Breaking News

Tag Archives: Robbery

దొంగిలించబడిన ద్విచక్ర వాహనాల స్వాధీనం

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో సోమవారం 3వ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో దొంగిలించబడిన ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. రైల్వే కమాన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హమాల్‌వాడికి చెందిన గంగాకిరణ్‌ వర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్ద నుంచి దొంగిలించబడిన రెండు ద్విచక్ర వాహనాలను టిఎస్‌ 16 ఇజి 1704 హీరోహోండా ప్యాషన్‌ ప్లస్‌, ప్యాషన్‌ ప్రోలను, అదేవిధంగా గుర్బాబాది రోడ్డులో మహ్మద్‌ అన్వర్‌ను అదుపులోకి ...

Read More »

చర్చిలో చోరీ

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలో లివింగ్‌ క్రైస్ట్‌ చర్చిలో ఆదివారం అర్దరాత్రి చోరీ జరిగింది. దొంగలు చర్చి తలుపులు పగులగొట్టి హుండిలోని 40 వేల నగదు, ఎత్తుకెళ్లినట్టు 3వ టౌన్‌ ఎస్‌ఐ కృస్ణ తెలిపారు. చర్చి సభ్యులపిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

Read More »

సిసి కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒక్క సిసి కెమెరా పదిమంది పోలీసులతో సమానమని సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకొని రక్షణ వలయాలు సృష్టించుకోవాలని కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌ అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో సిసి కెమెరాల ఏర్పాటు, దొంగతనాల నివారణపై జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో, అన్ని వీధుల్లో సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. వాటివల్ల దొంగతనాలు తగ్గుముఖం పట్టడమే గాకుండా, ఒకవేళ జరిగినా నిందితులను పట్టుకోవడంలో సిసి కెమెరాలు ...

Read More »

నగరంలో చోరీ

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో 5వ టౌన్‌ పరిధిలో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. అయోధ్యనగర్‌లో నివాసముంటున్న రామకృష్ణ ఇంట్లో దొంగలు చొరబడి 8 తులాల బంగారం, 7 తులాల వెండి, 10 వేల నగదు దొంగిలించినట్టు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళం పగులగొట్టి చోరీచేసినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Read More »

ముబారక్‌నగర్‌లో చోరీ

నిజామాబాద్‌ టౌన్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముబారక్‌నగర్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగినట్టు రూరల్‌ ఎస్‌ఐ శ్రీధర్‌గౌడ్‌ తెలిపారు. గ్రామానికి చెందిన సర్వేష్‌ ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్ళాడని, అదను చూసి దొంగలు ఆదివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడి రూ. 10 వేలు, తులం బంగారం అపహరించుకుపోయినట్టు ఆయన పేర్కొన్నారు. దొంగిలించడమే కాకుండా ఇంటికి నిప్పుపెట్టారని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఆయన అన్నారు.

Read More »

దేవునిపల్లిలో చోరీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి సాయాగౌడ్‌ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. లింగంపేట్‌ మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన సాయాగౌడ్‌ కామారెడ్డి మండలం దేవునిపల్లిలో నివాసముంటున్నాడు. నాలుగురోజుల క్రితం ఇంటికి వెళ్ళగా బుధవారం రాత్రి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని బీరువాలు, కబ్‌బోర్డులు పగులగొట్టారు. విలువైన వస్తువులు ఏవి చోరీకి గురికాలేదని, ఇంట్లో ఉంచిన కొంత నగదు పోయిందని సాయాగౌడ్‌ ఫిర్యాదులో పేర్కొన్నట్టు దేవునిపల్లి ఎస్‌ఐ సంతోష్‌ ...

Read More »

దొంగలను పట్టుకోవడానికి చెన్నై వెళ్ళిన పోలీసు బృందం

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కొన్ని రోజుల క్రితం చోరీలు జరిగిన సంఘటనలో దొంగల్ని పట్టుకోవడానికి పోలీసు బృందం చెన్నై బయల్దేరి వెళ్ళినట్టు తెలిసింది. కామారెడ్దిలోని సిఐ ఆధ్వర్యంలో కొంతమంది పోలీసు బృందం దొంగలను పట్టుకోవడానికి బయల్దేరారు. మరో రెండ్రోజుల్లో నిందితులను అరెస్టు చేసే అవకాశమున్నట్టు తెలిసింది.

Read More »

ఎన్జీవోస్‌ కాలనీలో చోరీ

  కామారెడ్డి, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలో ఓ ఆర్టీసి ఉద్యోగి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితుని కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… జితేందర్‌ రెడ్డి అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఇతర పనులకు వెళ్ళాడు. ఇది గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని 50 తులాల బంగారు ఆభరణాలు, లక్షకు పైగా నగదును అపహరించుకొని పోయారు. బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు.

Read More »

తాళం వేస్తే సమాచారం ఇవ్వాలి

  కామరెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఆయా వార్డుల్లో ఇంటికి తాళం వేసి వెళ్లేవారు పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సిఐ శ్రీధర్‌కుమార్‌ సూచించారు. సంక్రాంతి పండగ సందర్భంగా తమ గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉంచవద్దని సూచించారు. మెడలో బంగారు ఆభరణాలు ధరించి వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Read More »

తాళం వేసిన ఇంట్లో చోరీ

  గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని తాళం వేసిన ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడి ఇంట్లో బీభత్సం సృష్టించారు. గాంధారిలోని బాల్‌రాజ్‌గారి మైసవ్వ, బాల్‌రాజ్‌గారి విఠల్‌ ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… మైసవ్వ ఇంట్లో 4 తులాల బంగారం, 30 తులాల వెండి, విఠల్‌ ఇంట్లో 40 తులాల వెండి అపహరణకు గురయ్యాయన్నారు. రెండునెలల క్రితం వారింట్లో ఒకరు చనిపోగా ఇళ్లు వదిలిపెట్టాలని వాస్తు దోషం ఉండగా వారు ...

Read More »

హౌజింగ్‌బోర్డులో చోరీ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని న్యూ హౌజింగ్‌బోర్డు కాలనీలో వీరారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగినట్టు రూరల్‌ సిఐ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వీరారెడ్డి శుభకార్యం నిమిత్తం సంగారెడ్డికి ఇంటికి తాళంవేసి వెళ్లారని, ఇదే అదనుగా భావించి దొంగలు ఇంట్లోంచి 5 తులాల బంగారం అపహరించినట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ తెలిపారు.

Read More »

నాందేవ్‌వాడలో చోరీ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన అనురాధ అనే మహిళ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగిందని 3వ టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. ఆ సమయంలో బాధితులు శుభకార్యం నిమిత్తం హైదరాబాద్‌ వెళ్ళారని, ఇదే అదనుగా భావించి దొంగలు చోరీకి పాల్పడ్డారని ఆయన తెలిపారు. 1.5 గ్రాముల బంగారం, 4 గ్రాముల ఉంగరం అపహరణకు గురైనట్టు, దొంగలను త్వరలో పట్టుకుంటామని, అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ...

Read More »

బంగారు దుకాణాలపై పోలీసుల దాడులు

  కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మాయాబజార్‌ రోడ్డులోగల మూడు బంగారు దుకాణాలపై శనివారం హైదరాబాద్‌కు చెందిన పోలీసులు దాడులు నిర్వహించారు. దొంగిలించిన బంగారాన్ని కామరెడ్డి పట్టణంలో విక్రయించినట్టు అదుపులో ఉన్న నిందితుడు తెలపడంతో ప్రత్యేక వాహనంలో శనివారం కామారెడ్డికి చేరుకున్నారు. నిందితుడు చూయించిన పలు బంగారు దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. కొనుగోలు చేసిన బంగారాన్ని రికవరీ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Read More »

నగల దుకాణంలో పామును వదిలి..నగలు దోచుకొని వెళ్లి…

లేడీ కిలాడీల నయా మోసం రాంపూర్ : నగల దుకాణంలో పామును వదిలి…నగలను దోచుకెళ్లిన లేడీకిలాడీల బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పట్టణంలో వెలుగుచూసింది. సినీఫక్కీలో జరిగిన ఈ నగల దోపిడీ ఘటన యూపీలో సంచలనం రేపింది. రాంపూర్ పట్టణంలోని మెస్టన్ గంజ్ లో ఉన్న పరితోష్ చాందీవాలా నగల దుకాణానికి బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు వచ్చారు. వస్తూనే నగల దుకాణంలోకి ఓ పామును వదిలిపెట్టారు…పామును చూసిన నగల దుకాణం యజమాని పరితోష్ భయంతో దుకాణం వదిలి బయటకు పరుగులంకించుకున్నాడు. అంతే ఆ మహిళలు ...

