తాజా వార్తలు

పని చేసే వారిని మాత్రమే నియమించాలి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామంలో రోజూ శానిటేషన్‌ జరగాల‌ని, గ్రామ వన సేవకుల‌కు ఎక్కడ పేమెంట్‌ అగవద్దని, ఒకవేళ పాత మొక్కలు చనిపోతే వాటి స్థానంలో మళ్ళీ మొక్కలు పెట్టాల‌ని‌, ప్రతి గ్రామంలో ఐదు గురు వన సేవకులు పని చేసే విధంగా చూడాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం తహసీల్దార‌ులు, పంచాయతీ రాజ్ ఏఈల‌ తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి గ్రామంలో తప్పకుండా 2 వేల‌ మొక్కలు ...

Read More »

ఏదో ఒకరోజు గొప్పవ్యక్తి గాని సామాన్య వ్యక్తి గాని అక్కడికి వెళ్ళాల్సిందే

re నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఐపి డెడ్‌ బాడీల‌కు ఏ విధంగా శవ యాత్ర నిర్వహిస్తారో అదేవిధంగా పేదవాడికి కూడా నిర్వహించే విధంగా వైకుంఠ ధామాలు తయారు కావాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని మండలాల‌ ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, సెలెక్టెడ్‌ 27 గ్రామాల‌ మోడల్‌ వైకుంఠధామాలు ఏర్పాటు చేసే సర్పంచుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మోడల్‌ వైకుంఠధామం నిర్మాణంలో గ్రామంలోని ప్రతి ఒక్కరి ...

Read More »

ఆర్మూర్‌లో నిరసన ప్రదర్శన

ఆర్మూర్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ కార్మిక ప్రజావ్యతిరేక విధానాల‌కు నిరసనగా జూలై 3న దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాల‌ని కార్మిక సంఘాల‌ జేఏసీ పిలుపుమేరకు ఆర్మూరు ఆర్‌డివో కార్యాల‌యం వద్ద ఐ.ఎఫ్‌.టి.యు, సిఐటియు, ఏఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి ఆర్‌డివోకు వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నానుద్దేశించి ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ముత్తన్న, దాసు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, ఎల్ల‌య్య, ఏఐఎఫ్‌టియు నాయకులు సుధాకర్‌ మాట్లాడారు. కరోనా వ‌ల్ల‌ ...

Read More »

ప్రతి ఒక్కరు అల‌ర్ట్‌

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హెల్త్‌ డిపార్ట్మెంట్‌పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ లో రెండు మూడు రోజుల్లో కోవిడ్‌ సాంపెల్స్‌ తీసుకోవడం ప్రారంభిస్తామని, ఇక్కడే టెస్ట్లు చేస్తామని, నిజామాబాద్‌లో కేసు ఎక్కువ వచ్చే అవకాశమున్నందున ప్రతిఒక్కరు అలెర్ట్‌గా ఉండాల‌ని అన్నారు. కోవిడ్‌ కేసులు రాగానే వారి ప్రైమరీ కాంటాక్టు గుర్తించి వారిని హౌస్‌ క్వారెంటైన్‌ ...

Read More »

కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత కృషితో కువైట్‌ నుండి తెలంగాణ వాసులు హైదరాబాద్‌ చేరారు. భారీ విమానం బోయింగ్‌-777 ద్వారా హైదరాబాద్‌కు 320 మంది చేరుకున్నారు. కువైట్‌లో ఉన్న తెలంగాణ వాసుల‌కు అండగా నిలిచి తెలంగాణ జాగృతి కువైట్‌ చార్టెడ్‌ విమానం ఏర్పాటు చేయించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల కవిత సూచన మేరకు కరోనా కారణంగా కువైట్‌లో ఉపాధి కోల్పోయి, అనారోగ్య కారణాల వ‌ల్ల‌, వీసా గడువు ముగిసి అదే సమయంలో ...

Read More »

పబ్లిక్‌కు సిస్టం నేర్పాలి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలం పాల్దా గ్రామాన్ని జిల్లా కలెక్టర్‌. సి నారాయణ రెడ్డి సందర్శించారు. శుక్రవారం గ్రామంలోని వైకుంఠధామం, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాల్దా గ్రామంలోని వైకుంఠధామం మండలంలో ఒక బ్యూటిఫికేషన్‌ మోడల్‌గా ఉందన్నారు. క్రికెట్‌ ఓరియన్‌ నిర్మించటానికి సర్పంచ్‌ ముందుకు రావడం వాళ్ళకి మెటీరియల్‌ బాగుందని సర్పంచిని అభినందించారు. కంపోస్టు షెడ్‌లో వెంటనే తడి చెత్త, పొడి చెత్త ...

Read More »

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు సోదర సంఘాల‌తో నిరసన చేపట్టినట్టు ఏఐసిటియు, బిఎల్‌టియు కార్మిక సంఘాల‌ నాయకులు రాజలింగం, సదానందం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2 వ సారి అధికారం చేపట్టగానే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు 44 రద్దు చేసి నాలుగుకోడ్లుగా రూపొందించే కుట్ర చేయడం తక్షణం మానుకోవాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత లాక్‌ డౌన్‌ సందర్భంగా అసంఘటిత ...

Read More »

చెట్ల పెంపకమే పరిష్కారం

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐటిఐ కాలేజ్‌ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ మొక్కలు నాటి నీరుపోశారు. నగరంలో హరితహారం కార్యక్రమం శరవేగంగా కొనసాగుతుందని తెలియజేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన సుమారు 15 ల‌క్షల మొక్కల‌ పెంపునకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. నిజామాబాద్‌ నగరాన్ని హరిత వనంగా మార్చటానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. మారుతున్న కాలంతో పాటు వాతావరణంలో అనేక మార్పుల వల‌న ...

Read More »

నివేదికలు నిర్ణీత సమయంలోగా పంపాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి హామీ పనులు, రైతు వేదికల‌ నిర్మాణం, రైతు కల్లాల‌ నిర్మాణం, హరితహారం తదితర కార్యక్రమాల‌ను జిల్లాలో వేగవంతం చేయడానికి జిల్లా లోని 22 మండలాల‌కు జిల్లా అధికారుల‌ను స్పెషల్‌ ఆఫీసర్స్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశాలు జారీ చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమాల‌కు సంబంధించి రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌, ప్రతి రోజూ పారిశుద్ధ్యం, డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామాలు, ...

Read More »

ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ ఆఫీస్‌ సమీపంలో తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవల‌ప్మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపోను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. శరత్‌ పరిశీలించారు. ఇసుక అవసరమున్న జిల్లా ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరారు. మీ సేవ కేంద్రాల‌, ఆన్‌లైన్‌ ద్వారా ట్రాక్టర్‌ నెంబర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని అనంతరం ట్రాక్టర్‌ ఇసుక కోసం 4 వేల‌ 400 రూపాయలు చెల్లించాల‌ని సూచించారు. పూర్తి వివరాల‌కు సెల్‌ నెంబర్లు ...

Read More »

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ఉండే విధంగా సర్పంచులు, కార్యదర్శులు పరిశీల‌న చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాల‌యంలోని జనహిత హాలులో హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కల‌ సంరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీల‌కు అప్పగించనున్నట్లు చెప్పారు. హైవే అధికారులు నాటిన మొక్కల‌ సంరక్షణను గ్రామ పంచాయతీల‌కు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల‌ ...

Read More »

అర్హత గల రైతుల‌కు పంట రుణాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు కల్లాల‌ నిర్మాణం పనుల‌ను త్వరిత గతిన పూర్తి చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. గురువారం స్థానిక వెల‌మ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ల‌బ్ధిదా‌రుల‌ జాబితాను ఈ నెల‌ 3 లోగా జిల్లా కేంద్రానికి పంపాల‌ని సూచించారు. ఈనెల‌ 10లోగా 20 శాతం రైతుల‌ కల్లాల‌ నిర్మాణాల‌ను పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అర్హతగల‌ రైతుల‌కు పంట రుణాలు ఇప్పించాల‌ని ...

Read More »

వృద్ధుల‌కు ‘ఆల‌న’తో చికిత్స

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా అసాంక్రమిక వ్యాధుల‌ నివారణలో భాగంగా ఆల‌న అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి చేతుల‌ మీదుగా గురువారం ప్రారంభించారు. కార్యక్రమం పైట్‌ ప్రాజెక్టుగా జిల్లాలో దర్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంగా గుర్తించి దానికి అనుబంధంగా నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ను గుర్తింంచినట్టు పేర్కొన్నారు. ఈ కేంద్రాలు పిహెచ్‌సి భీంగల్‌, పిహెచ్‌సి సిరికొండ, పిహెచ్‌సి జక్రాన్‌పల్లి, పిహెచ్‌సి ఇందల్‌వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో పనిచేస్తుందన్నారు. ...

Read More »

అవ్వకు బువ్వ

ఆర్మూర్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రక్ష స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యములో ‘‘అవ్వకు బువ్వ’’ కార్యక్రమములో ప్రతి నెల‌లో భాగంగా పేదల‌కు ఒక్కొక్కరికి 5 కిలోల‌ చొప్పున 47 మంది పేద వృద్దుల‌కు ఉచితంగా బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఖాందేష్‌ మాట్లాడుతూ పేద వృద్దుల‌కు తమవంతు సహకారం అందిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ అన్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ అధ్యక్షుగా ఎన్నికైన ప్రవీణ్‌ పవార్‌ని ఘనంగా ...

Read More »

సైంటిస్టుకి అరుదైన గౌరవం

డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని వృక్షశాస్త్ర అధ్యయన శాఖలోని సైంటిస్టుకి అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్‌ తాళ్ళ సాయి కృష్ణా అనే సైంటిస్టుకి డి.ఎస్‌. కొఠారి పోస్టు డాక్టోరల్‌ ఫెలోషిప్‌ వచ్చింది. తెలంగాణ యూనివర్సిటీ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ విద్యావర్ధిని పర్యవేక్షణలో మొక్కల్లో తామర పురుగు వ‌ల్ల‌ వచ్చే వ్యాధులు, రోగ నిరోధక శక్తి అనే అంశంపై పరిశోధనలు జరపటానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ ఫెలోషిప్‌ ప్రదానం చేసింది. గతంలో కూడా ఆయనకు సెర్బ్‌ యంగ్‌ ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">