Breaking News

Daily Archives: December 1, 2014

దేవక్కపేట్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వచ్చభారత్‌

బాల్కొండ, డిసెంబర్‌ 01 భీమ్‌గల్‌ మండలం దేవక్కపేట్‌ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రాధానోపాధ్యాయులు గంగాదాస్‌ ఆద్వర్యంలో స్వచ్చభారత్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ సోదర్బంగా విద్యార్తులు, ఉపాధ్యాయులు కలిసి చీపుర్లతొ చెత్తను ఊడ్చి పాఠశాల ఆవరణను శుభ్రపరిచి పిచ్చిమొక్కలను తొలగించారు. అనంతరం గంగాదాస్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్చ భారత్‌ కార్యక్రమాన్ని విధిగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలొ ఉపాధ్యాయులు శ్రీలత, నవ్యశ్రీ, పాఠశాల చైర్మన్‌ సంగ్యా పాల్గోన్నారు.

Read More »

కోనాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్చభారత్‌

  బాల్కొండ, డిసెంబర్‌ 01 కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రాధానోపాధ్యాయులు సుహాసిని ఆద్వర్యంలో స్వచ్చభారత్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ సోదర్బంగా విద్యార్తులు, ఉపాధ్యాయులు కలిసి చీపుర్లతొ చెత్తను ఊడ్చి పాఠశాల ఆవరణను శుభ్రపరిచి పిచ్చిమొక్కలను తొలగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్చ భారత్‌ కార్యక్రమాన్ని విధిగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలొ ఉపాధ్యాయులు రాజ్‌కుమార్‌, నరేందర్‌, రామక్రిష్ణ, కవిత, శారదా మరియు విద్యార్తులు పాల్గోన్నారు.

Read More »

శిఖం భూమిని కబ్జా దారుల నుండి కాపాడాలి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 01 సారంగపూర్‌ శివారులో గల సర్వే నెం71, ఖాతా నెంబర్‌ 8591 గల 20 ఎకరాల 13 గుంటల చెరువు శిఖం (సర్కారి) భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని కోరుతూ సిపిఎంఐ అధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఇంచార్జి ఎ.వో. గంగాధర్‌, జడ్పి సీఈవో రాజరాంకు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో సిపిఎంఐ ప్రధానకార్యదర్శి గోవర్ధన్‌ మాట్లాడుతూ గతంలో సాగునీటి కోసం చెరువు ఉండేదని ఈ భూమిని కబ్జాదారులు అక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. శిఖం భూమి ప్రక్కన ఉన్న భూమిని ...

Read More »

భవన నిర్మాణరంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 01 భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పర్కిరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట భవన నిర్మాణ కార్మికులు అందోళన చేపట్టారు. అనంతరం భవననిర్మాణరంగాల కార్మికసంఘం అధ్యక్షులు కల్లెడిగంగాధర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గతంలో కేసిఅర్‌ తెలిపారని అయన ఇచ్చిన హామిలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో భవన నిర్మాణ కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్‌, ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌లో ఇంచార్జికి వినతిపత్రం అందజేశారు.

Read More »

వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 01 వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అందోళన చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు అవుతున్న వికలాంగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుందని అరోపించారు. ఈసందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ వికలాంగులకు 1500 రూపాయల పించన్‌ ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేస్తూ, వికలాంగులకు సాగుభూమి, 4 లక్షల రూపాయల గృహనిర్మాణ ౠణం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు అందోళనలు చేస్తామని పేర్కొన్నారు. ఈ ...

Read More »

వెయ్యి రూపాయల పించన్‌ కొరకు బీడీ కార్మికుల ధర్నా

ఆర్మూర్‌, డిసెంబర్‌ 01, బీడీకార్మికులకు వెయ్యి రూపాయల జీవన భ్రుతిని అమలు చేయాలని డిమాండ్‌ చేస్త్తూ వేల్పూర్‌ మండల కేంద్రంలొ ఐఎఫ్‌టియు ఆద్వర్యంలొ సోమవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక బహిరంగ సభలలొ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్‌ బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు జీవన భ్రుతిని అందజేస్తానని హామీ ఇచ్చి బడ్జెట్‌లొ నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం అని, ఇప్పటికైనా అదికారులు స్పందించి బీడీకార్మికులకు వెయ్యి రూపాయల ఫించన్‌ను వెంటనే అమలు చేయాలని అఖిల భారతీయ బీడీ కార్మిక సంఘం ...

Read More »

గోవింద్‌పేట్‌ కార్యదర్శి సస్పెండ్‌

  ఆర్మూర్‌, డిసెంబర్‌ 01, ఆర్మూర్‌ మండలంలొని గోవింద్‌పేట్‌ గ్రామ పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రప్పను సస్పెండ్‌ చేస్తున్నట్లు డీపీఓ సురేష్‌బాబు సోమవారం ఉత్తర్వులు జారీచేసారని ఆర్మూర్‌ యంపిడిఓ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యదర్శి నాగేంద్రప్ప విధులకు సక్రమంగా ఃఆజరు కాకపోవడం వల్ల ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు వివరించారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి విధులను సక్రమంగా నిర్వర్తించాలని లేని యెడల వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Read More »

ఆర్టీసీ వాపార యాజ‌మాన్యుల సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక‌

ఆర్మూర్, డిసెంబ‌ర్ 1 : ఆర్మూర్ ప‌ట్ట‌ణలోని తెలంగాణ ఆర్టీసీ వ్యాపార య‌జ‌మాన్యుల సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నుకోవ‌డం జ‌రిగింది. నూత‌న అధ్య‌క్షుడు చెఱుకు నారాయ‌ణ‌, ఉపాధ్య‌క్షుడు సుంకె శ్రీనివాస్, ప్ర‌దాన కార్య‌ద‌ర్శి మ‌క్బ‌ల్, ఉప కార్య‌ద‌ర్శి రాచ‌ర్ల ధ‌శ‌ర‌త్, శ్రీకాంత్, కోశాదికారిగా ప్ర‌సాద్, స‌ల‌హాదారులుగా కొట్టాల శ్రీనివాస్, ధ‌న్ పాల్ హ‌రిచ‌ర‌ణ్, యాస‌సీన్, బండ‌రి న‌రెంధ‌ర్, ఎండీ వుకీల్, చింత దాసు, రాజులు ఏక‌గ్రీవంగా ఎన్నికైయ్యారు.

Read More »

జాగృతి ఆర్మూర్ ప‌ట్ట‌ణ శాఖా ఆద్వర్యంలో స‌భ్య‌త్వ న‌మోదు

ఆర్మూర్, డిసెంబ‌ర్ 01: ఆర్మూర్ ప‌ట్ట‌ణంలో తెలంగాణ జాగృతి ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ద్యావ‌ర‌శెట్టి శ్రీనివాసబాలు ఆద్వ‌ర్యంలో ప‌ట్ట‌ణంలోని 1,2,3,4,5 వార్డుల‌లో స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హించారు. ఈ సందర్బంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాలను కాపాడ‌డ‌మే కాకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వాటిని ప‌రిష్క‌రించే విధంగా జాగృతి వార‌ధి లాగ ప‌ని చేస్తుంద‌న్నారు. స‌భ్య‌త్వం తీసుకున్న‌వారిలో సైదె వెంక‌టేష్, మ‌నోహ‌ర్, చ‌క్ర‌పాణి, మ‌హేష్ గౌడ్, శివ‌, ప్ర‌సాద్, సాయినాథ్ త‌దీత‌రులు ఉన్నారు.

Read More »

లా సెట్ సెకండ్ కౌన్సిలింగ్ వెంట‌నే నిర్వ‌హించాలి

ఆర్మూర్, డిసెంబ‌ర్1 :   రాష్ట్ర వ్యాప్తంగా లా సెట్ వ్రాసిన విద్యార్థులు 2వ కౌన్సిలింగ్ కొర‌కు వేచి చూడ‌డం జ‌రుగుతుంద‌ని, మొద‌టి కౌన్సిలింగ్ లో సీటు రాని వారు 2వ‌, స్పాట్ కౌన్సిలింగ్ కొర‌కు వేచి చూస్తున్నార‌ని ఏబివీపి ఆర్మూర్ భాగ్ క‌న్వీన‌ర్ మ‌ట్టెల వినోద్ చారీ అన్నారు. ప‌ట్ట‌ణంలోని జ‌ర్న‌లిస్టు కాలొనీలో గ‌ల ఏబివీపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ యునివ‌ర్సిటీ అదికారులు ఖాళీగా ఉన్న సీట్ల‌ను వెంట‌నే భ‌ర్తి చేయాల‌ని, అదేవిదంగా తెలంగాణా యేనివ‌ర్సిటీలో 200పైగా వివిధ ...

Read More »