Breaking News

Tag Archives: preparations

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలు 2018లో భాగంగా ఈనెల 7న పోలింగ్‌, 11న కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రంగం పూర్తిచేసిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఎంసిఎంసి కంట్రోల్‌రూంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి జుక్కల్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి 5 లక్షల 77 వేల 736 మంది ఓటర్లున్నారని, వీరందరికి ఫోటో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిచేశామని తెలిపారు. ఓటర్లు ఓటింగ్‌కు వచ్చేటపుడు ఎపిక్‌ కార్డుతోపాటు గుర్తింపు ...

Read More »

చురుకుగా సాగుతున్న ఎన్నికల ఏర్పాట్లు

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబరు 7న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వాటికి సంబందించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఎన్నికలు, కౌంటింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం జిల్లాకు కేటాయించిన బ్యాలెట్‌ యూనిట్‌ రిజర్వుగా ఉన్నవాటిలో రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో 269 బ్యాలెట్‌ యూనిట్లను మేడ్చల్‌ జిల్లాకు తరలించారు. కామారెడ్డి, జుక్కల్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి ...

Read More »

సిఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన

బాన్సువాడ, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈనెల 28న జరగనున్న ఆపద్దర్మ ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక మంత్రి, తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరిశీలించారు. స్థానిక నాయకులు, పోలీసు అధికారులతో కలిసి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగడి బజార్‌ ప్రాంతంలో సభాస్థలిని పరిశీలించి ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 28న ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రసంగం వినడానికి ప్రజలు ...

Read More »

విఆర్వో పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జరగనున్న విఆర్వో రాతపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబడరని సూచించారు. కావున అభ్యర్థులందరు పరీక్ష కేంద్రానికి వీలైనంత త్వరగా చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్టు ఇంటర్నెట్‌లో జారీచేయడం జరిగిందని, అభ్యర్థులు షూస్‌, జువెలరీ, ...

Read More »

బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌ టౌన్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, ఆయా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌నుంచి వీడియో కాన్పరెన్సు ద్వారా చీరల పంపిణీపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే గ్రామాలవారిగా బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, జిల్లా స్తాయిలో ఒక గోదాము ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ చీరల పంపిణీకి గ్రామ, ...

Read More »

రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్ల పరిశీలన

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియంలో, పట్టణంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. స్టేడియంతోపాటు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, వీక్లి మార్కెట్‌ వద్ద జరుగుతున్న పనులను ఆయన జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డితోకలిసి పరిశీలించారు. ఏర్పాట్లకు సంబందించి సలహాలు, సూచనలు చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మునిసిపల్‌ కమీషనర్‌ రామాంజులు రెడ్డి, ...

Read More »

శ్రీరామనవమి వేడుకలకు ఆలయాల్లో ఏర్పాట్లు

  బీర్కూర్‌, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రం బీర్కూర్‌లోని కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు, యువకులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. 25వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు మండల హనుమాన్‌ స్వాములు, యువకులు శ్రీరామశోభాయాత్ర రామాలయం నుంచి ప్రారంభించి గ్రామ వీధుల గుండా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు హిందూ జాగరణ్‌ మంచ్‌ సభ్యుల ప్రవచనం, 12 గంటలకు శ్రీరామ జన్మదిన వేడుకలు అనంతరం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల ...

Read More »

మహాసభలకు ఏర్పాట్లు చేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ ఎల్‌బి స్టేడియంలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో జిల్లా నుంచి 15 వాహనాలను ఏర్పాటు చేసి ఆసక్తిగల సాహిత్యకారులు, ఉపాధ్యాయులను తరలించాలని ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ ఎస్‌పి. సింగ్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. డిసెంబరు 15 నుంచి 19 వరకు మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో పాల్గొనదలచిన వారు నోడల్‌ అధికారి ద్వారా నిర్నీత తేదీల్లో హాజరుకావాలని ...

Read More »

దసరా ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్‌ నాయకులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని రాజీవ్‌గాందీ స్టేడియంలో నిర్వహించనున్న దసరా పండగ ఏర్పాట్లను శుక్రవారం కాంగ్రెస్‌ నాయకులు పరిశీలించారు. ప్రతియేడు దసరా ఉత్సవ కమిటీ, షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రావణ దహనం, లేజర్‌ షో, రంగురంగుల టపాకాయల ప్రదర్శన తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. వారి వెంట ...

Read More »

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

  కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. వాటితోపాటు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, జాతీయ పతాకావిష్కరణ, అమరవీరులకు నివాళులు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, ఎస్‌పి శ్వేతారెడ్డి, జిల్లా రెవెన్యూ ...

Read More »

రంజాన్‌ ఏర్పాట్లు పరిశీలించిన చైర్‌పర్సన్‌

  కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న రంజాన్‌ పండగ ఏర్పాట్లను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ శనివారం పరిశీలించారు. రంజాన్‌ పండగ నేపథ్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ క్రమంలో మజీద్‌ల వద్ద గుంతలు పూడ్చేందుకు రూ. లక్షన్నర ఇదివరకే మంజూరు చేసినట్టు ఆమె తెలిపారు. వీధి దీపాలు, ఇతర సౌకర్యాలు సమకూరుస్తున్నట్టు చెప్పారు. ఆమె వెంట వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, వక్ప్‌ బోర్డు అధ్యక్షుడు మహ్మద్‌ జమీర్‌, కౌన్సిలర్‌ ...

Read More »

తెరాస సభకు ముమ్మర ఏర్పాట్లు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌లో నిర్వహించనున్న తెరాస ఆవిర్భావ దినోత్సవ సభకు జనసమీకరణ చేసేందుకు ప్రజాప్రతినిధులు, తెరాసశ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాన్సువాడ, కామారెడ్డిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌లు ట్రాక్టర్లనుసిద్దం చేస్తున్నారు. ఎండ వేడిమి నుంచి రక్షణ పొందేందుకు వెదురుబొంగులు, తడకలతో ట్రాక్టర్లపై ప్రత్యేకంగా పైకప్పులు ఏర్పాటు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోనే వందకు పైగా ట్రాక్టర్లను ఇందుకోసం సిద్దం చేస్తున్నారు. కామారెడ్డిలోనూ ఏర్పాట్లు సాగుతున్నాయి.

Read More »

ప్రశాంతంగా పది పరీక్షలు

  నందిపేట, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు శుక్రవారం మొదటిరోజు ప్రశాంతంగా జరిగాయి. మండలంలో మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. వెల్మల్‌, డొంకేశ్వర్‌, నందిపేట, ఆంధ్రానగర్‌, బాద్గుణ, ఖుదావన్‌పూర్‌, ఐలాపూర్‌, నూత్‌పల్లి జడ్పిహెచ్‌ఎస్‌, మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 922 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 757, బాలురు 335, బాలికలు- 422, కాగా ప్రయివేటు పాఠశాలలకు చెందిన ...

Read More »

పది పరీక్షలకు సర్వం సిద్దం

  బీర్కూర్‌, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 17వ తేదీ నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు బీర్కూర్‌ మండలంలో పరీక్షా కేంద్రాలు సిద్దంగా ఉన్నాయని ఎంఇవో గోపాల్‌రావు అన్నారు. బీర్కూర్‌ మండలంలో బీర్కూర్‌, మిర్జాపూర్‌ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మండల కేంద్రంలో 236 మంది విద్యార్థులు, మిర్జాపూర్‌ సెంటర్‌లో 286 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు ఆయన తెలిపారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటుచేశామని ఎంఇవో పేర్కొన్నారు. వేసవి కాలం సందర్భంగా ...

Read More »

పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

  మోర్తాడ్‌, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం, ఏర్గట్ల 10వ తరగతి పరీక్షా కేంద్రాల కోసం మోర్తాడ్‌ తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ఎంఇవో రాజేశ్వర్‌లు గురువారం ఆయా పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల నేపథ్యంలో గదులను పరిశీలించి విద్యార్థులు సక్రమంగా పరీక్షలు రాసేలా విద్యుత్తు, తాగునీరు, ప్యాన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, వైద్య సౌకర్యం, ఫర్నీచర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి లోపాలు ...

Read More »

ఘనంగా ఎల్లమ్మ పండుగ ఏర్పాట్లు

  నందిపేట, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఖుదావన్‌ గ్రామ సమీపంలోగల శ్రీరేణుకామాత ఎల్లమ్మ దేవి ఆలయం వద్ద ఆదివారం జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు మొక్కులు తీర్చుకునేందుకు ఆదివారం ఆలయానికి విచ్చేస్తున్నారు. కాగా ఇందులో భాగంగా తెరాస నాయకులు, కార్యకర్తలు గత వారంరోజుల నుండి ఏర్పాట్లలో నిమగ్నమైఉన్నారు. శనివారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆలయం వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ...

Read More »

ఇస్లాం మత సమ్మేళనానికి ఏర్పాట్లు చేయాలని వినతి

  కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో డిసెంబరు 18న ఇస్లాంమత సమ్మేళనం నిర్వహిస్తున్నామని, ఇందుకోసం బందోబస్తుతోపాటు పలు ఏర్పాట్లు చేపట్టాలని గురువారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను ముస్లిం మతపెద్దలు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబరు 18న జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హాల్‌లో తెలంగాణలోని ముస్లిం మతపెద్దలు సుమారు 10 వేల మందితో సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో మహ్మద్‌ ప్రవక్త ఇస్లాం సూచించినసారాంశాల గురించి ప్రవచనాలుంటాయన్నారు. సమ్మేళనం ...

Read More »

శత చండీయాగానికి ఏర్పాట్లు పూర్తి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గోర్గల్‌ గ్రామంలో శుక్రవారం నుంచి ఈనెల 4వ తేదీ వరకు శ్రీరుద్ర హవన పురస్సర శత చండీ యాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బాసర ముఖ్య అర్చకులు రాజీవ్‌శర్మ ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమాలు మూడురోజుల పాటు నిర్వహించనున్నట్టు అర్చకులు తెలిపారు. చండీ యాగానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిడిసి చైర్మన్‌ ...

Read More »

గ్రూప్‌-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌-2 పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణ జిల్లా కన్వీనర్‌ ప్రొఫెసర్‌ టి.సత్యనారాయణ చారి తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడం, ఎలాంటి ఆభరణాలు లేకపోవడం, ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్స్‌ లేకపోవడం కీలకమని ఆయన తెలిపారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీలో ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడారు. వారు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను నిశితంగా పరిశీలించాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆచార్య సత్యనారాయణ ...

Read More »

బక్రీద్‌ పర్వదినంకోసం ఏర్పాట్లు పూర్తి

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని 17 గ్రామ పంచాయతీల పరిదిలో ఈద్గాలు ముస్తాబు చేస్తున్నారు. ముస్లింలు ఎంతో ఘనంగా బక్రీద్‌ పండగ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంజాన్‌ తర్వాత అతిపెద్ద పండుగ బక్రీద్‌ను ఘనంగా జరుపుకుంటారు. అలాగే నిజాంసాగర్‌, సుల్తాన్‌నగర్‌, కోమలంచ గ్రామాల్లోని ఈద్గాలకు రంగులువేసి అందంగా ముస్తాబు చేశారు.

Read More »