Breaking News

Tag Archives: Nizamabad

బడుగుల‌ ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌ రామ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అణగారిన ప్రజల‌ ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని, ఆయన ఆశయాల‌ను అనుగుణంగా ముందుకు వెళ్ళడమే మన ముందున్న ల‌క్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల‌ను ఏర్పాటు చేయగా సోమవారం నగరంలోని ఆయన విగ్రహానికి అధికారులు, అభిమానులు, ప్రజాప్రతినిధుల‌తో కలిసి ...

Read More »

గల్ఫ్‌ సంఘాల‌ ప్రతినిధుల‌ కేరళ పర్యటన

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేరళలో పర్యటించిన అధికారుల‌ బృందం ఇచ్చే అధ్యయన నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్‌ కార్మికుల‌ సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవలి బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గల్ప్‌ ప్రవాసి సంఘాల‌ ప్రతినిధుల‌ బృందం కేరళలో పర్యటించనున్నట్లు గల్ప్‌ జెఏసి నాయకులు స్వదేశ్‌ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల‌ 8,9,10 మూడు రోజుల‌ పాటు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో తమ బృందం నోర్కా, ఒడెపెక్‌, ప్రవాసి ...

Read More »

నిరుద్యోగుల‌పై ప్రభుత్వాల‌ మొండి వైఖరి నశించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఎన్‌.ఎస్‌.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బ‌ల్మూ‌ర్‌ వెంకట్‌ ఆదేశాల‌ మేరకు వరంగల్‌ జిల్లా కాకతీయ విశ్వవిద్యాల‌య విద్యార్థి బోడ సునీల్‌ నాయక్‌ ఆత్మ హత్యకు నిరసనగా నిజామాబాద్‌ ఎన్‌.ఎస్‌.యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరం ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వేణు రాజ్‌ మాట్లాడుతూ సునీల్‌ నాయక్‌ ది ముమ్మాటికీ ...

Read More »

క‌వుల‌కు ముఖ్య సూచ‌న‌…

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 75 సంవత్సరాల‌ స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఏప్రిల్‌ 3న స్వతంత్ర స్ఫూర్తి పై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారుల‌తో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ ఆదేశాల‌ మేరకు 75 సంవత్సరాల‌ స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని స్వతంత్ర భారత అమృతోత్సవ కార్యక్రమాలు 75 వారాల‌పాటు నిర్వహిస్తున్న నేపథ్యంతో ...

Read More »

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి దాన్యం కొనుగోలు కేంద్రాల ‌ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారుల‌తో వరి ధాన్యం కొనుగోళ్ల ఏర్పాటుపై మాట్లాడారు. వారం రోజుల్లో ఆయా కేంద్రాల‌కు వచ్చే ధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు సిద్ధం చేసుకోవాల‌ని ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లను అధికారులు త్వరగా పూర్తి ...

Read More »

రేపే ఎన్నికలు

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 31వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటల‌ నుండి సాయంత్రం 4:30 వరకు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జిల్లా కోర్టు రెండవ అంతస్తులో నిర్వహించనున్నట్టు ఎన్నికల‌ అధికారులు రాజ్‌ కుమార్‌ సుబేదార్‌, డి వెంకట్‌ రమణ గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు కోవిడ్‌ నిబంధనల‌కు అనుగుణంగా నిర్వహించ బడుతాయి కావున ఓటు హక్కు వినియోగించుకునె సభ్యులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాల‌ని, ...

Read More »

రైతుల‌కు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో కూలీల‌కు మంచి పనులు అప్పగించి ఆర్థికంగా పుంజుకోవడానికి కృషిచేసిన కలెక్టర్లను అభినందిస్తున్నానని అదేవిధంగా హరితహారం సమీకృత మార్కెట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అన్ని విషయాల‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ...

