Breaking News

గ్రామ స్వశక్తీకరణ పురస్కార్‌

నిజామాబాద్‌, డిసెంబరు 22;

కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేసేందుకు గ్రామ స్వశక్తీకరణ పురస్కార్‌ అవార్డును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ది, అభివృద్ది పనుల కోసం నిధులను కేటాయించనుంది. పంచాయతీలను అన్ని విధాలా అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో పంచాయతీ స్వశక్తికరణ పురస్కార్‌ (పీఎస్‌పీ)ను ఇవ్వనుంది. దీనికి గాను ఉత్తమ పంచాయతీలను ఎన్నిక చేసిందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

ప్రతిపాదనలు సిద్దం…

నిజామాబాద్‌ జిల్లాలో 718 పంచాయతీలు ఉన్నాయి. వీటీలో మెజారిటీ గ్రామాలు అభివృద్దికి దూరంగా ఉన్నాయి. ప్రభుత్వ నిధుల లేమితో అభివృద్దికి నోచుకోవడం లేదు. దీనికి తోడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నిర్వహకం కొంత తోడవుతుంది. నిధులు లేక కొన్ని గ్రామాలు, నిధులు ఉన్న ఖర్చు చేయ్యలేక మరి కొన్ని గ్రామాలు అభివృద్దికి దూరంగా ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు నిధుల విడుదల చేస్తున్నా వాటీని సక్రమంగా వినియోగించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ పంచాయతీలను తీసుకువచ్చి పారదర్శకతను పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను తయారు చేసింది. ఇందులో భాగంగానే స్వశక్తీకరణ పురష్కార్‌ను ప్రకటించింది. ఈ పథకం ద్వారా పంచాయతీలను బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఆర్హతలు ఇవే…

పంచాయతీ స్వశక్తీరణ పురస్కార్‌ కింద ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎంపిక కావడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనాలను ప్రకటించింది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఖర్చు. జమ వివరాలు పోందపర్చాలి. మరుగుదోడ్ల నిర్మాణం చేపట్టాలి. నీటీ సౌకర్యం సక్రమంగా ఉండాలి. పారిశుద్ద్యం మెరుగుపడాలి. మౌలిక వసతులు కల్పన వైపు పంచాయతీలు పయనించాలి. నిర్దేశించిన తేదీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయలి. ఇవన్ని ఉంటేనే ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక అవుతాయి.

ముందజలో 40 పంచాయతీలు…

జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు ఉండగా 40 పంచాయతీలు పురస్కార్‌ కేంద పోటీ పడుతున్నాయి. మూడు డివిజన్‌లలో అధికారులు డివిజన్ల వారిగా జాబితాతను తయారు చేసారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా సుమారు 40 గ్రామాలను ఎంపిక చేయనున్నారు. వీటి జాబితాపై జిల్లా అధికార యంత్రాంగం ఇంక కసరత్తు చేస్తుంది. చివరకు ఏన్ని పంచాయతీలను ఎంపిక చేసి పంపిస్తారనేది తెలియదు.

ప్రతిపాదనలు సిద్దం…

పంచాయతీ స్వశక్తికరణ పురస్కార్‌ కింద నిజామాబాద్‌ డివిజన్‌లో 10 పంచాయతీలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపాం. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వాటికే ప్రాధన్యత ఇచ్చాం. వచ్చే నిధులతో గ్రామాలు బలోపేతం అవుతాయి. ప్రతిపాదనలు పంపించిన వాటిలో ఎన్ని ఎంపిక అవుతాయో తెలియదు.

Check Also

పోలింగ్‌ పర్సెంట్‌ @1 పిఎం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి నిజామాబాద్‌ పార్లమెంటరీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *