Breaking News

Tag Archives: Nizamsagar

పూజా మందిర నిర్మాణానికి భూమిపూజ

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ శక్తి పీఠాధిపతి మధు సుధానంద సరస్వతి స్వామి బుధవారం పూజా మందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. పుల్కల్‌ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సర్వేశ్వర్‌ మందిర్‌ ఆవరణలో గల స్థలంలో వేదపండితులు పూజ నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో స్థలాన్ని అయ్యప్ప సేవా సమితికి పూజా మందిరం కోసం కేటాయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విజయలక్ష్మి భూమి శెట్టి, వైస్‌ ఎంపీపీ రాజు పటేల్‌, వార్డు సభ్యులు సంతోష్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ...

Read More »

డంపింగ్‌ యార్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలం పైడిపల్లి గ్రామంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా 1.35 లక్షలతో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డ్‌ పనులకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం మొక్కలను నాటి వాటి సంరక్షణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Read More »

క్రీడా విద్యార్థులకు రాష్ట్ర అధికారి నజరానా

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత సంవత్సరం ఎల్లారెడ్డి గురుకులంలో చదివి జాతీయ స్థాయి క్రేడా పోటీలలలో సిల్వర్‌ మెడల్స్‌ సాధించిన ఇద్దరు విద్యార్థులకు 20 వేల నగదు బహుమానం లభించిందని కామారెడ్డి జిల్లా గురుకులాల సమన్వయ అధికారి ప్రిన్సిపాల్‌ జి.మహేందర్‌ వివరించారు. 2018-19 విద్యాసంవత్సరం నవంబర్‌లో తమిళనాడు రాష్ట్రం ‘నమ్మక్కల్‌’ (సేలం) లో రూరల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి ‘షాట్‌ఫూట్‌లో 2వ స్థానంతో ‘సిల్వర్‌ మెడల్‌’ సాధించిన ఎల్లారెడ్డి గురుకుల ...

Read More »

ఎల్లారెడ్డిలో కంటి వైద్య శిబిరం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీఆర్‌టియు ఆద్వర్యంలో ఎల్లారెడ్డిలో శ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్స్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో పిఆర్‌టియు భవన్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, వారిపై ఆధార పడిన వారు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆదివారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో ఆరుగురికి సర్జరీ కొరకు రిఫర్‌ చేశారని పిఆర్టియు ఎల్లారెడ్డి శాఖ మండల అధ్యక్షులు యం. కష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి యం.రమేష్‌ కుమార్‌ తెలిపారు. శిబిరంలో పీఆర్‌టియు బాధ్యులు -కె నాగేందర్‌ రెడ్డి, యన్‌.వినయ్‌, ...

Read More »

30 రోజుల ప్రణాళికల పకడ్బందీగా నిర్వహించాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని జవహర్‌ నవోదయ విద్యాలయం ముందు పిచ్చి మొక్కలను తొలగించడం జరుగుతుందని ఎంపీడీవో తోట పర్బన్న అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని 27 గ్రామ పంచాయతీలో 30 రోజుల ప్రణాళిక పనులు విజయవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వీరభద్రయ్య, నవోదయ ప్రిన్సిపాల్‌ శేఖర్‌ బాబు తదితరులు ఉన్నారు.

Read More »

దోబీ ఘాట్‌ పనులకు భూమిపూజ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట్‌ గ్రామంలో ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు, సీడీసీ చైర్మన్‌ దుర్గా రెడ్డి, ఎయంసి చైర్మన్‌ గైని విఠల్‌, సర్పంచ్‌ పిట్ల అనసూయ సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు చాకలి సుజాత రమేష్‌ కుమార్‌ కలిసి దోబీ ఘాట్‌ పనులకు భూమిపూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు. మాజీ జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో రజకుల కోసం దోబీ ఘాట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ...

Read More »

ముళ్ళ పొదలు తొలగింపు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని 1వ వార్డ్‌ బీడీ కాలనీలో స్థానిక టిఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ వైస్‌ యంపీపీ కుడుముల సత్యం ఆధ్వర్యంలో రోడ్డుకు రెండు వైపులా పెరిగిన ముళ్ళ పొదలను తొలగించారు. జేసిబి సహాయంతో పనులు చేపట్టారు. కాగా ఇందుకయ్యే ఖర్చు సత్యం భరించారు. ముళ్ళ పొదలు తొలగించడంతో రోడ్డు అందంగా కనిపిస్తుంది. దీంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సత్యం వెంట ఎంపిటిసి సంతోష్‌, రాము, సజ్జు కృష్ణ, చక్రపాణి ...

