Breaking News
తల్లికి పాదపూజ చేస్తున్న మంత్రి పోచారం

తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం

 

 

బాన్సువాడ, డిసెంబర్‌ 29-బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో సోమవారం తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం నిర్వహించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి,ఆయన సోదరుడు శంభురెడ్డితో కలిసి తల్లి పాపమ్మకు పాద సేవా చేసుకున్నారు.ప్రస్తుతం ఆమె వయస్సు 102 సంవత్సరాలుగా కుటుంబీకులు వెల్లడించారు.తల్లిదండ్రులను దైవసమానులుగా పూజించాలని ఈ సందర్భంగా వక్తలు ఉద్భోధించారు.అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పాటించి భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. మంత్రితో పాటు పలువురు ప్రముఖులు వారి తల్లిదండ్రులకు పాద సేవా నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో జీయర్‌స్వామి,సువర్ణభూమి డెవలాపర్స్‌ ఎగ్సిక్యూటివ్‌ డైరెక్టర్‌ మేక శ్రీనివాస్‌,అయ్యప్ప దీక్ష గురుస్వాములు గురువినయ్‌,నర్సన్నచారి,విఠల్‌ రెడ్డి,శంకర్‌,ధనగారి క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *