Breaking News

Daily Archives: January 3, 2015

టిఎస్ఆర్టీసీ నూత‌న క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

ఆర్మూర్, జ‌న‌వ‌రి03 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వ‌ణా శాఖా య‌జ‌మాన్య సంఘం ఆద్వ‌ర్యంలో శ‌నివారం ప‌ట్ట‌ణంలోని ఆర్టీసీ బ‌స్ స్టాండ్ ప్రాంతం లోని నిరు పేద‌ల‌కు ఆర్మూర్ ఆర్టీసి డిపో మేనేజ‌ర్ చేతుల మీదుగా దుప్ప‌ట్ల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం 2015 నూత‌న సంవ‌త్స‌ర‌పు క్యాలెండ‌ర్ ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ స‌మాజ సేవ లో ఆర్టీసి సిబ్బంది, కార్మికులు ఎప్పుడూ ముందుంటార‌న్నారు. ఆర్టిసి ప్ర‌యాణ‌మే సుర‌క్షిత‌మైన ప్ర‌యాణ‌మ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు ఆర్టిసి బ‌స్సు లో ప్ర‌య‌ణం చేయాల‌ని కోరారు. ...

Read More »

ఫీజురియంబ‌ర్స్ మెంట్ బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి

ఆర్మూర్, జ‌న‌వ‌రి03 : పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబ‌ర్స్ మెంట్ బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ పిడిఎస్ యు ఆద్వ‌ర్యంలో శ‌నివారం ప‌ట్ట‌ణంలోని కుమారం నారాయ‌ణ భ‌వన్ నుండి అంబేద్క‌ర్ చౌర‌స్తా వ‌రకు ర్యాలి నిర్వ‌హించి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌ణం చేశారు. ఈసంద‌ర్బంగా పిడిఎస్ యు ఆర్మూర్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు సుమ‌న్ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యారంగాన్ని చిన్న చ‌పు చూస్తుంద‌ని అన్నారు. దీనికి నిద‌ర్శ‌న‌మే విద్యారంగానికి త‌గిన ప్రాదాన్య‌త ఇవ్వకుండా, ఫీజురియంబ‌ర్స్ మెంటు బ‌కాయిలు చెల్లించ‌డం ...

Read More »

కమిషనర్‌ను కలిసిన రేషన్‌ డీలర్లు…. సమస్యలు పరిష్కారించాలని వినతి

నిజామాబాద్‌, జనవరి 3; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; రాష్ట్రంలోని రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ రేషన్‌ డీలర్ల సంఘం రాస్త్ర కార్యవర్గం శనివారం రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ సి.పార్థసారథిని కలిసారు. ఈ మేరకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసి సంఘం సభ్యులు తమ సమస్యలను కమిషనర్‌కు తెలియజేసారు. రాస్త్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇవ్వడం హార్షనీయమని, ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాల అమలు చాల బాగుందని తెలిపారు. కానీ రాష్ట్రంలోని రేషన్‌ డీలర్ల సమస్యలపై ...

Read More »

మాజీ సైనిక కుటుంబాలకు రాయితీలు…. ఎంఆర్‌వో కార్యాలయాల్లో హాజరు కావాలి

నిజామాబాద్‌, జనవరి 03: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; నిజామాబాద్‌ జిల్లాలోని మాజీ సైనిక కుటుంబాలకు రాయితీలు కల్పిస్తున్నామని జిల్లా సైనిక సంక్షేమాదికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని వివిధ మండలాల్లో జరిగే సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. అయా మండలాలకు చెందిన మాజీ సైనిక ఉద్యోగులు, వితంతువులు, వారి కుటుంబీకులు ఈ నెల 5 వ తేది నుండి 27వ తేది వరకు మండలాల వారీగా తహసిల్దార్‌ కార్యాలయంలో ఉదయం గంటలకు జరిగే అవగాహన సదస్సులొ పాల్గొనాల్సి ఉంటుంది. ప్రభుత్వం ...

Read More »

మార్కెట్‌ యార్డు అకస్మీక తనిఖీ… హెచ్చరించిన ముఖ్యకార్యదర్శి

నిజామాబాద్‌, జనవరి 3; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మార్కుట్‌ యార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అకస్మీకంగా తనిఖీ చేసారు. ఉహించని రితీలో మార్కెట్‌ యార్డు అధికారులు, సిబ్బంది అవాక్కయారు. యార్డులోకి వచ్చిన ఆమె ముందుగా రైస్‌ గోదాములను పరిశీలించారు. అయా గోదాముల్లో స్టాక్‌ నిల్వలు, అయా కంపనీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అధికారుల పని తీరుపై అడిగి తెలుసుకున్నారు. వరిధాన్యం, పసుపు గోదాములను పరిశీలించారు. రైతుల ధాన్యం తూకం చేసే ...

