Breaking News
అంగన్‌వాడి

అంగన్‌వాడి పోస్టులకు ఫైరవీలు షూర్‌…. 493 పోస్టులు ఖాళీలు

ఎమ్మేల్యేల చేతికి పగ్గాలు

కుప్పలు తెప్పలుగా ధరఖాస్తులు

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 15,

జిల్లాలో అంగన్‌వాడిల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఫైరవీలకు జోరుగా తెర లేసింది. ఈ నియమాకాలలో ప్రథానంగా స్థానిక ఎమ్మేల్యేల చేతిలో ఉండటంతో స్థానిక అదికారి పార్టీ నాయకులు ఇప్పటి నుంచి ముమ్మరంగా ఫైరవీలకు సిద్దం అవుతున్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈనెల 13న జిల్లాలో అంగన్‌వాడిలలో ఖాళీగా ఉన్న 493 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 36 అంగన్‌వాడి కార్యకర్తలు, 28 మిని అంగన్‌వాడి కార్యకర్తలు, 86 సహాయకులు, 343 లింక్‌ వర్కర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈనెల 21 వరకు ధరఖాస్తులను సంబంధిత సిడిపివోల కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంది. ఇప్పటికే స్థానికంగా శాసన సభ నియోజకవర్గాల్లో అర్హులైన వారు, ఫైరవీలు చేసుకునే వారు ధరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో ఒకోక్క గ్రామం నుంచి సుమారు 10కి పైగా ధరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. ఈ నియమాకాలలో స్థానిక ఎమ్మేల్యేల సమక్షంలో ఇంటార్వులను నిర్వహించి నియమాకాలు చేపట్టాల్సి ఉంది. గతంలో సైతం ఈ తరహాలోనే నియమాకాలను చేపట్టడంతో లక్షల రూపాయాలు చేతులు మారి అనుహ్యనులకే మాత్రమే పట్టం కట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్ద మొత్తంలో పోస్టులకు నియమాకాలు చేపట్టడంతో స్థానిక ఎమ్మేల్యేలు కొత్తగా ఎంపిక కావడంతో వారు సైతం ఈ నియమాకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవల ఎన్నికల్లో పని చేసిన కార్యకర్తలకు చెందిన అనుచరులకే పోస్టులను కట్టపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఖాళీల తీరిది…

జిల్లా వ్యాప్తంగా 493 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 36 అంగన్‌వాడి కార్యకర్తలు, 28 మిని అంగన్‌వాడి కార్యకర్తలు, 86 హెల్పర్‌లు, 343 లింక్‌ వర్కర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌లో 1 అంగన్‌వాడి కార్యకర్తలు, 5 హెల్పర్లు…, నిజామాబాద్‌ రూరల్‌లో 13 అంగన్‌వాడిలు, 4 మిని అంగన్‌వాడిలు, 15 హెల్పర్లు…, ఆర్మూర్‌లో 5 అంగన్‌వాడిలు, 13 హెల్పర్లు…, బాల్కోండలో బీంగల్‌ మండలంలోనే 7 అంగన్‌వాడిలు, 8 మిని అంగన్‌వాడిలు, 11 హెల్పర్లు, 87 లింక్‌ వర్కర్లు…, బాన్సువాడలో 2 అంగన్‌వాడిలు, 5 మిని అంగన్‌వాడిలు, 7 హెల్పర్లు, 40 లింక్‌ వర్కర్లు…, జుక్కల్‌లో మద్నూర్‌ మండలంలో 3 అంగన్‌వాడిలు, 4 మిని అంగన్‌వాడిలు, 3 హెల్పర్లు, 47 లింక్‌ వర్కర్లు…, బోధన్‌లో 2 అంగన్‌వాడిలు, 1 మిని అంగన్‌వాడిలు, 16 హెల్పర్లు, 93 లింక్‌ వర్కర్లు…, కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి మండలంలో 6 హెల్పర్లు, దోమకొండ మండలంలో 5 మిని అంగన్‌వాడిలు, 5 హెల్పర్లు, 28 లింక్‌ వర్కర్లు…, ఏల్లారెడ్డిలో 3 అంగన్‌వాడిలు, 1 మిని అంగన్‌వాడి, 5 హెల్పర్లు, 48 లింక్‌ వర్కర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article