Breaking News

మాలలను దగా చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

వేల్పూర్‌, డిసెంబర్‌ 2,

తెలంగాణాలో మాలలను ఓటు బ్యాంకుగా వాడుకోని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాలలను దగా చేసే విధంగా ఎస్‌సీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో తీర్మానించడాన్ని మాల మహానాడు ఖండిస్తోంది. ఎస్‌సీ వర్గీకరణ చెల్లు బాటు కాదని సమంజసం కాదని సుప్రీంకోర్టు ఇంతకు ముందు తీర్పు ఇచ్చిన విషయాన్ని మర్చిపోచిన సీఎమ్‌ కేసీఆర్‌, కాంగ్రెస్‌ తెలంగాణ బిజేపి పార్టీట మాల కులస్తులను మోసగించే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఎస్‌సీ లో 54ఉపకులాలు ఉండగా కేవలం మాదిగల ఒత్తిడికి తలొగ్గి ఎప్‌పీ వర్గీకరణ చేయాలని ముందుకు వస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చె తీర్పు తుది నిర్ణయం అని భావించే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు దళితుల మధ్యచిచ్చు పెడుతున్నాయి. వర్గీకరణకు మద్దతు ఇచ్చె పార్టీలను తరిమికొట్టడం కాయం. రాజకీయ పార్టీల నాయకుల ఇల్లను ముట్టడించి గుణపాఠం చెబుతం. మాలలు అంత ఏకమై ఎస్‌ సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సైడ జయరామ్‌, దేవ్యవతి రాజు, గోళి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాల్కొండ నియోజకవర్గంలో 65వేల ఎకరాలకు సాగు నీరందించాలి

కమ్మర్‌పల్లి: బాల్కొండ నియోజకవర్గంలో 65వేల ఎకరాలు సాగులోకి వచ్చేలా అంచనాలు సిద్ధం చేయాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *