Daily Archives: December 4, 2014

ఏరాజ్‌ప‌ల్లిలో తెలంగాణ జాగృతి స‌భ్య‌త్వ న‌మోదు

బోధ‌న్‌, డిసెంబ‌ర్‌04:  బోధ‌న్ మండ‌లం ఏరాజ్‌ప‌ల్లిలో గురువారం తెలంగాణ జాగృతి స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని టిఆర్ ఎస్  నాయ‌కులు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ ఎస్ నాయ‌కులు గిర్ద‌వార్ గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాగృతి స‌భ్య‌త్వ న‌మోదును ప్ర‌తి ఒక్క‌రు చేసుకోవాల‌ని సూచించారు. తెలంగాణ వాదులు టిఆర్ ఎస్ పార్టీని బ‌లోపేతం చేయాల‌ని పిలుపు నిచ్చారు. ఆనంత‌రం గ్రామ‌స్తుల‌కు స‌భ్య‌త్వ‌న‌మోదును చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ ఎస్ నాయ‌కులు ర‌వికిర‌ణ్‌, గంగారెడ్డి, సాయ‌రెడ్డి, తెలంగాణ జాగృతి నాయ‌కులు, గ్రామ‌స్తులు పాల్గోన్నారు

Read More »

ఘ‌నంగా శ్రీ‌కాంత్ చారి వ‌ర్ధంతి

బోధ‌న్‌, డిసెంబ‌ర్‌04:   బోధ‌న్ ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలో శ్రీ‌కాంత్‌చారి 5వ వ‌ర్దంతిని టీఆర్ ఎస్ నాయ‌కులు  గురువారం  ఘ‌నంగా నిర్వ‌హించారు. శ్రీ‌కాంత్‌చారి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు స‌మ‌ర్పించి నివాళ్ళులు అర్పించారు. అమ‌ర‌వీరుల వీరుల త్యాగ‌ఫ‌ల‌మే తెలంగాణ సాకార‌మైంద‌ని నాయ‌కులు  కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ ఎస్ నాయ‌కులు ర‌జాక్‌, శ్రీ‌నివాస్‌, ర‌వి ప‌టేల్‌, గంగాధ‌ర్ త‌దిత‌రులు పాల్గోన్నారు.

Read More »

చ‌లో హైద‌రాబాద్ వాల్ పోస్ట‌ర్ల అవిష్క‌ర‌ణ‌

బోధ‌న్‌, డిసెంబ‌ర్‌04:   కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కార్మిక వ్య‌తిరేక‌విధానాల‌కు  నిర‌స‌న‌గా ఈనెల 5న చ‌లో హైద‌రాబాద్ కార్య‌క్ర‌మం నిర్వహిస్తున్న‌ట్లు ఐఎఫ్‌టీయు, సీఐటీయు నాయ‌కులు గురువారం పోస్ట‌ర్ల‌ను అవిష్క‌రించారు. హైద‌రాబాద్‌లోని ఇందిర పార్కు వ‌ద్ద బ‌హిరంగ‌స‌భ‌, కార్మిక‌, ఉద్యోగ మ‌హా ప్ర‌ద‌ర్శ‌న ఉంటుందని తెలిపారు. ఈ బ‌హిరంగ‌స‌భ‌లో కార్మిక చ‌ట్టాల స‌వ‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని, అసంఘ‌టిత కార్మికుల‌కు ఉపాధి, స‌మాజిక భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, కంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యొగుల‌ను రెగ్యుల‌రైజ్ చేయాల‌ని, ఉద్యోగుల‌కు ప్ర‌తినెల క‌నీసం 15వేలు చెల్లించాల‌ని త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వానికి డిమాండ్ చేయ‌నున్న‌ట్లు ఐఎఫ్ఃటీయు, ...

Read More »