Breaking News

బాన్సువాడ నియోజకవర్గం

బాన్సువాడ నియోజకవర్గం

బాన్సువాడ జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. తొలి ఎమ్మెల్యేగా సంగెం లక్ష్మీభాయి ఎన్నికయ్యారు. నియోజకవర్గ ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లా వరప్రదాయినిగా పిలిచే నిజాంసాగర్ ప్రాజెక్టుపై ఆయకట్టు ఎక్కువగా ఈ నియోజకవర్గంలోనే ఉంది. నియోజకవర్గంలోని బొప్పాస్‌పల్లిలో 1957లో వ్యవసాయ విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. వర్ని మండలం రద్రూర్‌లో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. ఇక్కడే వ్యవసాయ పాల్‌టెక్నిక్ కళాశాల కూడా ఉంది. వర్ని మండలంలో ప్రసిద్ధ క్షేత్రం బడాపహాడ్ ఉంది. బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో సోమేశ్వరాలయం అతిపురాతన శైవక్షేత్రం. జిల్లాలోనే ఏకైక సరస్వతీ ఆలయం బాన్సువాడ పట్టణంలో ఉంది. 
The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article