Read More »

చెరువుల వద్దకు వెళ్లకూడదు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి చెరువు వద్ద ఎస్‌ఐ సాయన్న హెచ్చరిక ఫ్లెెక్సీ ఏర్పాటు చేశారు. నిజాంసాగర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు పడడంతో చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయని, ప్రమాదకరంగా ఉండడంతో చెరువులు, కుంటల వద్దకు ఎవరు కూడా వెళ్లకూడదని అన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్‌ కమ్మరి కత్త అంజయ్య, ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Read More »

పకడ్బందీగా 30 రోజుల ప్రణాళిక

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నిజాంపేట్‌ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు. శాసన సభ్యులు యం.భూపాల్‌ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోగల కందకాలలో నీరు నిలువ ఉండడంతో సర్పంచ్‌ జగదీశ్వర్‌ చారి తయారు చేయించిన బాబుల్స్‌ నీటి గుంతలలో దోమల లార్వా చనిపోవడానికి వేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతుల గురించి, రోగుల ఆరోగ్యం విషయాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ...

Read More »

జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలలో ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థుల ప్రతిభ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ క్రీడా పోటీలలో ఎల్లారెడ్డి గురుకులానికి చెందిన 8 మంది పాల్గొనగా ఇద్దరు విద్యార్ధులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ జిల్లా సంక్షేమ పాఠశాలల కన్వీనర్‌ జి. మహేందర్‌ తెలిపారు. అండర్‌ 19 హ్యాండ్‌బాల్‌ పోటీలలో ప్రథమ స్థానం సంపాదించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. ఇదిలా ఉండగా దోమకొండ సంక్షేమ గురుకుల పాఠశాలలో 8న జరిగిన జిల్లా స్థాయి ...

Read More »

కోతుల దాడిలో ఒకరికి గాయాలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని స్థానిక బస్టాండ్‌ వద్ద ఆటో డ్రైవర్‌ ఇదయత్‌ అలీ పై కోతులు దాడి చేసి అతని చెవిని కొరికేశాయి. అలాగే బీసీ కాలని ఇళ్ల లోకి దూరి కోతులు ఇల్లంతా చిందర వందర చేస్తూ అడ్డు వచ్చిన మహిళలపై దాడులు చేస్తూ నానా హంగామా చేస్తున్నాయి. మున్సిపాలిటీ, అటవీశాఖ అధికారులు కోతుల మూకపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామాల్లో, పట్టణాలలో కోతుల బెడద ఎక్కువ ఉందని ప్రతి ...

Read More »

ఆశాలకు కనీస వేతనం అమలు చేయాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు 10 వేల వేతనం ఇవ్వాలని, నిజాంసాగర్‌ పిహెచ్‌సిలో ఆశ వర్కర్లు కలిసి మండల వైద్య అధికారి రాధాకష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆశ వర్కర్లు అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ లో పని చేస్తున్న ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, 18 వేల వేతనం ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్‌ 2, 2015 అలాగే డిసెంబర్‌ 16 వరకు 106 రోజులు ఆశలు ...

Read More »

ప్రాజెక్టు నీటి మట్టాన్ని పరిశీలించిన అధికారులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళ్యాణి, సింగీతం ప్రాజెక్టులను సందర్శించి ప్రాజెక్టు నీటి మట్టాన్ని డిప్యూటీ ఈఈ దత్తాత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచి, వస్తున్న ఇన్‌ ఫ్లోను ప్రధాన కాలువలోకి మళ్ళించడం జరుగుతుందని తెలిపారు. ప్రధాన కాలువ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు కాలువ వైపు వెళ్ళకూడదని అన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డీఈ వెంట ...

Read More »

మల్లారం చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని లింగంపల్లి అటవీ ప్రాంతంలో గల మల్లారం చెరువుకు బుంగ పడిందని గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు మంగళవారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజల సురేందర్‌ మల్లరం చెరువుకు బుంగ పడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్షణమే ఎమ్మెల్యే నిధుల నుండి నిధులు మంజూరు చేయించి ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయిస్తానని, ఆ తర్వాత శాశ్వతంగా అభివద్ధి పనులు చేయిస్తామన్నారు. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తే లింగంపల్లి రైతులకు రెండు ...

Read More »

సిఎం సహాయనిధి అందజేత

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిర్గపూర్‌ మండల కేంద్రానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త బాలయ్య అనారోగ్యంతో మరణించి నందున వారి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అందజేశారు. వారితో పాటు మండల పార్టీ అధ్యకులు సంజీవ్‌ రావు పాటిల్‌, గ్రామ ఉపసర్పంచ్‌ రాజు, వార్డ్‌ మెంబర్‌ రాజ గౌడ్‌, తదితరులు ఉన్నారు.

Read More »

గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు తగదు

నిజాంసాగర్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదిలాబాద్‌ ఎంపీ సోయంబాపు రావు రెచ్చ గొట్టి గిరిజనుల మధ్య చిచ్చు పెట్టె విదంగా మాట్లాడుతున్నారని, అలాంటి చర్యలని మానుకోవాలని, లేక పొతే తగిన మూల్యం చెలించుకోవాల్సి వస్తుందని కామారెడ్డి జిల్లా అల్‌ఇండియా బంజారా సేవ సంఘ్‌ అధ్యక్షులు ఎన్‌.బద్యా నాయక్‌ హేచ్చరించారు. శనివారం ఎల్లారెడ్డి బంజారా భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. కేవలం తన స్వార్థం కోసం, రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే మా ఆదివాసీ సోదరులను రెచ్చ గొడుతున్నాడని, అలాగే ఎస్‌టిల ...

Read More »

మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ పరిశీలన

నిజాంసాగర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణ పరిధిలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ను తెలంగాణ విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్‌ ధనరాజ్‌తో కలిసి శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలో పాల ఉత్పత్తి పై సమీక్ష నిర్వహించారు. కంగ్టి మండలం తడ్కల్‌ పాల సేకరణ కేంద్రాన్ని పైలట్‌ ప్రాజెక్టు క్రింద తీసుకొని అక్కడ పాలు పోసే లబ్ధిదారులకు రోజు వారీగా డబ్బులు అందేవిధంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో జిల్లా ...

Read More »

పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం

నిజాంసాగర్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలంలోని రాంపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తల్లి తండ్రుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్‌ మాట్లాడుతూ ఎస్‌యంటి కమిటీలోని సభ్యుల కొందరు పిల్లలు బడి వదిలి వెళ్లిపోవడంతో వారి స్థానంలో కొత్త సభ్యులను ఏక గ్రీవంగా తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్‌ 1 నుండి పదవ తరగతి పిల్లల్లకు ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తున్నామని కావున పిల్లల కు అల్పాహారం అంధించి అందరూ ఉదయం సాయంత్రం హాజరయ్యేలా తల్లిదండ్రులు ...

Read More »

ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన

నిజాంసాగర్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం స్థానిక కాంగ్రెస్‌ నాయకులు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి ఇతర నాయకులతో కలిసి ఏరియా హాస్పిటల్‌లో అన్ని వార్డులో కలిగి తిరిగి పరిశీలించారు. అన్ని హంగులతో నిర్మించిన ఎల్లారెడ్డి ఆసుపత్రిలో సరిపడా వైద్యులతో పాటు సిబ్బంది మరియు కనీస సౌకర్యాలు లేకపోవడంతో బీద ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరాలు తెలుసుకొని ఫోన్‌ ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఎమ్మెల్యే గెలిచి ఇప్పటికి 8 నెలలు గడుస్తున్నా ...

Read More »

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

నిజాంసాగర్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలంలోని అల్లాపూర్‌ గ్రామానికి చెందిన వడ్ల దుర్గయ్యకు వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే హన్మంత్‌ సిందే 94,000 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును పిట్లం ఎంపిపి కవిత విజయ్‌, పిట్లం మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు వాసరి రమేష్‌ చేతుల మీదుగా దుర్గయ్యకు అందజేశారు. చెక్కును మంజూరు చేసిన ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేకు అల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల తరపున ...

Read More »