మాసఫలం December 2014

మాసఫలం December 2014

మేషం


ఈ మాసం ప్రధమార్థం అంత అనుకూలం కాదు. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. దుబారా ఖర్చులు అధికం. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. అవకాశాలు కలిసిరాక, యత్నాలు ఫలించక నిరుత్సాహం చెందుతారు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. బంధుమిత్రులతో కలహాలు, అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు కలిసి రాగలదు. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వేడుకల్లో మితంగా వ్యవహరించాలి. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి.

వృషభం

ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. హామీలు, పెద్ద మొత్తం ధన సహాయం తగదు. ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. ఆర్థికస్థితి ఫర్వాలేదనిపిస్తంది. ఖర్చులు పెరిగినా ధనానికి ఇబ్బంది ఇండదు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. శుభకార్యాల్లో ఆత్మీయులకు విలువైన కానుకలు చదివించుకుంటారు. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోవాలి. తీర్ధయాత్రకు సన్నాహాలు సాగిస్తారు.

మిథునం

ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. రుణయత్నం ఫలిస్తుంది. ఎవరికీ హామీలివ్వవద్దు. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటు తగదు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. ప్రయత్న పూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. సంతానం విద్య, ఉద్యోగ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, ఒత్తిడి, పనిభారం అధికం. అధికారులకు హోదా మార్పు, స్థాన చలనం సంభవం, వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమావేశాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

ఈ మాసం శుభదాయకమే. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో చికాకులు సర్దుకుంటాయి. ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. వివాదాలు కొలిక్కి వస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ అతిధి మర్యాదలు అందరినీ సంతృప్తిపరుస్తాయి. నూతన దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉమ్మడి వెంచర్లు, టెండర్లకు అనుకూలం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి.

సింహం

ఈ మాసం అన్ని రంగాల వారికి కలసిరాగలదు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. విలువైన వస్తువులు, వాహనం కొనుగోలు చేస్తారు. కీల విషయాలపై పట్టు సాధిస్తారు. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో లక్ష్యం తగదు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. షాపుల స్థల మార్పు సత్ఫలితాలిస్తుంది. పెద్ద సంస్థల్లో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఆశాజనకం. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు కలసిరాగలదు. ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.

కన్య

ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. రావలసిన ధనం అందుతుంది. శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆందోళన కలిగించిన సమస్య తేలికగా పరిష్కారమవుతుంది. గృహ నిర్మాణం, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. కొనుగోలుదార్లతో జాగ్రత్త, హామీలు, మధ్యవర్తిత్వాలు, పెద్ద మొత్తం ధన సహాయం క్షేమం కాదు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, ఒత్తిడి అధికం. వాహన చోదకులకు దూకుడు తగదు.

తుల

ఈ మాసం అన్ని రంగాల వారికీ అనుకూలమే. వ్యవహార ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య కొలిక్కి వస్తుంది. ఉన్నత పదువులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. శుభకార్యాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. మీ మాట తీరు, పద్ధతులు అందరినీ ఆకట్టుకుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల ప్రశంసలందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. తీర్థయాత్రకు సన్నాహాలు సాగిస్తారు.

వృశ్చికం

సంతానం భవిష్యత్తుకు పథకాలు రూపొందిస్తారు. ప్రముఖుల సిఫార్సుతో పనులు సానుకూలమవుతాయి. శుభకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు కొలిక్కివస్తాయి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయ పాలన ప్రధానం. అధికారులు ధన ప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం.

ధనస్సు

ఈ మాసం ప్రతికూలతలే అధికం. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అయిన వారే మీ నిజాయితీని శంకించే ఆస్కారం ఉంది. రాబోయే ఖర్చులు ధనం సర్దుబాటు చేసుకుంటారు. పెద్ద మొత్తం ధనం డ్రా చేసేటపుడు జాగ్రత్త. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది. మీ పథకాలు, ప్రణాళికలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారుల తీరు ఆందోళన కలిగిస్తుంది. మీ పథకాలు, ప్రణాళికలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. అధికారులకు అదనపు హోదా మార్పు, స్థాన చలనం సంభవం. ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. వేడుకలు, దైవ, శుభ కార్యాల్లో పాల్గొంటారు.

మకరం

ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆరోగ్యం సంతృప్తికరం. అవివాహతుల్లో ఉత్సాహం నెలకొంటుంది. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. షాపుల స్థల మార్పు మంచి ఫలితాన్నిస్తుంది. భాగస్వామిక సమావేశాలు అర్ధాంతంగా ముగుస్తాయి. వస్త్ర, ఫ్యాన్సీ, ఆల్కహాలు, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, విశ్రాంతి లభిస్తాయి. ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. స్థిరాస్తి కొనుగోలులో జాగ్రత్త వహించండి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
కుంభం
పొదుపు పథకాలు, నూతన పెట్టుబడులు లాభిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఆకర్షణీయమైన పథకాలతో వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవహార ఒప్పందాల్లో మీదే పైచేయి. మీ సమర్థకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. దైవ దర్శనంలో ఇబ్బందులెదురవుతాయి.
  మీనం
ఈ మాసం అన్ని రంగాల వారికి శుభదాయకమే. స్థిరాస్తి కొనుగోలు యత్నం కొలిక్కి వస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రుపొందించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఆరోగ్య సంతృప్తి, మానసిక ప్రశాంతత పొందుతారు. శుభకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో ఆటంకాలు, పోటీని ధీటుగా ఎదుర్కుంటారు. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలిసి రాగలదు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రభుత్వ కార్యాలయాలల్లో పనులు సానుకూలమవుతాయి. విలువైన వస్తువులు, పత్రాలు, జాగ్రత్త. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.
The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

ఘనంగా రేణుకామాత ఆలయ వార్షికోత్సవం

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రేణుకాంబ ఆలయంలో ఆదివారం నుంచి ...

Comment on the article