Breaking News

అర్హులంద‌రికీ పించ‌న్ లు అంద‌జేస్తాం

ఆర్మూర్, డిసెంబ‌ర్23 : అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ పించ‌న్ లు అంద‌జేస్తామ‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి జిల్లా అద్య‌క్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన  విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ తెరాస ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌త ప్ర‌భుత్వాలు కేవ‌లం రూ. 200 ల‌ను అంద‌జేస్తే తెరాస ప్ర‌భుత్వం ఆస‌రా ప‌థ‌కం కింద అర్హులైన వృద్ద‌, వితంతువుల‌కు రూ. 1000, విక‌లాంగుల‌కు రూ. 1500 ల‌ను అంద‌జేస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. దేశం లో ఏ రాష్ట్రంలో కూడ అందించ‌ని విదంగా పించ‌న్ ల‌ను అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌లు ఇత‌రుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి పించ‌న్ లు అంద‌జేస్తామ‌ని హామినిచ్చారు. అనంత‌రం ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గ తెరాస వ్య‌వ‌హారాల ఇంచార్జ్ ఆశ‌న్న‌గారి రాజేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ప్ర‌జ‌లు ఆస‌రా ప‌థ‌కంపై ద‌ళారులు, ఇత‌రులు చెప్పే అపోహ‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న తెలిపారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి పించ‌న్ లు అంద‌జేస్తామ‌న్నారు. ఆస‌రా ప‌థ‌కం పై ఇంకా ఏదైన వివ‌రాలు తెలుసుకోవాలంటే ద‌ళారుల‌ను ఆశ్ర‌యించ‌వ‌ద్ద‌ని , ఆర్మూర్ ఎమ్మెల్యే టోల్ ఫ్రీ నెంబ‌ర్ 18604252525 కు ఫోన్ చేసి సందేహాలు తీర్చుకొవాల‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో తెరాస నాయ‌కులు, కార్య‌కర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

వందశాతం వరి ధాన్యం కొనుగోలు చేయాల‌ని ముఖ్యమంత్రి నిర్ణయం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ధాన్యం కొనుగోలు ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *