Breaking News

Tag Archives: pocharam srinivasa reddy

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బీర్కూర్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బీర్కూర్‌ మండలంలోని చించోలి, కిష్టాపూర్‌, బీర్కూర్‌, భైరాపూర్‌ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. భైరాపూర్‌ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం బతుకమ్మ చీరలను ఆడపడుచులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, డీసీఓ శ్రీనివాస్‌, బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు అశోక్‌, బీర్కూర్‌ సొసైటీ అధ్యక్షులు గాంధీ, బైరాపూర్‌ సొసైటీ అధ్యక్షులు ...

Read More »

రైతులు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం…

బాన్సువాడ, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు క్షేమంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలో శుక్రవారం కొనుగోలు కేంద్రాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై స్పీకర్‌ మాట్లాడారు. వానకాలంలో రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ...

Read More »

ఈ – ఆఫీస్‌ పోర్టల్‌ ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం 74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కామారెడ్డి కలెక్టర్‌ కార్యాల‌యం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ కార్యాల‌యంలో ఈ- ఆఫీస్‌ పోర్టల్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బి.బి.పాటిల్‌, ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే, జిల్లా కాలెక్టర్‌ శరత్‌, జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ యాది రెడ్డి, లోకల్‌ బాడీస్‌ ...

Read More »

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పంద్రాగస్టు

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు, 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టరేటులో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. బుధవారం జనహితలో జిల్లా అధికారుల‌తో స్వతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే కార్యక్రమాల‌పై సమీక్షించారు. తమకు నిర్దేశించిన కార్యక్రమాల‌ను పూర్తి చేసుకోవాల‌ని ఆదేశించారు. ఆగష్టు 15 న ఉదయం 10 గంటల‌కు జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకావిష్కరణ ...

Read More »

రూ.2.51 కోట్లతో రెండు పడక గదుల‌ ఇళ్ళు ప్రారంభం

బాన్సువాడ, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ. 2.51 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసరుల్లాబాద్‌ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను ప్రారంభించి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ల‌బ్ధిదారుల‌తో గృహ ప్రవేశం చేయించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ మాట్లాడుతూ కులం, మతం, రాజకీయాల‌కు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని ...

Read More »

రహదారుల‌ అభివృద్ధికి భారీగా నిధులు…

బాన్సువాడ, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ పరిధిలో నూతనంగా విస్తరించనున్న బాన్సువాడ నుండి తాడ్కోల్‌ వైపు వెళ్ళే రహదారిని ఆదివారం రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ వ్యాపారుల‌తో కలిసి రహదారి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో స్పీకర్‌ మాట్లాడుతూ బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా అవతరించాక ప్రజల‌ సౌకర్యార్థం రోడ్లను విస్తరించడం, నూతనంగా నిర్మించడం పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రధాన రహదారి విస్తరణ పూర్తయి నాలుగు వరుసల‌తో రాష్ట్రంలోనే ...

Read More »

రూ.1.51 కోట్లతో 30 రెండు పడక గదుల‌ ఇళ్ళు…

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం హంగర్గ గ్రామంలో రూ. 1.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 డబుల్‌ బెడ్‌ ఇళ్ళను ప్రారంభించి, ల‌బ్ధిధారుల‌తో రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల‌ ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు అని, దేశంలో కేసీఆర్‌ లాగా 29 రాష్ట్రాల‌లో ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ పేదల‌ కోసం 100 ...

Read More »

ఎస్‌సి కమ్యూనిటి హాల్‌ ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం కొల్లూరు గ్రామంలో నిర్మించిన ఎస్‌.సి కమ్యూనిటీ హాల్‌ను రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్‌, శాసనసభ వ్యవహారాల‌ శాఖామంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌తో కలిసి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని భూముల‌కు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో మూడు లిఫ్టులు నిర్మించినప్పటికి మంజీరా నదిలో నీరు లేక ఇప్పటివరకు వినియోగంలోనికి రాలేదని, వానాకాలంలో పారే నీటిని ...

Read More »

ప్రతి ఆదివారం పది నిమిషాలు సామాజిక కార్యక్రమం

బాన్సువాడ, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ చేపట్టిన ‘‘ప్రతి ఆదివారం- పది గంటల‌కు- పదినిమిషాలు’’ కార్యక్రమంలో ఆదివారం అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. స్పీకర్‌ తన అధికారిక నివాసంలోని పూల‌ కుండీల‌లో చెత్తను తొల‌గించి తాజా నీటితో నింపారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ మానవులు ఆరోగ్యవంతమైన జీవనానికి పచ్చదనం, పరిశుభ్రత అత్యంత ప్రాముఖ్యమైనవని, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటితో పాటుగా పరిసరాల‌ను కూడా పరిశుభ్రంగా ...

Read More »

ముఖ్యమంత్రి మహిమవల్లే రైతాంగానికి గోదావరి జలాలు

బాన్సువాడ, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రైతాంగానికి అంది, వారి కల‌లు నేరవేరుతున్నాయంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ మహిమే అని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల‌యంలో మీడియాతో స్పీకర్‌ మాట్లాడారు. 40 ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు అందించాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందని, బ్యారేజిలు, రిజర్వాయర్లు, కాలులు, ఎత్తిపోతల‌ పనుల‌ నిర్మాణం ...

Read More »