Breaking News

Tag Archives: varni

వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ

వర్ని, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌, రాష్ట్ర ఐటి సెల్‌ అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ రావ్‌ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కూనీపూర్‌ రాజారెడ్డి ఆధ్వర్యంలో చింతకుంట అనాథ వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ మదన్‌ మోహన్‌ రావు ఎంతో మంది యువకుల‌కు ఉపాధి అవకాశాలు కల్పించారని, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రతి పట్టణం, ప్రతి ...

Read More »

కరోనా బాధితుడిపై కవిత మమకారం

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లిన వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రి పాల‌య్యాడు. మొదట గుండెనొప్పి రావడంతో స్నేహితులు అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో గుండె జబ్బుల‌తో పాటు కరోనా వ్యాధి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మోస్రా మండలం చింతకుంట గ్రామానికి చెందిన సురేష్‌ రెడ్డి బతుకుదెరువు కోసం 20ఏళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లి ముగ్గురు పిల్ల‌లు, భార్య కుటుంబ సభ్యుల‌ను నెల‌సరి వేతనంతో పోషిస్తోండగా మార్చి 16న ఆసుపత్రి పాల‌య్యాడు. ఆసుపత్రిలో చేరిన ...

Read More »

న్యాయ్‌ యోజన పథకం వర్తింపజేయాలి

వర్ని, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్‌ గాంధీ వర్దంతి సందర్బంగా యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కూనీపూర్‌ రాజారెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడ నియోజకవర్గం మొస్రా మండలంలో ‘‘న్యాయ్‌ యోజన పథకం’’ వర్తింపజేయాల‌ని తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న చాలా మంది పేదల‌ను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల‌ని డిమాండ్‌ చేశారు. నిరుపేదల‌కు న్యాయ్‌ యోజన పథకం వర్తింపజేయాల‌ని, దేశ వ్యాప్తంగా వచ్చే ఆరు నెల‌ల ...

Read More »

రైతుబీమా చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు మంగళవారం వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో రైతుబీమా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుబీమా ద్వారా రైతులకు బీమా సౌకర్యం లభిస్తుందని ఆయన వివరించారు. ఎవరైనా రైతుబీమాలో తమ పేర్లు నమోదు చేసుకోకుంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి వద్ద నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో 97 వేల ...

Read More »

తెరాసలో చేరిన పలువురు నాయకులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో గురువారం వర్ని మండల కేంద్రంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు తెరాసలో చేరుతున్నారన్నారు. బంగారు తెలంగాణే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రికి తామందరం అండగా ఉండి బంగారు తెలంగాణ సాకారం చేసుకుందామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజి.గౌడ్‌, ...

Read More »

వివాహిత అదృశ్యం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ఏ.సునీత (28) గత డిసెంబరు 30 తేదీ నుంచి కనబడకుండా పోయిందని, మూడురోజులు గడుస్తున్నా ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త సాయిలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వర్ని ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Read More »

వర్నిలో స్పెషల్‌డ్రైవ్‌

  వర్ని, ఫిబవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న బకాయిలన్ని చెల్లించి గ్రామాభివృద్దికి సహకరించాలని పంచాయతీ కార్యదర్శులు అన్నారు. ఈ మేరకు వర్ని మండలంలోని శ్రీనగర్‌ కాలనీలో మంగళవారం కార్యదర్శులు ఇంటింటికి తిరుగుతూ ఇంటిపన్ను, నీటికుళాయి పన్నులు వసూలు చేశారు. ఈ సందర్భంగా రూ. 17,500 వరకు పన్ను వసూలైనట్టు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో కార్యదర్శులు అబ్బాగౌడ్‌, రాజేశ్‌, భాస్కర్‌, దీపిక, మోహన్‌రెడ్డి, పరిపూర్ణ పాల్గొన్నారు.

Read More »