Breaking News

సిఐడి వేట షురూ… కేసుల నమోదు…, అరెస్టులే తరువాయి ఏ1గా కృష్ణారెడ్డి

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 18;

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణం ఇప్పుడు అక్రమార్కులకు వణుకు పుట్టిస్తుంది. విచారణ పూర్తి చేసిన సిబిసిఐడి వేట మొదలు పెట్టింది. అక్రమార్కులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తుంది. ముందస్తుగా కాంట్రాక్టర్‌ కృష్టారెడ్డిని ఎ-1 నిందితుడి కేసు నమోదు చేసి ఇందులో ముగ్గురు ఉద్యోగులు పేర్లు పెట్టింది. ఇప్పటికే వీరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బాగోతం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఇప్పటికే 3 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఇప్పటికే ఇద్దరిని రిమాండ్‌కు తరలించగా బుధవారం హౌసింగ్‌ డీఈ రాజేశ్వర్‌ను రిమాండ్‌కు తరలించారు.

తాజాగా ఈ కుంభకోణంలో కోటగిరి మండలానికి చెందిన ఇద్దరు విలేకరుల పాత్ర కుడా ఉందని తేల్చిన పోలీసులు వీరిపైనా కేసులు నమోదు చేశారు. అయితే మొత్తం పదమూడు మందిలో ఔట్‌ సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ షకీల్‌ నయీం, ఐకేపీ ఏరియా కో-ఆర్డినేటర్‌ విశ్వనాథం, డీఈ రాజేశ్వర్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా మిగిలిన పదిమంది పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కుంభకోణంలో ప్రదాన నిందితునిగా కాంగ్రెస్‌ పార్టీకీ చెందిన కృష్ణారెడ్డి పేరును పోలీసులు నమోదు చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిధులు కొక్కేసిన వైనంలో కృష్ణారెడ్డి కీలక నిందితుడు. ఈయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా వేట ప్రారంభించారు.

సొంతిల్లు ఉన్నా తన భార్య , తల్లి పేరు మీద ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి డబ్బులు కాజేశాడో విలేకరి.

మరో విలేకరి కృష్ణారెడ్డితో సమానంగా అన్నీ తానై ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నాడు. వీరిద్దరిపైనా కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్టుకు రంగం సిద్దం చేసారు. ఏఈ రాజన్నతో పాటు ఎంపీడీవోలు, విలేకరులు, ఇంకా మిగిలిన వారు పరారీలో ఉన్నారు.

పక్కగా కేసులు…

ఇప్పటికే ఏ-1 నిందితుడిగా ఉన్న కృష్ణారెడ్డి బెయిల్‌ కోసం హైకోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.మిగిలిన నిందితుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండనుంది.పలు సెకన్ల నమోదుతో పాటు ఐపీసీ 120 బీ(కుట్ర కేసు)ను పెట్టారు..

నిందితులు వీరే…..

ఈ కేసులో కృష్ణారెడ్డి ప్రదాన పాత్ర కాగా మిగిలిన వారు వంతపాడారు. ఏ-2 సీతామాలక్మీ భర్త సుబ్బారావు, గ్రామసంఘం అధ్యకురాలు, ఏ-3 చిన్నక్క భర్త నాగిరెడ్డి మహిళా సంఘం కార్యదర్శి, సీతామాలక్ష్మి ఈమె ఇద్దరు చెక్కులపై సంతకాలు చేసేశారు ఏ-4 కళ్యాణి భర్త కృష్ణారెడ్డి ఈమె గ్రామ సర్పంచి, ఎ-1 కృష్ణారెడ్డి భార్య. ఏ-5 రిటైర్డ్‌ ఎంపీడివో సాయన్న, ఏ-6 నగేశ్‌ ఎంపీడీవో, ఏ-7 హౌసింగ్‌ డీఈ రాజేశ్వర్‌, ఏ-8 రాజన్న ఏఈ, ఏ-9 గోపాలకృష్ణ(ఔట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌), ఎ-10 షకీల్‌ నయీం(ఔట్‌ సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌), ఏ-11 కే విశ్వనాథ్‌(ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్‌), ఏ-12 హన్మాండ్లు ఆంద్రజ్యోతి కోటగిరి విలేకరి, ఏ-13 పుప్పాల సాయిలు, కోటగిరి ఈనాడు విలేకరిలపై కేసులు నమోదు అయ్యాయి. మిగిలిన వారిపై విచారణ కొనసాగుతుంది.

Check Also

ప్రతి కార్యకర్త ఇంటిపై బిజెపి జెండా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఇందూర్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌ లో ధన్‌పాల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *