Breaking News

వైద్య కళాశాలకు మరో 50 సీట్లు… ప్రతిపాదనలు కోరిన డీఎంఈ

ఎంసీఐకీ నివేదిక

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 18;

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అదనంగా మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు రానున్నాయి. దీనికి సంబందించి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులకు నివేదికలను స్థానిక అధికారులు పంపించారు. ఈ నివేదికలపై ఎంసిఐ అధికారులు సానుకూలంగా స్పందించారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి అదనంగా 50 ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అధికారులు డీఎంఈకి ప్రతిపాదనలు పంపించారు.

ఇటీవలే మెడికల్‌ కళాశాలలో ఎంసీఐ బృందం మూడవ సంవత్సరం అనుమతి కోసం పరిశీలన చేసట్టింది. అనంతరం పరిశీలనముగిసీన మూడు రోజుల తరువాత డీఎంఈ అధికారులు అదనపు సీట్ల కోసం ప్రతిపాదనలు సూచించారు.

పరిశీలన అనంతరం అదనపు 50 సీట్లకు ఎంసిఐ ఇటివలే సానుకూలంగా స్పందించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలో 100 సీట్లు అదనంగా 50 సీట్లతో మొత్తం 150 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకే డీఎన్‌బీ (డీప్లోమా నేషనల్‌ బోర్డు) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి 15 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 150 సీట్లతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్వహణ జరిగే అవకాశం ఉంది.

మూడవ సంవత్సరానికి మార్గం సుముగం..

మెడికల్‌ కళాశాలలో మూడవ సంవత్పరం అనుమతికి మార్గం సుగమమైంది.

Check Also

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చట్టానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *