Breaking News

జోగినిలకు ఆసరా… సఫాయిల కార్మికుల వేతనాల పెంపు… పిడమర్తి రవి, ఛైర్మన్‌, రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్‌

నిజామాబాద్‌, డిసెంబరు 30;

రాష్ట్రంలో ఉన్న జోగినిలందరికి ఆసరా పథకం ద్వారా పెన్షన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని, అందుకు వారి సమస్యలను కెసిఆర్‌ దృష్టికి తీసుకువెళతానని, అలాగే గ్రామంలో పని చేసే సఫాయి కార్మికుల వేతనాలను పెంచేందుకు ప్రయత్నాలుచేస్తానని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన దళిత విద్యవంతుల వేదిక, సంసఘ వికాస స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో టిఎన్‌జివోస్‌ భవన్‌లో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో జోగిని వ్యవస్థ ఉండటం చాల దారుణమని, ఇది చూండుర్‌ సంఘటన కంటే విచారకరమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, ఇందుకు ప్రెరేపించిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి దళితుడు ఈ వ్యవస్థను లేకుండా చేయాలని అందుకు గ్రామాల్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహారించాలన్నారు. అలాగే విదవరాలులకు పెన్షన్లు ఇచ్చేందుకు భర్త మరణ దృవీకరణ పత్రం అధికారులు అడుగుతున్నారని, దీని కారణంగా జోగినిలకు పెన్షన్లు ఇవ్వడంలో ఇబ్బందులు తలేత్తుతున్నాయన్నారు. కాబట్టి ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రతి జోగినికి వేయి రూపాయాల పెన్షన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. అదే విధంగా జిల్లాతో పాటు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సఫాయి కార్మికులుగా దళితులే పని చేస్తున్నారని, కాని వీరికి సరైన వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ప్రతి కార్మికుడి రూ.3 వేలకు పైగా వేతనాలు వచ్చేలా సంబంధిత మంత్రి కెటిఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి కనీస వేతనాలు అమలు అయ్యేలా చూస్తానని సభ ముఖంగా హామీ ఇచ్చారు. కెసిఆర్‌ ప్రభుత్వం దళితులకు మూడు ఏకరాల భూమి ఇస్తుందని, దీనిని ఆర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలన్నారు. ఈ సదస్సులో సంఘవికాస స్వచ్చంధ సేవా సంస్థ ఛైర్మన్‌ రాజయ్య, దళిత విద్యవంతుల వేదిక అధ్యక్షులు సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎంపీ కవితను కలిసిన సర్పంచ్‌

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవితను శుక్రవారం దండి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *