Breaking News

Daily Archives: December 22, 2014

చిలగడదుంప పరాఠా

కావలసినవి:  చిలగడదుంపలు – ఒక కప్పు (ఉడికించి, మెదిపి), గోధుమపిండి – రెండు కప్పులు,  నిమ్మరసం – ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు- రుచికి సరిపడా,  నూనె – వేగించడానికి సరిపడా. కారపు ముద్ద:  పచ్చిమిర్చి – నాలుగు,  అల్లం – చిన్న ముక్క,  కొత్తిమీర, పుదీనా – కొద్దిగా. పొడి మసాలా:  ధనియాలు- జీలకర్ర పొడి – రెండు టీస్పూన్లు,  ఆమ్‌చూర్ పొడి- ఒక టీస్పూన్,  గరం మసాలా – అర టీస్పూన్. తయారీ: గోధుమపిండిలో చిటికెడు ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి ...

Read More »

ప్ర‌జావాణి కి 12 ఫిర్యాదులు

ఆర్మూర్, డిసెంబ‌ర్22 : ప‌్ర‌తి సోమ‌వారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలొని త‌హ‌సిల్దార్ కార్యాల‌యంలో నిర్వ‌హించే ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం ఉప త‌హ‌సిల్దార్ స‌తీష్ కుమార్ ఆద్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ సోమ‌వారం ప్ర‌జావాణి కార్య‌క్ర‌మానికి 12 ఫిర్యాదులు అందిన‌ట్లు ఆర్మూర్ ఉప త‌హ‌సిల్దార్ స‌తీష్ కుమార్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆర్మూర్ ఎంపీడిఓ ప్ర‌వీణ్ కుమార్, ఇత‌ర అధికారులు హాజ‌రైయ్యారు.    

Read More »

అంతా మా ఇష్టం….ఇష్టారాజ్యంగా విఆర్ఓల విదులు

అంతా మా ఇష్టం…. – ఇష్టారాజ్యంగా విఆర్ఓల విదులు – ప‌ట్టంచుకోని ఉన్నాతా అదికారులు -12 గంట‌లైనా లెర‌ని విఆర్ఓ త‌లుపులు – ఇబ్బందుల‌లో ప్ర‌జ‌లు ఆర్మూర్, డిసెంబ‌ర్22 : మ‌ద్యాహ్నం 12 గంట‌లైన మ‌న అదికారుల‌కు తెలియ‌డం లేదు. పోనీ అదికారుల‌కే నా అంటే అటేండ‌ర్లు సైతం కార్యాల‌య త‌లుపులు తెర‌వ‌డం లేదు. ఇది ఎక్క‌డో అనుకుంటున్నారా. ఇది మ‌న ఆర్మూర్ ప‌ట్టణంలోని త‌హ‌సిల్దార్ వారి కార్యాలయ ఆవ‌ర‌ణ లో గ‌ల ఆర్మూర్ వీఆర్ఓ సార్ గారి గ‌ది. మ‌ద్యాహ్నం 12 గంట‌లైన ...

Read More »

ప్ర‌జ‌ల కోసం ప‌రిపాల‌న సాగించాలి ప‌ద‌వుల కోసం కాదు – అరికెల న‌ర్సారెడ్డి

ఆర్మూర్, డిసెంబ‌ర్22 : అర‌చేతిలో స్వ‌ర్గం చూయిస్తాం అనుకుంటే న‌మ్మేవారెవ‌రూ లేర‌ని, టిఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జ‌ల కోసం కాకుండా ప‌ద‌వుల కోస‌మే ప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని ఎమ్మెల్సీ అరికెల న‌ర్సా రెడ్డి విమ‌ర్శించారు. ఆదివారం ప‌ట్ట‌ణంలోని రోడ్డు భ‌వ‌నాల అథితీ గృహంలో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రైతంగానికి క‌రెంటు అందించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని అన్నారు. తెరాస అదికారంలో కి వ‌స్తే త‌మ క‌ష్టాలు తీరుతాయ‌ని ఆశించిన ప్ర‌జ‌ల‌కు నిరాశే మిగిలింద‌ని అన్నారు. ఖ‌రీఫ్ పంట స‌మ‌యంలో రైతాంగానికి విద్యుత్ స‌ర‌ఫ‌రా ...

Read More »

అర్హులైన అంద‌రికీ పించ‌న్ లు అందిచాలి

ఆర్మూర్, డిసెంబ‌ర్22: అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ పించ‌న్ లు అందించాల‌ని డిమాండ్ చేస్తూ బిజేపి, సిఐటియు ఆద్వ‌ర్యంలో అర్హులైన వృద్ద, విక‌లాంగ, వితంతువులు సోమ‌వారం ప‌ట్ట‌ణంలోని త‌హ‌సిల్దార్ కార్యాల‌యం ఎదుట ద‌ర్నా నిర్వ‌హించి డిప్యూటి త‌హ‌సిల్దార్ స‌తీష్ కుమార్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా బిజేపి, సిఐటియు నాయ‌కులు పూజా న‌రెంద‌ర్, కుతాడి ఎల్ల‌య్య‌ మాట్లాడుతూ ప్ర‌భుత్వం అర్హులైన వారంద‌రికీ పించ‌న్ లు అందించ‌డంలో విఫ‌ల‌మైంద‌న్నారు. పించ‌న్ లు రావ‌డం లేద‌ని అర్హులైన వారు అదికారుల చుట్టు తిరిగిన వారు ప‌ట్టాంచుకోవ‌డం ...

Read More »

విశ్వక‌ర్మ ఉద్యోగుల సంఘం భ‌వ‌నానికి స్థ‌లం కేటాయిస్తా – ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి

ఆర్మూర్, డిసెంబ‌ర్22 : ఆర్మూర్ స‌బ్ డివిజ‌న్ ప్రాంతంలో విధులు నిర్వ‌ర్తిస్తున్న విశ్వ‌బ్రాహ్మ‌ణ ఉద్యోగుల సంక్షేమ సంఘం భ‌వ‌న నిర్మాణానికి స్థ‌లం కేటాయిస్తాన‌ని నిధులు మంజూరు చేయిస్తాన‌ని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి అన్నారు. ఆదివారం పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్ లో విశ్వ‌క‌ర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆద్వ‌ర్యంలో ముద్రించిన 2015 క్యాలెండ‌ర్ ను ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఆర్ఓ మ‌నోహ‌ర్ చారి, డీఈఓ శ్రీనివాస చారి, డిప్యూటి డిఈఓ పోచాద్రి, విశ్వ‌క‌ర్మ సంఘం రాష్ట్ర నాయ‌కుడు డీఎస్ చారి, వివా రాష్ట్ర ...

Read More »

క్రైస్త‌వులకు అండ‌గా ఉంటా… ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి

ఆర్మూర్, డిసెంబ‌ర్22 : ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో క్రైస్త‌వుల అభివృద్దికి కృషి చేస్తూ ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటాన‌ని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని సీఎస్ఐ చ‌ర్చిలో చెవిటి, మూగ ఆశ్ర‌మ పాఠ‌శాల విద్యార్థుల‌కు దుస్తుల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ గ‌త పాల‌కులు క్రైస్త‌వుల సంక్షేమాన్ని విస్మ‌రించార‌ని నిందించారు. క్రైస్త‌వుల అభివృద్ది కి సిఎం కేసీఆర్ కృత‌నిశ్చ‌యంతో ఉన్నార‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరు నెల‌ల్లోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తికి స‌ముచిత ప్రాదాన్యం యిస్తున్నార‌న్నారు. ...

Read More »

పించ‌న్ ద‌ర‌ఖాస్తుల‌కై ప్ర‌త్యేక కౌంట‌ర్లు ఏర్పాటు

  ఆర్మూర్, డిసెంబ‌ర్19 : ఆర్మూర్ మండ‌లంలొని పించ‌న్ దారుల అవ‌స్త‌ల‌ను గుర్తించి వారికి వారికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా వారి కోసం ద‌ర‌కాస్తులు చేసుకునేందుకై వారి కోసం ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌ను ఏర్సాటు చేసిన‌ట్లు ఆర్మూర్ ఎంపీడివో ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు.

Read More »

ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం

జిల్లా ఎస్పీ చంద్ర‌శేఖ‌ర్ ఆర్మూర్, డిసెంబ‌ర్19 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలో వాహ‌నాల ర‌ద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ ఎస్సైని నియ‌మిస్తామ‌ని జిల్లా ఎస్పి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని స‌బ్ డివిజ‌న‌ల్ పోలీస్ కార్యాల‌యాన్ని ఎస్పీ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. వార్షిక త‌నిఖీ లో బాగంగా డిఎస్పీ కార్యాల‌యంలో రికార్డుల‌ను ఎస్పీ ప‌రిశీలించారు. కేసుల న‌మోదు, ప‌రిష్కారం విష‌య‌మై డిఎస్పి ఆకుల రాంరెడ్డిని ఆరా తీశారు. డిఎస్పీ కార్యాల‌యం ప‌రిధిలో సిబ్బంది వివ‌రాల‌ను ప‌రిశీలించారు. చోరీల నియంత్ర‌ణ కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆరా ...

Read More »

స‌మ‌స్య‌ల పై పోరాడుతా -ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి

ఆర్మూర్, డిసెంబ‌ర్19 : అంగ‌వైక‌ల్యంతో భాధ ప‌డుతున్న పిల్ల‌ల‌కు విద్యా బుద్దులు నేర్పించ‌డం అభినంద‌నీయ‌మంటూ పిల్ల‌ల స‌మ‌స్య‌లు త‌న స‌మ‌స్య‌లుగా భావించి వాటిని త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రిస్తాన‌ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్న గారి జీవ‌న్ రెడ్డి హామా ఇచ్చారు. ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని టీచ‌ర్స్ కాలొనీలో గ‌ల సీఎస్ఐ చెవిటి, మూగ ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో పాఠ‌శాల ప్ర‌దానోపాద్యాయుడు సూర్య‌ప్ర‌కాశ్ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి ముఖ్య అథితిగా ప్ర‌సంగించారు. ఎమ్మెల్యే విద్యార్థుల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తుండ‌గా స్పెష‌ల్ టీచ‌ర్ సుధా సైన్స్ లాంగ్వేజ్ లో విద్యార్థుల‌కు ...

Read More »

స‌మ‌స్య‌ల పై పోరాడుతా -ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి

  ఆర్మూర్, డిసెంబ‌ర్19 : అంగ‌వైక‌ల్యంతో భాధ ప‌డుతున్న పిల్ల‌ల‌కు విద్యా బుద్దులు నేర్పించ‌డం అభినంద‌నీయ‌మంటూ పిల్ల‌ల స‌మ‌స్య‌లు త‌న స‌మ‌స్య‌లుగా భావించి వాటిని త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రిస్తాన‌ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్న గారి జీవ‌న్ రెడ్డి హామా ఇచ్చారు. ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని టీచ‌ర్స్ కాలొనీలో గ‌ల సీఎస్ఐ చెవిటి, మూగ ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో పాఠ‌శాల ప్ర‌దానోపాద్యాయుడు సూర్య‌ప్ర‌కాశ్ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి ముఖ్య అథితిగా ప్ర‌సంగించారు. ఎమ్మెల్యే విద్యార్థుల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తుండ‌గా స్పెష‌ల్ టీచ‌ర్ సుధా సైన్స్ లాంగ్వేజ్ లో ...

Read More »

రామనుజ అడుగు జాడల్లో నడవాలి… కెర్‌ కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 22; ప్రతి విద్యార్థి గణిత శాస్త్ర పితమహుడు శ్రీనివాస రామనుజ అడుగు జాడల్లో నడవాలని కేర్‌ కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ అన్నారు. సోమవారం కళాశాలలో రామనజ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ భారత దేశాన్ని గణిత శాస్త్రంలో ప్రపంచానికి పరియం చేసిన ఘనత రామనుజనుదేనని అన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని నడుపుతుంది గణితమేనని, అందుకు శ్రీనివాస రామనుజ జన్మదినాన్ని గణిత శాస్త్రం దినోత్సవంగా నిర్వహించి, అంతటి ...

Read More »

చారిత్రక ఘనత వహించిన నాటి ఇంద్రపురి వైభవం

నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ   కామారెడ్డి: బోధన్‌ ఒకప్పటి భారత గాథలో బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేసే ఏకచక్రపురంగా ద్వాపార యుగం నుంచి వీటి ఆనవాళ్లు కలిగి వుంది. చోళులు, బాదామి చాళుక్యులు పాలనల ద్వారా శ్రావణ బెళగోలలో నెలకొల్పిన బాహుబలిని పోలిన విగ్రహం బోధన్‌లో వెలుగులోకి వచ్చి ఈ చారిత్రక నేపథ్యాన్ని జైన తీర్థాంకరుల స్థావరంగా పేర్కొనదగినది. నవనాథ గురువుల ఆనవాళ్లతో ఆర్మూర్‌ ప్రాంతం సైతం జైన మత వ్యాప్తిలో పేరుగాంచినది. పైఠానపురం బోధన్‌గా మార్పు చెంది వేల ఏళ్ల ...

Read More »

పుష్కర ఘాట్‌ను సందర్శించిన బోధన్‌ ఆర్డీఓ

బోధన్‌, డిసెంబర్‌ 22 కందకుర్తి త్రివేణి సంగమం పుష్కరఘాట్‌ను సోమవారం బోధన్‌ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్‌ సందర్శించారు. వచ్చే సంవత్సరం జూలైలో జరగబోయే పుష్కరాల కోసం వచ్చే భక్తులకు చేపట్టవలసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పుష్కరఘాట్‌వద్ద భక్తులకు అవసరమైన గదులు, కాలినడకన వచ్చే వారికి సౌకర్యంగా రోడ్డు నిర్మాణపనులు సత్వరం పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల సమయం సమీపిస్తుండడంతో భక్తులకు అన్ని వసతి సౌకర్యాలు, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయనతోపాటు రెంజల్‌ ఎంపిడిఓ మోబిల్‌ఖాన్‌ , సర్పంచు ఖలీంబేగ్‌ ఉన్నారు. ...

Read More »

భీమా అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 22; పంటల బీమా పథకంలో రుణం పొందిన రైతులు రబీ 2014- 15 సీజన్‌లో ప్రపొజల్స్‌తో సహాప్రీమియం చెల్లింపునకు తుది గడువు ఈనెల 31లోగా చెల్లించాలని సంయుక్త వ్యవసాయ సంచాలకులు నర్సింహా తెలిపారు. జిల్లా రైతులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆయన సూచించారు. బ్యాంకు నుండి రుణం పొందు రైతులు ప్రీమియంను బ్యాంకులోనే చెల్లించాలని, రుణం పొందని రైతులు ఐశ్చికంగా వారివారి పరిధిలోని ఏదేని బాంకులో అకౌంట్‌ తెరిచి ప్రపోజల్‌ ఫారంతో సహ సాగు చేయబడిన పంటలు, వాటి ...

Read More »

పుష్కరాల ఏర్పాట్లు ఘనంగా ఉండాలి… సీఎస్‌ రాజీవ్‌శర్మ

నిజామాబాద్‌, డిసెంబరు 22; రాబోయే గోదావరి పుష్కరాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లాయంత్రాంగం తరఫున అవసరమయ్యే ఏర్పాట్లన్నీ సత్వరం పూర్తిచేయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లాకలెక్టర్‌కు సూచించారు. సోమవారం సచివాలయం నుంచి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ ,ఖమ్మం జిల్లాలలోని కలెక్టర్లతో అధికారులతోవీడియో కాన్ఫరెన్సు ద్వార ఆయా జిల్లాల్లో గోదావరి పుష్కరాల కోసం అధికారులు రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్లతోసమీక్షించారు. పుష్కరాల సందర్భంగా అతి ముఖ్యమైన వ్యక్తులు హాజరవుతారని, వారికి ఇబ్బంది కలగకుండా విడిది కోసం అవసరమైన రోడ్లు, ...

Read More »

గ్రామ స్వశక్తీకరణ పురస్కార్‌

నిజామాబాద్‌, డిసెంబరు 22; కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేసేందుకు గ్రామ స్వశక్తీకరణ పురస్కార్‌ అవార్డును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ది, అభివృద్ది పనుల కోసం నిధులను కేటాయించనుంది. పంచాయతీలను అన్ని విధాలా అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో పంచాయతీ స్వశక్తికరణ పురస్కార్‌ (పీఎస్‌పీ)ను ఇవ్వనుంది. దీనికి గాను ఉత్తమ పంచాయతీలను ఎన్నిక చేసిందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రతిపాదనలు సిద్దం… నిజామాబాద్‌ జిల్లాలో 718 పంచాయతీలు ఉన్నాయి. వీటీలో మెజారిటీ గ్రామాలు అభివృద్దికి దూరంగా ...

Read More »

నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాస్తారోకో రోడ్డె ఎక్కిన విద్యార్థినిలు

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబర్‌ 22; నిజామాబాద్‌ నగరంలో మూడు రోజుల వినాయక్‌నగర్‌కు చెందిన వివాహిత సరిత హత్యకు కారకులైన ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మహిళా కళాశాలకు చెందిన ఉమెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళల పట్ల రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యలు ఆందోళనకలిగిస్తున్నాయని, అంతేగాక పట్టణాలు, నగరాలనే తేడాలేకుండా ఈవ్‌ టీజింగ్‌ పెరిగిపోయిందని, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినీలు,బాలికలకు సైతం భద్రత లేకుండాపోయిందని ...

Read More »

అదిగో చిరుత… ఇదిగో జాడ వృద్ధి చెందుతున్న సంతతి

బాన్సువాడ, డిసెంబర్‌,22 . అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు కాదు ఇది నిఖార్సయిన నిజం. కాకతీయుల కాలం నాటీ కౌలాస్‌ కోటలో చిరుతలు సంచరిస్తున్న ఆనవాళ్ళు స్పష్టమవుతున్నాయి. జిల్లా తోపాటు పోరుగునే ఉన్న మహరాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుంచి వలసవచ్చిన వాటిలో ఈ ప్రాంతంలో చిరుతల సంచారం పెరిగింది. బోధన్‌, కామారెడ్డి డివిజన్‌ల అటవీ క్షేత్రాల పరిధిలో దశాబ్దకాలంగా చిరుతల సంతతి వృద్ది చేందుతోంది. దట్టమైన అడవులు విస్తరించి ఉండటంతో పాటు జీవనీనికి అనువుగా మారుతోంది పోరుగునా మహరాష్ట్ర, కార్ణటక ప్రాంతాలు మొదలు ...

Read More »

23 నుంచి రాష్ట్రస్థాయి థంగ్‌సుడో కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలు

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 22; స్కూల్‌గేమ్‌ ఫెడరేషన్‌ అండర్‌-14,17,19 విభాగంలో రాష్ట్రస్థాయి తంగ్‌సుడో క్రీడాలు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరగనున్నాయి. డీఎస్‌ఏ స్టేడియంలోని నిర్వహిస్తామన్నారు. జూనియర్‌ కళాశాలల నిర్వహణ కార్యదర్శి డి.సాయిలు,పాఠశాలల నిర్వహణ కార్యదర్శి జీవీ భూమారెడ్డి పర్యవేక్షణలో రెండు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తారు. ఈ మేరకు అ క్రీడ సంఘ అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్‌ సావన్‌ఆలా, పంపరి ప్రవీణ్‌కుమార్‌లు తెలిపారు. 23న జిల్లాస్థాయి బాలబికలకు పోటీలు…. 23న మొదటి రోజు జిల్లాస్థాయి బాలబాలికలకు పోటీలు, 24న రాష్ట్రస్థాయి జూనియర్‌ కళాశాలలు, పాఠశాలల విధ్యార్థులకు ...

Read More »