Breaking News

అంద‌కారంలో ఆర్మూర్ మున్సిప‌ల్…. సుమారు కోటి ర‌పాయ‌ల బ‌కాయిలు… విద్యుత్ ను నిలిపివేసిన విద్యుత్ అదికారులు… తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌లు

ఆర్మూర్, డిసెంబ‌ర్23 :    విద్యుత్ బిల్లు ను చెల్లించ‌క‌పోవ‌డంతో ఆర్మూర్ మున్సిప‌ల్ కార్యాల‌యానికి విద్యుత్ అధికారులు విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో ఆర్మూర్ మున్సిప‌ల్ కార్యాల‌యం అంద‌కారంలోకి వెళ్లిపోయింది. సుమారు కోటి రూపాయ‌ల విద్యుత్ బ‌కాయిలు చెల్లించాల్సి ఉండ‌గా మున్సిప‌ల్ పాల‌క‌వ‌ర్గం మాత్రం విద్యుత్ బ‌కాయిల‌ను చెల్లించ‌క‌పోవ‌డంతో విద్యుత్ అదికారులు విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో మున్సిప‌ల్ కార్యాల‌య సిబ్బంది చీక‌ట్లోనే విదులు నిర్వ‌హిస్తున్నారు. దీనికితోడు మున్సిప‌ల్ కార్యాల‌య ఆవ‌ర‌ణ లో ఉన్న మీసేవ లో సైతం విద్యుత్ ను నిలిపివేయ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. నిత్యం బారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు మున్సిప‌ల్ కార్యాల‌య ఆవ‌ర‌ణ లో గ‌ల మీసేవ కేంద్రానికి చేరుకొని వారి వారి విద్యుత్, ఇంటిప‌న్ను, త‌దీత‌ర  బ‌కాయిల‌ను చెల్లించుకుంటారు. కానీ విద్యుత్ అధికారులు విద్యుత్ ను నిలిపివేయ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతూ అక్క‌డి నుండి వెనుదిరుగుతున్నారు. ఆర్ముర్ మున్సిప‌ల్ కు నెల‌కు సుమారు రూ.13 ల‌క్ష‌ల వ‌ర‌కు విద్యుత్ చార్జి వ‌స్తుంద‌ని కానీ  మున్సిప‌ల్ అదికారులు నెల‌కు సుమారు రూ. 2 నుండి 3 ల‌క్ష‌లు చెల్లించ‌డంతో పెద్ద మొత్తంలో డ‌బ్బు బాకీ పడ్డార‌ని విద్యుత్ అదికారులు చెబుతున్నారు. ఇప్ప‌టికైన ప్ర‌జ‌లు, అదికారుల క‌ష్టాల‌ను గ్ర‌హించి ఉన్న‌తాదికారులు, ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు తీసుకొని ఆర్మూర్ మున్సిప‌ల్ కు విద్యుత్ అంత‌రాయం లేఏకుండా చూడాల‌ని ప్ర‌జ‌లు కోఉతున్నారు.

Check Also

ఎమ్మెల్యేకు సన్మానం

  ఆర్మూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని మానస పాఠశాలలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *