Breaking News

మాన‌వ సేవ‌యే మాద‌వ సేవ‌

ఆర్మూర్, డిసెంబ‌ర్24 : స‌మాజ సేవ‌లో పాల్గొంటూ పేద‌ల‌కు అండ‌గా నిలుస్తూ మాన‌వ సేవ చేయ‌డ‌మే మాద‌వ సేవ అని ఆర్మూర్ డిపో మేనేజ‌ర్ ఇచ్చ‌గిరి రాజ‌మౌళి అన్నారు.  ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని ఆర్టీసీ బ‌స్టాండ్ ప్రాంగ‌ణంలో సెమి క్రిస్మ‌స్ ను పుర‌స్క‌రించుకొని బెరాకా సొసైటీ ఆద్వ‌ర్యంలో పేద‌ల‌కు దుస్తుల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని సోమ‌వారం నిర్విహించారు. సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో డిపో మేనేజ‌ర్ ముఖ్య అథితి గా ప్ర‌సంగించారు.  పాస్ట‌ర్ న‌వ‌ర‌త్నం మాట్లాడుతూ ఏసు క్రీస్తు సందేశాన్ని వివ‌రించారు.  అనంత‌రం సెమి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో భాగంగా కేక్ క‌ట్ చేసి వేడుక‌లు జ‌రుపుకున్నారు.  కార్య‌క్ర‌మంలో బెరాకా సొసైటీ చైర్మ‌న్ యేసు, సొసైటీ స‌భ్యులు,  ఆర్టీసీ కార్మిక సంఘాల నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

ఆలూరులో పన్నుల వసూలు

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామ పంచాయతీలో పన్నుల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *