Breaking News

సినిమా రివ్యూ: ‘రౌడీ’

నటవర్గం: మంచు మోహన్ బాబు మంచు విష్ణు జయసుధ శాన్వీ శ్రీవాస్తవ వెన్నెల కిషోర్ తనికెళ్ల భరణి రవిబాబు సంగీతం: సాయి కార్తీక్ కెమెరా: సతీష్ ముత్యాల దర్శకత్వం: రాం గోపాల్ వర్మ
పాజిటివ్ పాయింట్స్: మోహన్ బాబు, విష్ణు, జయసుధ యాక్టింగ్ రీరికార్టింగ్, డైలాగ్స్ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, తనికెళ్ల భరణి (వేదం) క్యారెక్టర్ విలనిజం సెకండాఫ్
తెలుగులో రక్త చరిత్ర తర్వాత వర్మ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్ర విజయం తర్వాత మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్ లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రౌడీ చిత్రాన్ని రూపొందించారు. విడుదలకు ముందే ఆడియో, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచారు. ప్రేక్షకుల అంచనాలను రౌడీ చేరుకున్నాడా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకుందాం!
రాయలసీమలో సమాంతర ప్రభుత్వం నడిపించే అన్నగారు (మోహన్ బాబు) కు కృష్ణ (మంచు విష్ణు), భూషణ్ (కిశోర్) ఇద్దరు కుమారులు. ప్రజల కీడు చేసే నందవరం ప్రాజెక్టుకు అన్నగారు వ్యతిరేకం. ఎలాగైనా అన్నగారిని అడ్డు తప్పించి నందవరం ప్రాజెక్టును దక్కించుకోవాలని ప్రత్యర్థి వేదం (తనికెళ్ల భరణి) బృందం తీవ్రంగా ప్రయత్నిస్తుంది.  అయితే అన్నగారిని తప్పించడం తమ వల్ల కాదని తెలుసుకున్న వేదం బృందం భూషణ్ ను తమ వర్గంలో చేర్చుకోవడమే కాకుండా ఆయనపై పక్కా ప్లాన్ తో హత్యాయత్నం చేస్తారు. హత్యాయత్నం జరిగిన అన్నగారి పరిస్థితేమిటి? తండ్రిని కృష్ణ రక్షించుకున్నాడా? ప్రత్యర్ధి వర్గంతో కలిసిన భూషణ్ ఏమయ్యాడు. చివరికి నందవరాన్ని అడ్డుకోవడంలో అన్నగారు సఫలమయ్యారా అనే ప్రశ్నలకు ‘రౌడీ’ చూడాల్సిందే.
అన్నగారి రూపంలో మోహన్ బాబుకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. ఈ పాత్రలో సరికొత్త మోహన్ బాబును ప్రేక్షకులు చూస్తారు. రౌడీ చిత్రంలో మోహన్ బాబు అన్నీ తానై ముందుండి చక్కటి రౌడీయిజాన్ని ప్రదర్శించారు. అన్నగారి పాత్రలో మోహన్ బాబు నుంచి ఉత్తమ ప్రదర్శనను రౌడీ చిత్రంలో చూడవచ్చు. మోహన్ బాబు డైలాగ్ డెలివరీలో కొత్తగా చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది.
గత కొద్దికాలంగా కామెడీని నమ్ముకుని విజయాలను సొంతం చేసుకున్న విష్ణుకి కృష్ణ పాత్ర విభిన్నమైందే. సెకండాఫ్ లో ముఖ్యంగా విష్ణు క్లైమాక్స్ లో విజృంభించాడు. నటుడిగా తనను తాను నిరూపించుకోడానికి కృష్ణ పాత్రను విష్ణు పూర్తిగా వినియోగించుకున్నాడు. గ్లామర్ పరంగా శాన్వీ పర్వాలేదనిపించింది.
తల్లి పాత్రలో జయసుధ తన మార్కు నటనను చూపించారు. కొన్ని సన్నివేశాల్లో మోహన్ బాబు, జయసుధల కాంబినేషన్ లో వచ్చే సీన్లు బ్రహ్మండంగా ఉన్నాయి. తనికెళ్ల భరణి ప్రసంగాలు, ఉపన్యాసాలు ఆరంభంలో బాగానే అనిపించినా.. ఓవరాల్ గా విసిగించాడనే చెప్పవచ్చు. మిగతా ప్రాతలు వాటి పరిమితులకు అనుగుణంగా ఓకే అనిపించేలా ఉన్నాయి.
విశ్లేషణ:
గాడ్ ఫాదర్ స్ఫూర్తితో సర్కార్ అందించిన వర్మ.. ఇంకా ఆ ప్రభావం నుంచి బయట పడనట్టే కనిపిస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ కు’ గాఢ్ ఫాదర్’, సర్కార్ లను జోడించి ‘రౌడీ’ని అందించారు. తెలుగు ప్రేక్షకులకు (సర్కార్) చూడనివారికి రౌడీ నచ్చేలా ఉంటుంది. అయితే తొలిభాగాన్ని పకడ్భందీగా రూపొందించిన వర్మ రెండో భాగంలో అదే ఊపును కొనసాగించలేకపోయారు. మోహన్ బాబులో ఫైర్.. అన్నగారి పాత్రలో ఉండే ఇంటెన్సిటీని  జోడించి వర్మ చేసిన ప్రయత్నం మెప్పించేలా ఉంది. వర్మ తన రెగ్యులర్ మేకింగ్ స్టైల్ భిన్నంగా రౌడీని రూపొందించారనే అనే ఫీలింగ్ కలిగించాడు. అయితే అన్నగారి పాత్రకు ధీటుగా విలనిజం లేకపోవడం ప్రధాన లోపం. పవర్ ఫుల్ గా ఉండే అన్నగారి పాత్ర ముందు వేదం(తనికెళ్ల భరణి) పాత్ర తేలిపోయింది. వేదం పాత్ర సెకెండ్ గ్రేడ్ విలన్ గా ఉండటం కారణంగా రక్తి కట్టించలేకపోయింది. ఫోటోగ్రఫీ, రీరికార్డింగ్, సింక్ సౌండ్ తరహా టెక్నికల్ అంశాలు ‘రౌడీ’కి అదనపు ఆకర్షణ. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లకు ప్రాణం పోసింది. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ బాగుంది. సెకండాఫ్ పై మరికొంత కేర్ తీసుకుంటే ‘రౌడీ’ తెలుగు ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చేది. ముగింపుగా ‘రౌడీ’ చిత్ర విజయం మోహన్ బాబు, వర్మ మంచు విష్ణులపైనే ఆధారపడి ఉంది. మోహన్ బాబుపై అంచనాలు పెట్టుకుని థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడికి ‘రౌడీ’ సంతృప్తిని ఇవ్వడం ఖాయం.
The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

‘కాలుతోందా మీకు..’ విజయ్ దేవరకొండ కామెంట్స్

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఇప్పుడో సెన్సేషనల్. అర్జున్‌రెడ్డి సినిమాపై విమర్శలు చేసిన వీహెచ్‌ను ‘తాతా చిల్’.. అన్నా.. సెన్సార్ టీంను ...

Comment on the article