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల నగరంలోని గౌతమ్‌ నగర్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద, జిజి కాలేజి గ్రౌండ్‌, అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్‌ జిమ్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అర్సపల్లిలో మెటల్‌ రోడ్డు నిర్మాణం, పబ్లిక్‌ టాయిలెట్స్‌, దుబ్బ చౌరస్తాలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిజామాబాద్‌ నగరంలోని పాలీటెక్నిక్‌ కళాశాల మరియు గంగస్థాన్‌ కాలనీల్లో ఒపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, ...

Read More »

ఎస్‌.ఇ.సి.ని కలిసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు వచ్చిన సి. పార్థ సారథిని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ శనివారం మర్యాదపూర్వకంగా ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కలిశారు. అతిథి గృహానికి వచ్చిన పార్థ సారథికి వారు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. మున్సిపల్‌ కమీషనర్‌ జితేష్‌ వి.పాటిల్‌, నిజామాబాద్‌ ఆర్‌డివో రవి, డిపిఓ జయసుధ, జడ్‌పి సీఈఓ గోవింద్‌ నాయక్‌ తదితరులు కూడా ఎస్‌ఇసి ని ...

Read More »

నూతన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బీడీ యాజమాన్యాల అసోసియేషన్‌కు కార్మికుల వేతనాల పెంపుదలకు డిమాండ్‌ నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ పాత వేతనాల పెంపుదల ఒప్పందం మే 5వ తారీఖున అయిపోయిందని, మళ్లీ కొత్త వేతన ఒప్పందం ప్రకారం వేతనాలు పెంచాలని కానీ, యాజమాన్యాలు పెంచలేదన్నారు. ఈ విషయమై గతంలో యూనియన్‌ తరపున డిమాండ్‌ నోటీసు ఇచ్చినా స్పందించకపోవడం సరైంది కాదన్నారు. వెంటనే కొత్త ఒప్పందాన్ని ...

Read More »

ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో అన్ని ప్రాంతాలకు త్రాగు నీరు సరఫరా చేయాలని నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం నగర శివారు ప్రాంతాలు, అభివద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలలో ప్రజల త్రాగు నీటి అవసరాలను తీర్చాలని ప్రతి ఇంటికి త్రాగు నీరు సరఫరా చేయాలని సంబంధిత అధికారులతో కలిసి మారుమూల ప్రాంతాలలో పర్యటించారు. గత రెండు రోజులుగా వాటర్‌ పైప్‌ లైన్‌ లీకేజీ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ...

Read More »

అడ్మిషన్‌ గడువు పెంపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ మరియు పిజి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 24వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు నిజామాబాద్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బి.ఏ, బి.కాం, బిఎస్‌సి లలో అడ్మిషన్‌ పొందడానికి ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఓపెన్‌ ఇంటర్‌, ఐటిఐలో రెండు సంవత్సరాల కోర్సు చేసి పాస్‌ అయిన వారు సెప్టెంబర్‌ 24వ తేదీ లోపు అడ్మిషన్‌ తీసుకోవచ్చన్నారు. అలాగే పిజిలో ...

Read More »

నీటి సరఫరాకు రెండురోజుల అంతరాయం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండలం జలాల్‌పూర్‌ గ్రామ పరిధిలో ఎస్‌ఆర్‌ఎస్‌పి రిజర్వాయర్‌ మిషన్‌ భగీరథ ఇంటర్‌నెల్‌ వద్దగల పంపు సెట్లు మరియు అర్గుల్‌ వద్ద గల మెయిన్‌ పైప్‌లైన్‌ మరమ్మతులు చేయడం కోసం 12వ, 12వ తేదీల్లో రెండురోజుల పాటు బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌, వేల్పూర్‌ మండలాలు మరియు ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలలో గల అన్ని ఆవాసాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని మిషన్‌ భగీరథ గ్రిడ్‌ విభాగం కార్యనిర్వాహక ...

Read More »

మూడు రోజుల్లో క్లియర్‌ చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయితీలకు సంబంధించిన బిల్లులు జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం మరియు జిల్లా ట్రెసరీ విభాగాలలో చాలా రోజులుగా పెండింగులో ఉంటున్నాయని, దానివల్ల నిధుల కొరత ఏర్పడి రొటేషన్లో చేయవలసిన అనేక పనులు పెండింగులో పడుతున్నాయని తద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సర్పంచులు అదనపు కలెక్టర్‌ లత దష్టికి తీసుకువచ్చారు. అందుకు స్పందించిన అదనపు కలెక్టర్‌ సంబంధిత అధికారులకు మూడు రోజుల్లో పెండింగ్‌ బిల్లులన్ని క్లియర్‌ చేయాలని సూచించారు. క్లియర్‌ కానీ పక్షంలో ...

Read More »

ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాలపై లోన్స్‌కు సంబందించి బ్యాంకర్స్‌, జిల్లా అధికారులతో డిఎల్‌ఆర్‌సి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ రుణాలు, కోవిడ్‌ లోన్స్‌, బ్యాంకు లింకేజీ, ఎస్‌సి వెల్పేర్‌, బీసీ వెల్ఫేర్‌, ఇండస్ట్రీస్‌, ఫిషరీస్‌, డైరీ, ఆత్మ నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ సంబంధిత లోన్లపై బ్యాంకర్స్‌, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. వారంలో అన్ని ...

Read More »

భారీగా నిషేదిత పొగాకు స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ నరేందర్‌, షాకీర్‌ అలీ, సిబ్బంది కలసి టౌన్‌ పిఎస్‌ పరిధిలో నిషేధిత గుట్కా, తయారీ కేంద్రాలు, గోదాములపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేదిత పొగాకు సంచులు 175, లతీఫ్‌ లేబుల్‌ గుట్కా బ్యాగులు 43 సీజ్‌ చేశారు. గుట్కా ఫ్యాక్టరీ మెషిన్‌ – 5, తంబాకు బ్యాగులు -32, తంబాకు కెమికల్‌ లిక్విడ్‌ డ్రమ్ములు – 3, గుట్కా ...

Read More »