Breaking News

ప్రతి గింజ విద్యార్థులదే.. అక్రమాలు చేస్తే జైలుకే… కమిషనర్‌ పార్థసారధి

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 12,

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వసతి గృహా, మద్యహ్నా బోజన పథకానికి సన్న బియ్యం పంపిణిలో ఏలాంటి అక్రమాలు జరిగిన చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ పార్థసారధి అధికారులను, వ్యాపారులను హెచ్చరించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో అధికారులు, రైస్‌మిల్లర్లు, వివిధ శాఖల అధికారులతో కమిషనర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి నుంచి సన్న బియ్యం పంపిణిని అమలు చేస్తామని, దీనికి అయా శాఖలు ఇండెంట్‌ తయారు చేసి నిబంధనాల మేరకు ప్రభుత్వానికి నివేదికలు పంపించాలన్నారు. సూపర్‌ రైస్‌ సరఫరాలో ఏలాంటి అక్రమాలు జరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ మాట్లాడుతూ వసతి గృహాలకు 520 మెట్రిక్‌ టన్నులు, మూడు నెలలకు సరిపడ మద్యాహ్న బోజనం కోరకు 1952 మెట్రిక్‌ టన్నులు అవసరం ఉందన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రత కార్డుల కోసం 7031 లక్షల కార్డులకు ధరఖాస్తులు వచ్చాయని, వీటిలో 4.90 లక్షల కార్డులకు అర్హులను ఎంపిక చేసామన్నారు. త్వరంలో అర్హులందరిని ఎంపిక చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీఎస్‌వో కొండల్‌రావు, సివిల్‌ సప్లయ్‌ డీఎం దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆఫీసుకు పబ్లిక్‌ రావటాన్ని తగ్గించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ ...

Comment on the article