Tag Archives: utilized

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

  నందిపేట, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఐలాపూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్‌ ఉమాకాంత్‌, సొసైటీ ఛైర్మన్‌ లక్ష్మినారాయణతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారుల బెడద నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఏగ్రేడ్‌ ధాన్యానికి రూ. …

Read More »

విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని వీరాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులు విద్యార్థులకు జత ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చక్కని విద్యాబోధన జరుగుతుందని దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పురం వెంకట్‌ సూచించారు. పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

మత్స్యకారులు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాఇ

  కామారెడ్డి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యపారిశ్రామిక సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమలు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మత్స్యపారిశ్రామిక సంఘాలకు బ్లూ రెవెల్యూషన్‌పై అవగాహన కల్పించారు. పథకం కింద చేపల చెరువుల నిర్మాణం, చేపల హాచరీల నిర్మాణం, చేప పిల్లల పెంపకం, కేజ్‌లలో చేపల పెంపకం, మినీ దాణా ఉత్పత్తి పాంల్లు, వలలు, తెప్పలు, మోపెడ్‌లు, ఇన్సులేటెడ్‌ వాహనాలు, నర్సరీలు, చేపల దుకాణాలు, చేప పిల్లల సరఫరాల …

Read More »

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  గాంధారి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగులకు వ్యాయామ చికిత్సలు అందజేశారు. ఇందులో భాగంగా స్థానిక భవిత సెంటర్‌లో డాక్టర్‌ మహేశ్‌ దివ్యాంగులైన విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నడిపించడం, బోర్ల పడుకోబెట్టడం, గోడకు ఒరగ కూర్చొబెట్టడం లాంటి సూచనలు తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిటిసి రాంకిషన్‌, అంగన్‌వాడి టీచర్లు కమల, బీమాబాయి, రిసోర్సు టీచర్లు పెంటయ్య, సాయన్న పాల్గొన్నారు.

Read More »

సేవలను సద్వినియోగం చేసుకోవాలి

  నిజాంసాగర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐసిడిఎస్‌ ఆద్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ సాదుల సత్యనారాయణ అన్నారు. కోమలంచ గ్రామంలో అంగన్‌వాడి కేంద్రంలో పోషక పదార్థాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాతా, శిశు మరణాలు తగ్గించడంతోపాటు పిల్లలకు పోషకాహార లోపం లేకుండా ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందిస్తున్నట్టు తెలిపారు. గర్భిణీలకు పౌష్టికాహారాన్ని సరిగా అందించాలని సూచించారు. ఆయన వెంట సూపర్‌వైజర్లు శ్రీలత, సరస్వతి ఉన్నారు.

Read More »

సబ్సిడీ తాటిపత్రాలు సద్వినియోగం చేసుకోవాలి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం సబ్సిడీ కింద తాటిపత్రాలను సరఫరా చేసిందని ఏఓ లావణ్య మంగళవారం తెలిపారు. అవసరమున్న రైతులు పట్టా పాసుపుస్తకం జిరాక్సు, ఆధార్‌కార్డు జిరాక్సు, రెండు ఫోటోలతో పాటు ఎంఎస్‌ యూనియన్‌ క్వాలిటి ప్లాస్టిక్‌ లిమిటెడ్‌ ముంబయి పేబిల్‌ ఎట్‌ హైదరాబాద్‌ పేరుతో 1250 రూపాయలు డిడి తీసి దరఖాస్తు ఫారంతో జతచేసి వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాలకు కార్యాలయంలో వ్యవసాయాధికారులను సంప్రదించాలని ఆమె కోరారు.

Read More »

సాదాబైనామాలను వినియోగించుకోండి…

  బీర్కూర్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సారాబైనామాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని మండలంలోని ఆయా వ్యక్తులు సాదా బైనామాల ద్వారా పట్టాలు పొందాలని తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు. మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో సాదాబైనామాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కిష్టాపూర్‌, చించోలి గ్రామ పరిధిలో 38 దరఖాస్తులు వచ్చాయని, కిష్టాపూర్‌ గ్రామంలో 18 పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. నసురుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాలకు కలిపి 724 దరఖాస్తులు వచ్చాయని, బీర్కూర్‌ మండలంలో మూడు, నాలుగు రోజుల్లో అర్హులైన రైతులకు …

Read More »