Breaking News

Tag Archives: telangana jagrithi

చెడును భోగి మంటల్లో కాల్చివేయాలి

కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెడును భోగి మంటల్లో కాల్చి వేసి మంచి మార్గంలో నడవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డా.శరత్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల రాశి వనం సమీపంలో తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో జాగతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆదేశాల మేరకు నిర్వహించిన భోగి మంటలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భోగికి పూజలు నిర్వహించి అగ్ని వెలిగించారు. భోగి మంటలలో ప్రతి ఒక్కరు చెడును, స్వార్థాన్ని ...

Read More »

సంస్కతిని కాపాడేలా పండుగలు జరుపుకోవాలి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంస్కతి, సంప్రదాయాలను కాపాడుకునే విధంగా పండుగలు జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సతీమణి పార్వతీ శరత్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగతి ఆద్వర్యంలో స్థానిక గాంధీ గంజ్‌ ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విజేతలు అన్నారు. ఇక్కడ వేసిన అన్ని ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయన్నారు. పోటా పోటీగా ఒకరిని మించి ఒకరు ముగ్గులు ...

Read More »

యువతను తనకు తాను పరిచయం చేసేవి వివేకానంద బోధనలు

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతలో నిక్షిప్తమైన అపార శక్తిని వెలికి తీయడంలో, యువతను ప్రేరేపించడంలో యువతను సద్మార్గంలో నడిపించడంలో వివేకానంద స్వామి బోధనలకు మించి మరొకటి ఈ భూమండలంపైన లేదని తెలంగాణ జాగతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్‌ అన్నారు. స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా నిజామాబాద్‌ నగరం గాజుల పేటలో గల వివేకానంద విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరాల సుధాకర్‌ మాట్లాడుతూ ప్రపంచమంతా మనదేశం వైపు ...

Read More »

కామారెడ్డిలో రంగోళి పోటీలు

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాగతి అధ్యక్షులు అనంత రాములు, నాయకులు చక్రధర్‌ సంయుక్తంగా ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ కార్యాలయం (గాంధీ గంజ్‌) ఆవరణలో ఉదయం 10 గంటల నుండి ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరో ఏడు కన్సోలేషన్‌ బహుమతులు అందజేస్తామన్నారు. అలాగే ముగ్గుల పోటీలలో పాల్గొని ప్రతిభ కనబర్చిన మహిళలకు జాగతి తరుపున ...

Read More »

13న జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13న ఉదయం 6 గంటలకు స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్‌ తెలిపారు. ఉదయం 6 గంటలకు భోగిమంటలతో కార్యక్రమం మొదలవుతుందని, తెలంగాణ జాగతి జిల్లా అధ్యక్షులు అవంతి పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి జిల్లా, నగరంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ, కొట్టూరి ...

Read More »

ముగ్గుల పోటీ విజేతలకు నగదు బహుమతులు

నిజామాబాద్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు నిజామాబాద్‌ తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో ఈనెల 11న సోమవారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్‌ నగరంలోని కలెక్టర్‌ గ్రౌండ్‌లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగతి మహిళా అధ్యక్షురాలు నాయక్‌వాడి అపర్ణ తెలిపారు. ముగ్గుల పోటీల్లో నిజామాబాద్‌ నగరంతోపాటు జిల్లాలోని మహిళలందరూ పాల్గొనాలన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు నగదు బహుమతి ఉంటుందని తెలిపారు. మొదటి బహుమతి ఐదువేల రూపాయలు, రెండవ ...

Read More »

ప్రపంచ ప్రఖ్యాత బాక్స‌ర్‌‌ నిజామాబాద్‌ ముద్దు బిడ్డ

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెల డిసెంబర్‌లో జర్మనీలో జరిగిన కలోన్‌ బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకం సాధించి నిజామాబాద్‌ నగరానికి వచ్చిన ప్రఖ్యాత బాక్సర్‌ హుసాముద్దిన్‌ను తెలంగాణ జాగతి సభ్యులు సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్‌ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బాక్సర్‌ నిజామాబాద్‌ ముద్దుబిడ్డ కావడం సంతోషకరమని అన్నారు. కేవలం తెలంగాణనే కాకుండా మొత్తం భారతదేశం గర్వపడేలా చేశాడన్నారు. కార్యక్రమంలో దండు ...

Read More »

మరోసారి ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెల 24న మలేషియాలో గుండెపోటుతో చనిపోయిన బాల రవీందర్‌ మతదేహాన్ని వారి స్వగహం గూపన్‌ పల్లికి తెప్పించారు ఎమ్మెల్సీ కవిత. బ్రతుకుపై ఆశతో ఈయేడు జనవరిలో పొట్ట చేత పట్టుకొని మలేషియా వెళ్లిన బాల రవీందర్‌ కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి ఎన్నో కష్టాలు పడి జీవితంపై ఆశ కోల్పోయి గుండెపోటుతో గత నెల 24న మరణించగా, అతనికి అప్పులు ఉండడంతోతో పార్థివ దేహాన్ని స్వగహానికి తెప్పించడానికి వారి కుటుంబ సభ్యులకు ...

Read More »

ఆత్మ పరిశీలన గొప్ప లక్షణం

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనిషి తనను తాను పరిశీలించు కోవడం, అర్థం చేసుకోవడం గొప్ప లక్షణం అని, తనలోకి తాను చూసుకో గలిగితే ధైర్యం సాహసం కరుణ మానవత్వం మనిషికి అలవడతాయని నరాల సుధాకర్‌ నేను అనే శీర్షికతో కవిత్వం రాస్తూ తన అంతరంగాన్ని నిరంతరం దర్శిస్తూ సమాజంలో ఆదర్శంగా ఎదుగుతాడని శాసన మండలి సభ్యురాలు తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని తన కార్యాలయంలో కవిత ...

Read More »

కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత కృషితో కువైట్‌ నుండి తెలంగాణ వాసులు హైదరాబాద్‌ చేరారు. భారీ విమానం బోయింగ్‌-777 ద్వారా హైదరాబాద్‌కు 320 మంది చేరుకున్నారు. కువైట్‌లో ఉన్న తెలంగాణ వాసుల‌కు అండగా నిలిచి తెలంగాణ జాగృతి కువైట్‌ చార్టెడ్‌ విమానం ఏర్పాటు చేయించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల కవిత సూచన మేరకు కరోనా కారణంగా కువైట్‌లో ఉపాధి కోల్పోయి, అనారోగ్య కారణాల వ‌ల్ల‌, వీసా గడువు ముగిసి అదే సమయంలో ...

Read More »

సౌదీలో యజమాని చిత్రహింసలు…

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీలోని భారత రాయబారి డా.ఔసఫ్‌ సయీద్‌కి మాజీ ఎంపీ కవిత ఫోన్‌ చేయడంతో ఎంబసీ అధికారులు, జాగృతి భాద్యుల‌ సహకారంతో అంకమొల్ల‌ రవి పోలీసుల‌ను ఆశ్రయించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… మే24 న తీవ్ర గాయాల‌తో అంకమొల్ల‌ రవి సౌదీలో తన యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని వీడియో సందేశం పంపాడు. అదే రోజు ఉదయం మాజీ ఎంపి క‌ల్వ‌కుంట్ల కవిత సౌదీ అరేబియాలోని భారత రాయబారి డా.ఔసఫ్‌ సయీద్‌తో మాట్లాడి త్వరగా ...

Read More »

ఆపన్నుల‌ను ఆదుకోవడంలో జాగృతి ముందుంటుంది

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి నాయకులు నరాల‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నిత్యావసర సరుకుల‌ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్‌ పాల్గొని దాదాపు 40 నిరుపేద కుటుంబాల‌కు అందజేశారు. ఈ సందర్భంగా అవంతి కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఆపత్కాలంలో ఎప్పుడూ ముందుండి ఆపన్నుల‌ను ఆదుకుంటుందన్నారు. మన నగరంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఏ అవసరమొచ్చినా తెలంగాణ జాగృతి ...

Read More »

మాజీ క్రీడాకారుల‌కు, కోచ్‌ల‌కు నిత్యవసరాల పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో మాజీ క్రీడాకారుల‌కు, ప్రైవేటు కోచ్‌ల‌కు నిత్యావసర సరుకుల‌ను అందించినట్టు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నరాల‌ సుధాకర్‌ తెలిపారు. వివిధ క్రీడల‌కు ప్రైవేటుగా కోచింగ్‌ ఇస్తూ జీవనం సాగిస్తున్న ప్రైవేట్‌ కోచ్‌ల‌కు శుక్రవారం నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఏర్పడిన తరుణంలో కబడ్డీ కోచ్‌ ప్రశాంత్‌ ద్వారా ప్రైవేట్‌, మాజీ క్రీడాకారుల‌ పరిస్థితిని తెలుసుకొని వారికి నిత్యావసర సరుకుల‌ను నరాల‌ సుధాకర్‌ అందజేశారు. కార్యక్రమానికి సహకరించిన ...

Read More »