Read More »

తల్లిని కడతేర్చిన తనయుని అరెస్టు

  కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిని హత్యచేసి తప్పించుకు తిరుగుతున్న హంతకుడైన కొడుకును మంగళవారం పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. కామరెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్‌ తాండాలో గత సంవత్సరం అక్టోబరు 3న జరిగిన హత్య కేసుకు సంబంధించిన నిందితుని పట్టుకొని విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. హత్యకు పాల్పడ్డ మెగావత్‌ రాజేందర్‌ (21)ని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి డిఎస్పీ ప్రసన్నరాణి తెలిపిన వివరాల ప్రకారం… మెగావత్‌ రాజేందర్‌ హైదరాబాద్‌లో ఎర్నాటికల్‌ ఇంజనీరింగ్‌లో 4వ సంవత్సరం ...

Read More »

అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి

  బీర్కూర్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో తిరిగే అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, ఎవరిపైన అయినా అనుమానం వస్తే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని బాన్సువాడ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌రావు అన్నారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో గురువారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం ఎస్‌ఐ గోపితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఏటిఎంలపై అవగాహన, నూతన వ్యక్తులతో ప్రవర్తించే విధానం గురించి వివరించారు. స్తానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కుల, మత బేదాలు ...

Read More »

సుంకెట్‌లో దొంగల భీభత్సం

  – నాలుగు తులాల బంగారం, 25 వేల నగదు చోరీ మోర్తాడ్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకెట్‌ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగల బీభత్సం జరిగింది. గ్రామానికి చెందిన తీగల లింగారెడ్డి ఇంట్లో దొంగలు చొరబడి బీరువా పగులగొట్టి నాలుగు తులాల బంగారం చోరీకి గురైనట్టు స్తానికులు తెలిపారు. అంతేగాకుండా ఓనెపల్లి కిరాణ దుకాణంలో దొంగలు 20 వేల నగదు, నూనె డబ్బా దొంగిలించినట్టు స్థానికులు తెలిపారు. మరో రెండు ఇళ్లల్లో దొంగతనానికి ప్రయత్నించినప్పటికి ప్రజలుతేరుకోవడంతో ...

Read More »

పోలేరమ్మ ఆలయంలో చోరీకి యత్నం

  నందిపేట, అక్టోబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆంధ్రానగర్‌ గ్రామంలోగల పోలేరమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించినట్టు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… గ్రామంలోని పోలేరమ్మ ఆలయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తాళం పగులగొట్టి వస్తువులను దొంగిలించే ప్రయత్నం చేశారన్నారు. గురువారం గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జాన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గ్రామ కమిటీ వారు సిసి కెమెరాలు ...

Read More »

పట్టపగలే చోరీ…

  బాన్సువాడ, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో ఓ వ్యాపారి ఇంట్లో దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని సిండికేటు బ్యాంకు వెనక ప్రాంతంలోగల బెజుగం రాఘవేందర్‌ అనే వ్యాపారి ఇంట్లో శుక్రవారం దొంగతనం జరిగింది. ఇంటివారు పట్టణంలో జరుగుతున్న పెళ్లికి కుటుంబీకులతో కలిసి తాళం వేసి వెళ్లగా దీన్ని గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన ఆయన తలుపులు, బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ...

Read More »

నాలుగిళ్లలో చోరీ

  రామాయంపేట, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా రామాయంపేటలో సోమవారం రాత్రి నాలుగైదు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో గమనించిన దుండగులు దొంగతనానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. కాగా వీరందరు కృష్ణా పుష్కరాలకు వెళ్లారని, వారు వచ్చిన తర్వాత ఎంత సొమ్ము చోరీకి గురైందనే వివరాలు వెల్లడవుతాయని అన్నారు. క్లూస్‌ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. విచారణ చేపడతామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Read More »