Breaking News

ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలి -టిఎన్‌ఎస్‌ఎఫ్‌ యజ్ఞం

డిచ్‌పల్లి, నవంబర్‌ 12 : తెలంగాణ యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కేటాయించాలని, నిధుల మంజూరిలో ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని కోరుతూ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం యజ్ఞం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో విశ్వవిద్యాలయానికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం విడ్డూరమన్నారు. వర్సిటీ అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యుడు, జిల్లా మంత్రి, పార్మలెంటు సభ్యురాలు ప్రత్యేకంగా చొరవ చూపి తక్షణమే 200 కోట్ల రూపాయలు కేటాయించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పుప్పాల రవి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బంఆరు బతుకులు అవుతాయి అనుకుంటే విద్యార్థులకు మాత్రం బాంచెన్‌ బతుకు కనిపిస్తుందని విమర్శించారు. కేసిఆర్‌ మనసు మారాలని యజ్ఞం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ టియు అధ్యక్షుడు ప్రశాంత్‌, ఉపాధ్యక్షుడు బాబు, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌, శేఖర్‌, సంతోష్‌, గజానద్‌, రాజు, గణేష్‌, రాందాస్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article