Breaking News

Tag Archives: sports

జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలలో ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థుల ప్రతిభ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ క్రీడా పోటీలలో ఎల్లారెడ్డి గురుకులానికి చెందిన 8 మంది పాల్గొనగా ఇద్దరు విద్యార్ధులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ జిల్లా సంక్షేమ పాఠశాలల కన్వీనర్‌ జి. మహేందర్‌ తెలిపారు. అండర్‌ 19 హ్యాండ్‌బాల్‌ పోటీలలో ప్రథమ స్థానం సంపాదించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. ఇదిలా ఉండగా దోమకొండ సంక్షేమ గురుకుల పాఠశాలలో 8న జరిగిన జిల్లా స్థాయి ...

Read More »

క్రీడలు ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తాయి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడలు ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం పద్మవిభూషణ్‌ ధ్యాన్‌చంద్‌ జన్మదినం సందర్బంగా నేషనల్‌ స్పోర్ట్స్‌డే పురస్కరించుకొని 64వ జిల్లాస్థాయి హాకీ క్రీడలను కలెక్టర్‌జ్యోతి వెలిగించి ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులంతా ప్రపంచ హాకీ దిగ్గజం ద్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. భారత హాకీని ధ్యాన్‌చంద్‌ విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు. గెలుపు ...

Read More »

క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. ఒలింపిక్‌డే రన్‌ సందర్భంగా శుక్రవారం స్థానిక శివాజీనగర్‌ చౌరస్తా వద్ద జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు, ఎన్‌సిసి క్యాడెట్లు, ఒలింపిక్‌ సంఘం, ఇతర క్రీడా సంఘాల సభ్యులతో కాగడా ప్రదర్శనలతో రన్‌ కొనసాగింది. రన్‌ పెద్ద బజార్‌ చౌరస్తా, గాంధీచౌక్‌ మీదుగా కలెక్టరేట్‌ మైదానం వరకు కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ...

Read More »

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

రెంజల్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమని ఎంపిపి మోబిన్‌ఖాన్‌ అన్నారు. గతనెల రోజుల నుండి మండలంలోని కందకుర్తి యూత్‌ ఆద్వర్యంలో కొనసాగుతున్న క్రికెట్‌ టోర్ని ఆదివారంతో ముగిసింది. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు ఓటమిని గెలుపునకు నాందిగా భావించుకొని ముందుకు సాగాలన్నారు. అప్పుడే సత్పలితాలు వస్తాయన్నారు. అలాగే క్రీడలు శరీర దారుఢ్యం, ఏకాగ్రత, మానసిక ఉల్లాసాలను పెంపొందిస్తాయని ఆయన చెప్పారు. 36 జట్లు పాల్గొనగా ప్రథమ, ...

Read More »

క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ప్రముఖ వైద్యులు మోతిలాల్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ కళాశాల ప్రాంగణంలో కబడ్డి ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు. క్రీడల వల్ల శారీరక వ్యాయామం జరుగుతుందని, తద్వారా మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని, ఈరోజుల్లో విద్యార్థులు ఎల్లవేళలా ఫోన్లో ఆటలాడుతూ కనిపిస్తున్నారని, అదే ఆటలు బయట ఆడితే శారీరక దారుఢ్యం ఏర్పడుతుందని, ఇది ప్రతి ఒక్కరు గుర్తించి క్రీడల్ని ...

Read More »

శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయి

  కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రభుత్వ వెనకబడిన తరగతుల వసతి గృహాల విద్యార్థుల జిల్లా స్తాయి ఆటల పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల్లో జయాపజయాలు సాధారణమని, వీటిని క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలన్నారు. క్రీడాపోటీల్లో 400 మంది పాల్గొన్నారని, వచ్చే పోటీల్లో మొత్తం విద్యార్తులు పాల్గొనాలని సూచించారు. క్రీడలు చదువులో దిల్‌, ...

Read More »

క్రీడా మైదానం ఏర్పాటు చేయండి

  నందిపేట, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రం పేరుకే మేజర్‌ గ్రామ పంచాయతీ అయినప్పటికి సౌకర్యాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. గ్రామంలో పదుల సంఖ్యలో పాఠశాలలు, 3 జూనియర్‌ కాలేజీలు, ప్రయివేటు డిగ్రీ కళాశాల ఉన్నాయి. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో యువకులు కళాశాలల నుంచి బయటకొస్తున్నారు. యువకులకు ఆడుకోవడానికి సరైన క్రీడా మైదానం లేకపోవడంతో హోటళ్ళ వద్ద, రోడ్ల వెంబడి తిరిగి కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో క్రీడల్లో నైపుణ్యం ఉన్న యువత ప్రోత్సాహం లేక ...

