Breaking News

Daily Archives: December 5, 2014

మంత్రివర్యా… మతలబేమిటీ..? జిల్లా ఆస్పత్రిపై ఎక్కడ… అధికారుల మల్లాగుల్లాలు

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 5, జిల్లా ఆస్పత్రిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే మీమాంసపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన చేయడంపై మరోసారి చర్చకు దారి తీసింది. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సమాయత్తం అవుతుంటే మరోపక్క జిల్లా ఆస్పత్రిపై ప్రకటన చేయడం చర్చకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హాయంలో మంత్రిగా పని చేసిన సుదర్శన్‌రెడ్డి జిల్లా ఆసుపత్రిని బోధన్‌లో ఏర్పాటు చేస్తామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారికంగా నివేదికలు తయారు చేయించి ప్రభుత్వానికి పంపారు. అప్పట్లో బోధన్‌లోనే ఆస్పత్రి ...

Read More »

చెరువుల పునరుద్దరణలో అక్రమాలను సహించం -నియోజక వర్గానికి ఒక ట్యాంక్‌బండ్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 5, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్రత్మకంగా చేపడుతున్న చెరువుల పునరుద్దరణ పథకంలో అక్రమాలను సహించేది లేదని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర భారీ, మద్య తరహా నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హారీష్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేపిన మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల ...

Read More »

కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేద్తాం .. -మాజీ స్పీకర్‌ కెఆర్‌.సురేష్‌ రెడ్డి.

ఆర్మూర్‌, డిసెంబర్‌ 05, కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తాం అని మాజీ శాసన సభ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆర్మూర్‌ పట్టణంలోని సైదాబాద్‌లోని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తాహుర్‌ బిన్‌ హుందాన్‌, చంద్రశేఖర్‌లు ముఖ్య అతిథులుగా పాల్టొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ సముద్రమని ఎన్ని రాజకీయాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీని ఏమిచేయలేరన్నారు. తెరాసా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారు అన్నారు. చరిత్రలో ఏప్రభుత్వం ...

Read More »

అమ్మకానికి కొడుకుకు… ఆస్పత్రికి భార్య…

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 5, గుర్తు తెలియిన పసిపాప, మురికి కూపంలో వారం రోజుల శిశువు… అంగట్లో అమ్మెందుకు శిశువు… మాతృత్వం మరిచి విక్రమానికి బాలుడు… ఇది ఇప్పుడు మన జిల్లాలో అక్కడక్కడ వింటున్న దారిద్య్రపు మాటలు. ఒకటో రెండో అనుకుంటే పోరపాటే. ప్రతి నెల రెండు లేదా మూడు సంఘటనలు రోజు ఏదోక రూపంలో వినడమో చూడటమో జరుగుతుంది. ఇంతకు ఇంతటి దారుణం ఏందుకు జరుగుతుందని పరిశీలించాల్సిన పాలకులు, అధికారులు, ప్రభుత్వం నామ మాత్రపు కంటి చూపు చర్యలతో ఈ సంఘటనలను మరుగున ...

Read More »

వాచ్‌మెన్‌ హత్య… పరిచయస్తున్ని ఘాతుకం

నిజామాబాద్‌, నవంబరు 5, డబ్బు కోసం పరియస్తున్ని దారుణంగా హత్య చేసి పరారీ అయిన వ్యక్తుల దూరఘాతం. డబ్బుల కోసం మద్యం తాగించి హత్మ చేసి కనుమరుగు అయిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ చేసారు. ఈ మేరకు ఒకటవ టౌన్‌ ఎస్‌హొచ్‌వో శ్రీనివాసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ మండలం కాలూర్‌ సమీపంలోని గోదాంలో వరంగల్‌ జిల్లా ఇస్పంపల్లికి చెందిన వీరస్వామి(42) పని చేస్తున్నాడు. ఇటీవలే ఈ కుటుంబం కాలూర్‌కు వచ్చిన స్థిర పడ్డారు. వీరస్వామికి మద్యం తాగే ...

Read More »

క్రీడలు మాన‌సీకోల్ల‌సాన్ని క‌ల్గిస్తాయి

బోద‌న్‌, డిసెంబ‌ర్‌05: క్రీడలు మాన‌సికోల్ల‌సాన్ని క‌ల్గిస్తాయ‌ని ఎంపీపీ గంగాశంక‌ర్ అన్నారు. శుక్ర‌వారం బోధ‌న్ మండ‌లం పెంట‌కుర్దులో మండ‌ల స్థాయి రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ క్రీడోత్స‌వాలను జ్యోతి ప్ర‌జాల్వన చేసి  ప్రారంబించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్టాడుతూ పాఠ‌శాల విద్యార్థుల‌కు చ‌దువుతో పాటు క్రీడ‌లు కూడ అవ‌స‌రం అన్నారు. విద్యార్థుల‌కు క్రీడలతోనే ప్ర‌శాంత‌త ల‌భింస్తుంద‌న్నారు. ప్ర‌తి పాఠ‌శాల‌లో క్రీడల కోసం ప్ర‌తిరోజు ఒక గంట స‌మ‌యం కేటాయించ‌ల‌ని సూచించారు. క్రీడలతో శ‌రీర‌క ఆరోగ్యం దృడంగా ఉంటుంద‌న్నారు. ఆనంత‌రం క్రీడాకారులు నిర్వ‌హించిన మార్చ్‌ఫ‌స్ట్‌ను తిల‌కించారు. విద్యార్థులు నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ...

Read More »

రాష్ట్ర‌స్థాయి నెట్‌బాల్ పోటీకి విజ‌య్‌హైస్కూల్ విద్యార్థి ఎంపిక

ఆర్మూర్ రూర‌ల్‌:  ఆర్మూర్ మండ‌లం మమిప‌ల్లిలోని విజ‌య్‌హైస్కూలకు చెందిన విద్యార్థి  క‌ర‌ణ్‌సాయి రాష్ట్ర‌స్థాయి నెట్‌బాల్ టోర్నికి ఎంపికైన‌ట్లు పాఠ‌శాల వైస్ ప్రిన్సిపాల్ విజ‌య‌ల‌క్ష్మి తెలిపారు. నిజామాబాద్‌లోని ముబార‌క్‌న‌గ‌ర్‌లో జిల్లాప‌రిష‌త్ పాఠ‌శాల‌లోనిజ‌రిగిన జిల్లాస్థాయి పోటీలో్ల ప్ర‌తిభ క‌న‌బ‌ర్చి రాష్ట్ర‌స్థాయి పోటీల్లో ఎంపిక‌య్యారన్నారు. ఈనెల 7,8,9 తేదిల్లో  రంగారెడ్డి జిల్లాజ‌రిగే రాష్ట్ర‌స్థాయి పోటీల్లో పాల్గొన‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల వ్య‌వ‌స్థాప‌కురాలు అమృత ల‌త ఎంపికైన విద్యార్థికి, ఇందుకు కృషి చేసిన వ్యాయ‌మ ఉపాధ్యాయులు  సురేష్‌, గంగాదాస్‌ల‌ను అభినందించారు.

Read More »