Breaking News

గోవులను కాపాడుకుందాం

భగవంతుడు మనుషులను పుట్టించడానికి పూర్వమే మన బ్రతుకు చక్కగా సాగడానికి గోమాతను పంపించాడు. ఆ తల్లి కరుణాకటాక్షాలతో సకల సంపదలతో మన భారతావని పూర్వం అత్యంత వైభవంగా విరాజిల్లింది. సకల వేదాలు, పురాణాలు, సకల శాసా్తల్రు గోమాతను కొనియాడాయి. ఆమెను ప్రత్యక్ష దైవంగా ఈ దేశం స్వీకరించింది. హిందూ సం ప్రదాయంలో గోపూజ ప్రధానమైనది. గోవు శరీరంలో సమస్త దేవతలు నెలకొని వున్నారని మన…పురాణాలు చెప్తున్నాయి. గోవునునడిచే దేవాలయంగా చెప్పుకోవచ్చు. శుభకార్యాలయా ల్లో గోవు మూత్రాన్ని వాడతారు. గోవు ఆశ్చర్యకరమైన ప్రయోగశాల అన్నారు పెద్దలు. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, మేధో సంపత్తిని వృద్ధి చేస్తుంది. పాల నదులు ప్రవహించిన ఈ బంగారు గడ్డపై పాపాల నదులు, గోమాత రక్తపుటేరులు పారుతున్నాయి. చారిత్రక దృష్టితో పరి కించితే గోరక్షణకు సంబంధించిన ప్రశ్న మొట్టమొదటగా ముస్లిం శాసకాలంలోనే కనపడుతుంది. అంతకుముందు కాలంలో గోహత్య అసలు ఊహకందని మాట.ఇస్లాం ఈ దేశంలో హిందూ ధర్మ సంస్కృతులను సమూలంగా నాశనం చేయాలని ఆశించింది. ఆంగ్లేయులు ఆవును మాంసాన్నిచ్చే జంతువుగానే గుర్తించారు. ముస్లింలు తాము తినడానికన్నా హిందువుల మనోభావాలను గాయపరిచేందుకే గోహత్యను ముమ్మరంగా చేశారు. మందిరాలను నేలమట్టం చేసి మసీదులు కట్టేందుకు ముందు వారు కావాలని గోవుల రక్తాన్ని ఆ స్థలంపై అలికేవారు. కారణం ఆ స్థలంలో మరెన్నడూ హిందువులు దేవాలయం కట్టరాదని చేసేవారు.

పశువులను `నిరుపయోగం’ అని ప్రకటించి వాటిని వధ చేస్తుండటం చాలా దు:ఖకరమైన విషయం. ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లకు 20,000 పశువులు దొంగచాటుగా రవాణా అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్క విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక పశువధశాల నుంచి 20 కోట్ల రూపాయలు ఎగుమతులు అవుతున్నాయనుకుంటే అక్కడ వధకు గురయ్యే పశువులతో తయారుచేయదగిన ఎరువులు, శక్తి విలువ 910 కోట్ల రూపాయలను మనం కోల్పోతున్నామన్న మాట. ఆ రకంగా ఆర్థిక వినాశనం కొనితెచ్చుకుంటున్నాము. భారతదేశంలో వ్యవసాయ అస్ధిరతకు గురై, పేదరికం మరింత పెరుగుతుంది. శాస్త్రజ్ఞులు చెప్పేదానినిబట్టి పశువధ కారణంగా భూకంపాలు తరచుగా ఏర్పడి జనవినాశనానికి కారణభూతమవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పుంగనూరు సంతతి ఆవు సుమారుగా అదృశ్యమైంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి సంతతి అరుదుగానే లభిస్తోంది. ఈ స్వదేశీ సంతతికి చెందిన ఆవులు నేడు 32 తెగలు మాత్రమే లభ్యమవుతున్నాయి.

ముజఫర్‌ హుస్సేన్‌ అనే రచయిత `ముస్లింలు – శాకాహారము’ అనే గ్రంథం రాశాడు. ప్రముఖ ఇస్లాం పండితుడు అల్థాజ్‌ అలి (కీ.శ.1058-1111)తన `ఆహ్యాఉల్‌-దీన్‌’ అనే గ్రంథంలో `గోమాంసం విషకరమైనది(మార్‌‌జ), ఆవు పాలు ఆరోగ్యవంతమైన ఆహారము (సఫా), ఆవు నేయి ఔషధగుణాలు కల్గినది’ అని పేర్కొన్నాడు. బాబర్‌ తన కుమారుడు హుమాయూన్‌ పేరిట రాసిన వీలునామాలో `తుజుక్‌-ఇ-బాబరీ’లో భారతీయులు మత విశ్వాసాలు కలిగినవారు. వారి మనోభావాలను గౌరవించి మొగల్‌ సామ్రాజ్యంలో గోహత్యను జరుగనీయవద్ద’ని పేర్కొన్నాడు. గోవును చంపిన వారి చేతులు నరికేయమని మైసూరు దివాన్‌ హైదరాలి 1829లో శాసనం చేశాడు. 1857లో బహదూర్‌షా జఫర్‌ ఢిల్లీ చక్రవర్తి అయిన సమయంలో గోవధ నిషేధాన్ని ప్రకటించాడు. ఆగస్టు 1న జరిగిన బక్రీదు పండుగనాడు ఒక ఆవుకూడా వధింపకపోవడం గమనార్హం. భారతదేశంలోని అత్యధిక ముస్లింలందరి పూర్వీకులు హిందువులే. ఆవు దేశావసరం. అది మత సంబంధమైన జంతువు కాదు. ఆనాడు భారతదేశంలో ఉన్నది హిందువులు మాత్రమే. హిందూమతాన్ని గౌరవించే వారు కనుక ఆవు వాళ్ల సొత్తయింది. కనుక గోవు కేవలం హిందువులకే కాదు అన్ని మతాల వారికీ, అన్ని జాతుల వారికీ తల్లే.

ఆంగ్లేయుల కుట్ర : 17వ శతాబ్దంలో ఆంగ్లేయులు భారతదేశం వచ్చేనాటికి మనదేశంలో జనాభాకంటే గోసంపద, పశుసంపద అధికంగా ఉండేది. ఆవు భారతీయ వ్యవసాయానికి కేంద్ర బిందువు. మనది గోఆధారిత వ్యవసాయం. ఆంగ్లేయులకు ఈ స్థితి ఆశ్చర్యం, అసూయ కల్గించాయి. వారి దృష్టిలో ఆవు అంటే మాంసాన్నిచ్చే జంతువు. స్వతహాగా వారు గోమాంస భక్షకులు. రాబర్‌‌టకై్లవ్‌ క్రీ.శ.1760లో కలకత్తాలో రోజుకు 70 వేల పశువులను సంహరించే మొట్టమొదటి గోవధశాలను ప్రారంభించారు. క్రైస్తవ మతప్రచారకుల సహకారంతో విదేశీ పండితులు వేదాలు, ప్రాచీన సాహిత్యానికి తప్పుడు వ్యాఖ్యానాలనిస్తూ భారతదేశంలో ప్రాచీన కాలంలో గోమాంస భక్షణ జరిగిందని ప్రచారంచేసి, పుస్తకాలను ముద్రించారు. వేదాలపై భాష్యం చెప్పిన మాక్‌‌సముల్లర్‌ ఈ కోవకు చెందినవాడే.

స్వాతంత్య్రోద్యమంలో గోవు :
స్వాతంత్య్రం వచ్చిన 5 నిమిషాలలోనే ఒక కలముపోటుతో (శాసనముతో) గోహత్య నిలిపివేయబడును : లోకమాన్య బాలగంగాధర తిలక్‌
నా దృష్టిలో గోరక్షణ స్వరాజ్య సముపార్జనకంటే ఎంతమాత్రం తక్కువకాదు : మహాత్మాగాంధీ
వ్యవసాయ సంస్కృతికి ఆధారమైన గోసంతతిని ఎంత శ్రమించైనా రక్షించుకోవాలి. గోసంతతికి నష్టం కలిఇతే వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. : సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌

మహాభారతంలో `అషై్టశ్యర్మమయీ లక్ష్మీ వసతే గోమయే సదా’ అంటే ఎనిమిది రకాల ఐశ్యర్యాలతో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ గోమూత్రం-గోమయంలో ఉందని అర్థం.’

గోవు, విశిష్టత… :
ప్రాణులలోకెల్లా సర్వోత్కృష్టమైనది భారతీయ గోసంతతి. ఆవు కాకుండా మరే పశువు పాలలోనైనా పాషాణం(ఆర్సెనిక్‌) ఉంటుందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెబుతోంది. ఆవుపాలు పసుపుపచ్చగాను, గేదెపాలు తెల్లగాను ఉంటాయి. అందువలన వీటిని బంగారము, వెండి అంటారు. ఆవుపాలు దాని మూపురంగుండా స్రవించి లభిస్తాయి. మూపురంలో స్వర్ణనాడి ఉంది. ఆవు దూడ పుట్టిన మూడురోజులకే గంతులేస్తుంది. అదే గేదె దూడ 30 రోజుల వరకు మత్తుగా పడిఉంటుంది. ఈ కారణంగానే ఆవుపాల వలన శరీరంటో స్ఫూర్తి కలుగుతుంది.

గోమూత్రంతో లాభాలు:
క్రిమి నియంత్రణ; నివారణ ఔషధాలు తయారవుతున్నాయి. గోమూత్రంలో వేప, జిల్లేడు, తులసి, మారేడు, కానుగ మొదలైన ఒక రకపు ఆకులు 15 రోజుల నానబెట్టి రాగి పాత్రలో మరగించాలి. సగంవరకు దిగిన తర్వాత సీసాలలో పోసి పెట్టుకోవాలి. ఒక లీటరు ఈ ద్రవంలో 100 లీటర్లు నీరు కలిపి పంటపై పిచికారీ చేస్తే కీటకాలు లేకుండాపోతాయి. అలా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. గోమూత్రంలో 10 రెట్లు నీరు కలిపి చెట్లు, మొక్కలపై పిచికారీ చేస్తే కీటకాల నుంచి వాటిని రక్షించవచ్చు.

పేడతో ఉపయోగాలు:
పేడవలన ప్రపంచంలో సర్వశ్రేష్టమైన జీవశక్తి కలిగిన సేంద్రీయ ఎరువు తయారు కొబడుతున్నది. పేడ నుండి గ్యాసు పోయిన తర్వాత నిజానికి మిగిలిన ఆ మడ్డిలోనే ఎరువులను తయారుచేసే గుణాలెన్నో ఉంటాయి. ఏనిమల్‌ వెల్‌ఫేర్‌ బోర్‌‌డ ఆఫ్‌ ఇండియా వారి ప్రకారం ఒక ముసలి ఆవు ద్వారా సంవత్సరానికి 4500 లీటర్ల బయోగ్యాసు, 80 టన్నుల సేంద్రీయ ఎరువు, 200 లీటర్ల సేంద్రీయ కీటక నివారణ ఔషధం లభ్యమవుతాయి. పిడకలు కాల్చడం వలన 6 కోట్ల 80 లక్షల టన్నుల పంటచెరకు ఆదా అవుతోంది. ఇంత పంటచెరకు అంటే 15 సంవత్సరాల వయస్సు కలిగిన 14 కోట్ల చెట్లన్నమాట. ఆశ్చర్యం! ఊహించని ఎంత పెద్ద ఆదాయమిది.

కదిలే శక్తికేంద్రం ఆవు :
మన దేశంలో నేడు గ్యాస్‌, విద్యుత్‌ కొరత చాలా ఉంది. మన వద్ద లభించే తక్కువ ఖరీదు సాధనాల ద్వారా కాక భారీ వ్యయంతో కూడిన సాధనాల ద్వారా గ్యాసును నేడు మనం ఉత్పత్తి చేసుకొంటున్నాం. విదేశీ భావదాస్యంలో మునిగిన మనం మనదైన గోవంశం అందించే గోమయం, గోమూత్రంలోని అద్భుత శక్తిని అవహేళన చేశాం. గోమయంచేత గ్యాసు ఉత్పత్తిని భారీగా చేపట్టవచ్చు. అలా బయటికి వచ్చే మడ్డి పదార్థం ఎంతో విలువైన సేంద్రీయ ఎరువుగా పంటలకు ఉపయోగించవచ్చు. గోమయ, గోమూత్రాలతో గ్యాసు ఉత్పత్తిని ప్రారంభిస్తే దానివలన ఎంతో వంటచెరకు, పిడకలు మిగిలిపోతాయి. పరిశోధనచేసి గ్యాసును సిలిండర్లలో నింపి దేశవ్యాప్తంగా సరఫరాలు కూడా చేపట్టవచ్చు.ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎలాగూ లేవు. కనీసం ఒక్కొక్కరు కాకపోయినా నాలుగు కుటుంబాలు కలిసి పాలిచ్చే పదిగోవులు ఉంచే ఏర్పాటుచేసి చక్కగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యిలతో తమతమ కుటుంబాలలో చక్కని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనుభవించవచ్చు దానితోపాటు తమ చుట్టుపక్కల పర్యావరణ కాలుష్యం లేకుండా చూసుకోవచ్చు. పశ్చిమదేశాల్లో మన సాయూహిక జీవన విధానం ఎడల ఆకర్షణ పెరుగుతోంటే, మనమేమో ఇక్కడ పక్క ఇంటివారిని కూడా చూసి, పలకరించము. ఒకరంటే ఒకరికి పడని వైఖరి సిటీల్లో వేళ్లూనుకుపోయింది. ఎంతసేపూ డబ్బు చుట్టూ మనిషి తిరుగుతున్నాడే తప్పించి, పుట్టినందుకు జీవితాన్ని సార్థకం చేసుకునే మార్గం అన్వేషించడం మానేశారు. ఈ ధోరణి మారినప్పుడే నగరాల్లో దొంగతనాలు, దాడులు, హత్యలు తగ్గుతాయి.

గో సంరక్షణకు మనం ఏమి చేయాలి? :
ఆవు ప్రాముఖ్యతను తెలియజేసే సాహిత్యాన్ని చదివి తెలుసుకోవాలి. రోజూవారీ జీవితంలో గోఉత్పత్తులు, పాలు, నెయ్యి, సబ్బులు, షాంపూ, పండ్లపొడి, అగరవత్తులు.. ఇలాంటి వినియోగవస్తువుల వాడకా న్ని ప్రోత్సహించాలి. గోమూత్రం ద్వారా తయారయ్యే మందులను ఇంట్లోని సభ్యులందరూ వాడేట్లు ప్రోత్స హించాలి. దేవాలయం, ధర్మకర్తలు, భక్తులు ప్రతి దేవాలయం ఒకటి రెండు ఆవులను పోషించేట్టు చూ డాలి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయ విధానాలను, గోఆధారిత వ్యవసాయ విధానాలను రైతులు చేపట్టేట్టు చూడాలి. గోవధ, తరలిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

గోసంరక్షణకై ప్రభుత్వ చర్యలు :
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. గోసంతతి రక్షణకై కేంద్రస్థాయిలో చట్టం చేయాలి. కేంద్ర, రాషా్టల్ల్రో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పర్చాలి.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

అమెరికా = పాతాళ లోకం ??

భారతీయులకు మెక్సికన్లకు సంబంధం వున్నదా? పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది ...

Comment on the article