Read More »

విద్యార్థులను అభినందించిన కలెక్టర్‌

  కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు వివిధ క్రీడా విభాగాల్లో శిక్షణ కోసం ఎంపికయ్యారు. వీరిని మంగళవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అభినందించారు. కౌలాస్‌ గిరిజన వసతి గృహానికి చెందిన దినేష్‌, శ్యాంరావు, కె.ఎన్‌.రాజ్‌ కల్లాలి, సునీల్‌, అరవింద్‌లు వివిధ విభాగాల్లో శిక్షణ కోసం సీట్లు సాధించారు. వీరితోపాటు పిఇటిలను కలెక్టర్‌ అభినందించారు. తమ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ వెళ్లి అకాడమిలో ప్రవేశం కల్పించేందుకు జిల్లా ...

Read More »

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమే

  మోర్తాడ్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనని ఏర్గట్ల సర్పంచ్‌ శ్రీవైష్ణవి అన్నారు. సోమవారం జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్ని బహుమతుల ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గెలుపొందిన సావెల్‌ క్రీడాకారులకు ప్రథమ బహుమతి 6 వేల నగదుతో పాటు షీల్డ్‌ అందజేశారు. ద్వితీయ బహుమతిని ఏర్గట్ల క్రీడాకారులకు 3వేల నగదుతోపాటు షీల్డ్‌ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలిచిన వారు మరిన్ని విజయాల కోసం కృషి చేయాలని, ఓటమిచెందిన వారు ...

Read More »

క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి

  మోర్తాడ్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడల వల్ల గ్రామాల్లో స్నేహసంబంధాలు పెంపొందిస్తాయని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, సర్పంచ్‌ అనిత, ఎంపిటిసి ఎనుగందుల అశోక్‌, ఎంఇఓ రాజేశ్వర్‌, ఏర్గట్ల, మోర్తాడ్‌ మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కల్లడ ఏలియా, రాజా పూర్ణానందం అన్నారు. శనివారం మండలంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంతన్న యువసేన ఆధ్వర్యంలో దివంగత నేత వేముల సురేందర్‌రెడ్డి స్మారకార్థం జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్ని ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన ...

Read More »

క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది

  మోర్తాడ్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడల వల్ల గ్రామాల ప్రజల మద్య స్నేహభావం పెంపొందుతుందని జిల్లా తెరాస నాయకులు శివన్నోల్ల శివకుమార్‌, ఉససర్పంచ్‌ ఉపేంద్రలు అన్నారు. సోమవారం ఏర్గట్ల మండల కేంద్రంలో క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్తాయి క్రికెట్‌ టోర్ని ప్రారంభించి మాట్లాడారు. ఉపసర్పంచ్‌ ఏర్గట్ల క్రికెట్‌ అసోసియేషన్‌కు ఉచితంగా క్రీడా దుస్తులు అందించడం, అదే గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు మల్లేశ్‌, తాటిపత్రి నగేశ్‌లు క్రీడాకారులకు ఉచితంగా బ్యాట్‌లు అందించడం అభినందనీయమన్నారు. క్రీడల వల్ల ...

Read More »

మానసిక వికలాంగులకు క్రీడాపోటీలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్‌ నాయకులు మానసిక వికలాంగ చిన్నారులకు క్రీడాపోటీలు నిర్వహించారు. క్యారమ్స్‌, చదరంగం, ఆటలు, చిత్రలేఖనం, తదితర పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో పార్టీపట్టణ అధ్యక్షుడు కైలాష్‌శ్రీనివాస్‌రావు, నాయకులు కన్నయ్య, ఇసాక్‌ షేరూ, గోనె శ్రీనివాస్‌, ఐరేని సందీప్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గణతంత్ర వేడుకల సందర్భంగా క్రీడాపోటీలు

  బీర్కూర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 26 జనవరి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నసురుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లోగల పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. కబడ్డి, ఖోఖో, వ్యాసరచన, వాలీబాల్‌, డ్రాయింగ్‌ లాంటి పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు గణతంత్ర దినోత్సవం రోజు బహుమతి ప్రదానం చేయనున్నారు.

Read More »

క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు అంగవైకల్యంకలవారు కాదని, వారు దైవాంశులని, వారిని క్రీడల్లో పాల్గొనేలా అందరూ ప్రోత్సహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో 10-17 సంవత్సరాల దివ్యాంగుల విద్యార్థిని, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ట్రైసైకిల్‌, 100, 50 మీ.ల పరుగు పందెం, షాట్‌ఫూట్‌, క్యారం, చదరంగం తదితర పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారిని ఈనెల ...

Read More »

టగ్‌ ఆఫ్‌వార్‌లో క్రీడాకారుల ప్రతిభ

  కామారెడ్డి, సెప్టెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి టగ్‌ ఆఫ్‌ వార్‌పోటీల్లో అండర్‌-19 బాలికలు, అండర్‌- 15 బాలుర విభాగాల్లో 3వ స్తానంలో నిలిచిన నిజామాబాద్‌ జిల్లా జట్లను బుధవారం కామారెడ్డిలో సన్మానించారు. జిల్లా టగ్‌ ఆఫ్‌ వార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నిట్టు కృష్ణమోహన్‌రావు, దామోదర్‌రెడ్డిలు క్రీడాకారులను, మేనేజర్‌, కోచ్‌లు గులాం హుస్సేన్‌, భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వీణ, వెంకట్‌రెడ్డిలను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరిగిన టగ్‌ ఆఫ్‌ వార్‌ ...

Read More »

కొనసాగుతున్న క్రీడా పోటీలు

  – వాలీబాల్‌ ప్రథమస్థానంలో అయిలాపూర్‌ విద్యార్థుల నందిపేట, సెప్టెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అయిలాపూర్‌ గ్రామంలో జరుగుతున్న మండల స్థాయి అంతర్‌ పాఠశాలల క్రీడా పోటీల్లో భాగంగా బుధవారం వాలీబాల్‌ జూనియర్‌లో అయిలాపూర్‌ పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం సాదించారు. రెండవ స్తానంలో కొండాపూర్‌ పాఠశాల విద్యార్థులు నిలిచారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఏసిఎస్‌ ఛైర్మన్‌ లక్ష్మినారాయణ కరచాలనం చేసి పోటీలు ప్రారంభించారు. ఆయనతోపాటు గ్రామ సర్పంచ్‌ మీసాల సుదర్శన్‌ ఉన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ...

Read More »

జూన్‌ 3 నుంచి క్రీడోత్సవాలు

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, మే 27 : తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ 2 నుంచి 5 వరకు జిల్లాలోని ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ది అధికారి ఎం.ఎస్‌.ఎల్‌.ఎన్‌.శర్మ తెలిపారు. అన్ని స్థాయిలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు ఉంటాయన్నారు. 3న షటీల్‌, టెబుల్‌ టెన్నిస్‌ – ఆఫిసర్స్‌ క్లబ్ల్‌లో…. 4న కబడ్డీ, వాలీబాల్‌ పోటీలు 1 డిఎస్‌ఎ మినీ స్టేడియంలో… 4, 5న క్రికెట్‌ పోటీలు ఉంటాయని అన్నారు. ఈ పోటీల్లో ఉద్యోగ ...

Read More »

త్రైట్లాన్‌లో రాణించిన నవాతే శ్రీనివాస్‌

  నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :: కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి క్రీడల్లో జిల్లా పోలీస్‌శాఖ క్రీడాకారుడు నవాతే శ్రీనివాస్‌ తన ప్రతిభను చాటి పలువురి ప్రశంసలు అందుకున్నారు. కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఈ నెల 9, 10 తేదీలలో జరిగిన త్రైట్లాన్‌ పోటీలకు అయన ప్రాతినిధ్యం వహించాడు. స్విమ్మింగ్‌, సైకిలింగ్‌, రన్నింగ్‌ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 88 మంది క్రీడాకారులు పాల్గొనగా జిల్లా నుంచి వెళ్లిన శ్రీనివాస్‌ 14వ స్థానంలో నిలిచారు. జిల్లా పోలీసు శాఖలో పని ...

Read More »

టీయూలో వాలీబాల్‌, క్రికెట్‌ పోటీలు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 10: సంత్‌శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 276 జయంతిని పురస్కరించుకుని సోమవారం టీయూలో వాలీబాల్‌, క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. క్రీడల్లో అప్లయిడ్‌ ఎకానమిక్స్‌, అప్లయిడ్‌ స్టాటిటీక్స్‌ విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 19న బహుమతులు అందజేస్తారు. క్రికెట్‌లో మొదటి బహుమతి ఎం ఎ అప్లయిడ్‌ ఎకానమిక్స్‌ , వాలీబాల్‌లో ప్రథమ బహుమతి అప్లయిడ్‌ స్టాటిటిక్స్‌ విద్యార్థులు సాధించారు. కార్యక్రమంలో సంత్‌శ్రీ సేవాలాల్‌ సమిటీ సభ్యులు జగదీశ్‌, సునీల్‌, సంతోష్‌ మోహన్‌, రాజీ , రవి తదితరులు పాల్గొన్నారు. ...

Read More »

వేములపల్లి కిరణ్‌ కుమార్‌ స్మారక క్రీడా పోటీలను విజయవంతం చేయాలి

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: కామ్రేడ్‌ వేములపల్లి కిరణ్‌ కుమార్‌ వర్ధంతిని పుస్కరించుకొని ఈ నెల 31న పిడిఎస్‌యూ, పివైఎల్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలని పివైల్‌ జిల్లా అధ్యక్షుడు బాలయ్య, పిడిఎస్‌యూ జిల్లా కార్యదర్శి నిమ్మల నిఖిల్‌ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిరణ కుమార్‌ విద్యార్థులు, యువతలో చైతన్య పరుస్తూ విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థులు సమాజంలో చెడు వ్యసనాలైన గుట్కా, సారా, పాన్‌మసాలా వ్యతిరేకంగా పోరాడరన్నారు. యువతను ఉద్యమం ...

Read More »