Read More »

నెల‌ రోజుల్లో ఆడిట్‌ వివరాలు సెటిల్‌ చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల‌కు సంబంధించి నెల‌ రోజుల్లో రెండు సంవత్సరాల‌ ఆడిట్‌ వివరాలు సెటిల్‌ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ అధికారులు, పంచాయతీ రాజ్‌ జిల్లా పరిషత్‌ ఎంపీడీవోలు దేవాదాయ శాఖ అధికారుల‌తో పెండిరగ్‌ ఆడిట్‌ వివరాల‌పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల‌ ప్రకారం ప్రజల‌ అవసరాల‌కు అనుగుణంగా స్థానిక ...

Read More »

ఓటర్ల జాబితా సిద్ధం చేయండి

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీల‌లో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డ్‌ మెంబర్లు‌ పదవుల‌ను ఎన్నికల‌ ద్వారా భర్తీ చేయుటకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాల‌ని రాష్ట్ర ఎన్నికల‌ కమిషనర్‌ సి పార్థసారథి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌ నుండి జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డ్‌ మెంబర్‌ ఎన్నికల‌కు నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉన్నందున అందుకు ముందుగా ఓటర్ల ...

Read More »

ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నందున గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల‌లో ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి మార్చ్‌ ముగిసేలోగా పూర్తిగా పన్ను వసూలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపిడిఓలు, ఏపిఓలు, ఎంపిఓలు, పంచాయతి సెక్రటరీలు, పంచాయతి రాజ్ ఏఈలు, మున్సిపల్‌ కమీషనర్ల‌‌తో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నలుగురు కమీషనర్‌లు ...

Read More »

టి.బి. నివారణలో జాతీయస్థాయి అవార్డు

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టి బి నివారణలో జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణమని, ఇందుకు పని చేసిన క్షేత్ర స్థాయి సిబ్బందిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ నెల‌ 24న ప్రపంచ టి.బి. నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా ఆసుపత్రి లో నేషనల్‌ టిబి ఎలిమినేషన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రాంభించారు.   ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ...

Read More »

నిజామాబాద్‌లో బార్లు దక్కించుకున్న వారు వీరే…

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 7 బార్లకు, బోధన్‌ మునిసిపాలిటీలో 3 బార్లకు కొత్తగా నోటిఫై చేయబడిన బార్లకు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి దరఖాస్తు దారుల‌ సమక్షంలో శనివారం నిజామాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ కార్యాల‌యంలో డ్రా తీసినట్టు సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో విజేతలు… 1. బండి దయానంద్‌ : టోకెన్‌ నెంబర్‌ 3 2. కె.సతీష్‌ : టోకెన్‌ నెంబర్‌ 9 3. బి.రాజు ...

Read More »

మహనీయుల‌ జయంతి ఉత్సవాల‌ను విజయవంతం చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్ నెల‌లో మహనీయుల‌ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాల‌ని అడిషనల్‌ కలెక్టర్ ల‌త కోరారు. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్‌ 5వ తేదీన బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి పాత అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేయాల‌ని, ఏప్రిల్‌ 11న మహాత్మ జ్యోతి బా పూలే జయంతి ఏప్రిల్‌ 14 భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ ...

Read More »

విద్యాసంస్థల‌ మూసివేత ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సమయంలో విద్యావ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, కరోనా అనంతరం గతనెల‌లో విద్యా సంస్థల‌ను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా కోలుకోలేదని పీ.డీ.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు క‌ల్ప‌న అన్నారు. ఈ మేరకు ప్రగతిశీల‌ ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యూ) ఆధ్వర్యంలో గురువారం విలేకరుల‌తో మాట్లాడారు. ఇటువంటి సమయంలో కరోనా రెండోసారి విజృంభిస్తుందనే కుంటిసాకుతో విద్యా సంస్థల‌కు సెల‌వు ప్రకటించడం విద్యా వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టడానికేనని ఆరోపించారు. ఇదంతా రాష్ట్ర ...

Read More »

ఆడిట్‌ త్వరగా పూర్తిచేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కో-ఆపరేటివ్‌ సొసైటీలో ఆడిట్‌ త్వరగా పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో కో-ఆపరేటివ్‌ సొసైటీ ఆడిటర్‌ల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో కో-ఆపరేటివ్‌ సొసైటీలు 89 ఉన్నాయని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల‌ ఆడిట్‌ త్వరగా పూర్తిచేయాల‌ని జిల్లాలోని అన్ని సంఘాల‌న్నీంటినీ లాభాల‌ బాటలో నడిపించాల‌ని సూచించారు. డీసిఓ సింహాచలం, జిల్లా సహకార ఆడిట్‌ అధికారి శ్రీనివాసులు, ఆడిటర్‌లు పాల్గొన్నారు.

Read More »

25న న్యాయవాద సొసైటీ ఎన్నికలు

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా న్యాయవాదుల‌ పరస్పర సహకార సొసైటీ ఎన్నికల‌ నియమావళి షెడ్యూల్‌ను ప్రధాన ఎన్నికల‌ నిర్వాహక అధికారులు బండారి కృష్ణానంద్‌, మల్లెపూల‌ జగన్‌ మొహాన్‌ గౌడ్‌ బుధవారం విడుదల‌ చేశారు. ఎప్రిల్‌ 15వ తేది నుండి 16వ తేది వరకు ఉదయం 11 గంటల‌ నుంచి సాయంత్రం 4 గంటల‌ వరకు నామినేషన్‌ల‌ స్వీకరణ, 17న నామినేషన్ల పరిశీల‌న, 19న నామినేషన్ల‌‌ ఉపసంహారణ, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల‌ ...

Read More »

కనీస వేతన చట్టం అమలు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కనీస వేతన చట్టం అమలు చేసి కేజీబీవీ నాన్‌ టీచింగ్‌, వర్కర్స్‌ కు 30శాతం పి.ఆర్‌.సీ పెంపుదల‌ను వర్తింపజేసేలా జీ.వో విడుదల‌ చేయాల‌ని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల‌ కేజీబీవీ నాన్‌ టీచింగ్‌, వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌ భవన్‌ కోటగల్లీలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ఇంచార్జి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అసెంబ్లీలో చేసిన వేతన పెంపు ప్రకటన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిలో ఆందోళనను ...

Read More »

బీడీ కార్మికుల‌కు కరవు భత్యం పెంపు

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల‌కు కరువు భత్యం (విడిఎ) పెంపు విషయమై తెలంగాణ ప్రగతిశీల‌ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వనమాల‌ కృష్ణ మాట్లాడుతూ పెరిగిన కరువు భత్యం ప్రకారం వెయ్యి బీడీల‌కు కరువు భత్యం అదనంగా రూ.10.40 (పది రూపాయల నల‌భై పైసలు) చొప్పున పెరిగిందన్నారు. 1 ఏప్రిల్‌ 2021 నుండి పెంపు అమల‌వుతుందన్నారు. పెరిగిన కరువు ...

Read More »

స్వాతంత్య్రాన్ని నిల‌బెట్టుకోవల‌సిన బాధ్యత అందరిదీ

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతోమంది ప్రాణ త్యాగాల వ‌ల్ల‌ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని దానిని నిబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా మరియు సెషన్స్‌ జడ్జి సాయి రమాదేవి అన్నారు. 75 సంవత్సరాల‌ స్వాతంత్ర ఉత్సవాల‌ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవములో భాగంగా బుధవారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన ఫ్రీడమ్‌ టూ-కే రన్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా అటవీ అధికారి సునీల్‌తో ...

Read More »

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు యథాతధం

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ పరీక్షలు యధాతధంగా నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండడానికె నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్ల‌డించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే పరీక్షల‌కు హాజరయ్యే విద్యార్థులు కోవిడ్‌ – 19 నిబంధనలు తప్పకుండా పాటించాల‌ని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ తెలిపారు.

Read More »