Breaking News

విద్యార్థులకు వైద్య పరీక్షలు

నవీపేట్‌, నవంబర్‌ 25.

మండలంలోని ఫకీరాబాద్‌ పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం రోజున వైద్య అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త హీనత అలాగే డెంటల్‌ ఇతర వ్యాధులపై విద్యార్థులను పరీక్షించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో డా. రాకేష్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ దేవేందర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపి, ఎఎన్‌ఎమ్‌ సులోచన, జమున పాల్గొన్నారు.

బి.జె.పి సభ్యత్వ నమోదు కార్యక్రమం

నవీపేట, నవంబరు 25:

మండల కేంద్రంలో మంగళవారం రోజున బి.జె.పి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నాయకులు రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. రాజు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదును చేయుంచాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్‌ గౌడ్‌, పులి సాయులు, గంగాధర్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article