Read More »

మార్పు దిశగా మార్కెట్‌ యార్డులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు… శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య

నిజామాబాద్‌, జనవరి 03: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కోని పంటలను పండిస్తున్నారని వారికి సరైన మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరి పూనం మాలకొండయ్య అన్నారు. మార్కెట్‌ యార్డులను సమూలంగా మార్పులు చేసి ఆధునికికరణ చేస్తామన్నారు. ఇక్కడ ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మాలకొండయ్య హెచ్చరించారు. శనివారం నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో మీడియా ప్రతినిదులతో ఆమె మాట్లాడుతూ నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డును రాష్ట్రంలో ఉన్నత, ఆదర్శ మార్కెట్‌ ...

Read More »

హర్షం వ్యక్తం చేసిన టిఆర్‌ఎస్‌ నాయకులు

నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌ (రెంజల్‌్‌) జనవరి 03: మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మత్తు కోసం మండలానికి కోటి 11 లక్షల 70 వేల రూపాయలు మంజూరు చేయడంపై టిఆర్‌ఎస్‌ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కటారి సాయిలు మాట్లాడుతూ మండలంలోని దండిగుట్ట మైలారం చెరువుకు 44 లక్షల 90 వేల రూపాయలు, ధూపల్లి మాసాయి చెరువుకు 38 లక్షల 70 వేల రూపాయలు, కళ్యాకూర్‌ ఆలకుంట చెరువుకు 28 ...

Read More »

కెసీఆర్‌ దిష్టి బొమ్మ దగ్దం

నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌,(నిజామాబాద్‌) జనవరి 03: విద్యరంగ సమస్యలను పరిష్కారించాలని నిజామాబాద్‌ నగరంలోని బస్టాండు సమీపంలో పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం కెసిఆర్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యూ రాష్ట్ర నాయకురాలు సరిత మాట్లాడారు. విద్యార్ధుల ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాల ఫలితమే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కారణమన్నారు. అలాంటి విద్యార్థుల సమస్యలను తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం సిగ్గు చేటు అన్నారు. ఫీజు రీ-అంబర్స్‌మెంట్లను తక్షణమే విడుదల చేస్తామన్నా ముఖ్యమంత్రి, విషయంపై నిమ్మకు నీరెత్తి నట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా తన ...

Read More »

ఈ నెల 12న మండల సర్వ సభ్య సమావేశం

నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌ (రెంజల్‌) జనవరి 03: ఈ నెల 12న రెంజల్‌ మండల సర్వ సభ్య సమావేశం మండల అధ్యక్షుని అధ్యక్షతన నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఇంచార్జి ఎమ్‌పిడిఓ తెలిపారు. ఈ సమావేశానికి అయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, మండలంలోని అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారుల తమ నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.

Read More »

ఈ నెల 12న మండల సర్వ సభ్య సమావేశం

నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌ (నవీపేట్‌) జనవరి 03: ఈ నెల 12న నవీపేట మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మండల ఇంచార్జి ఎమ్‌పిడిఓ శివరామకృష్ణ తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని తెలిపారు. ప్రతి శాఖ అధికారి అయా శాఖల నివేదికలతో సమావేశంలో పాల్గొనాలని సూచించారు.

Read More »

బాలుడు అదృశ్యం

నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌ (నవీపేట్‌) జనవరి 03: నవీపేట మండల కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ కాలొనీకి చెందిన రాధోడ్‌ కిరణ్‌ కుమార్‌(15) డిసెంబర్‌ 28న అదృష్యం అయినట్లు ఎస్‌ఐ వేణు గోపాల్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కిరణ్‌ కుమార్‌ సక్రమంగా పాఠశాకు వెళ్లడం లేదని, దీంతో తండ్రి రాథోడ్‌ హుస్సేన్‌ కిరణ్‌ను మందలించడంతో పాఠశాలకు వెళ్లకుండా దారి తప్పి పోయినట్లు తండ్రి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రెండు, మూడు రోజులుగా గాలించిన ఫలితం లేకపోవడం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ...

Read More »

నిర్లక్ష్యం చేస్తే ఆటోలపై చర్యలు

నిజామాబాద్‌ క్రైం; నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌, జనవరి 03: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆటోలపై కఠినంగా వ్యవహరిస్తామని ఒకటో టౌన్‌ ఎస్‌ హెచ్‌ఓ శ్రీనివాసులు అన్నారు. నిజామాబాద్‌ నగరంలోని బస్టాండ్‌ సమీపంలో అటో డ్రైవర్లు రోడ్డుకు ఇరువైపుల ఇష్టారితిన పార్కింగ్‌ చేస్తున్న ఆటోలను, అధికంగా ఉన్న ప్యాసింజరు సీట్లు ఉన్న అటోలను సీజ్‌ చేసారు. ప్రతి ఆటోకు తప్పనిసరిగా టాప్‌ నెంబర్లు, ఆటో యజమాని పేరు సె నంబర్లు ఉండాలని అన్నారు. ఈ నిబంధనలను పాటించని వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌వో హెచ్చరించారు. ...

Read More »

మహిళ ద్రోహి కెసిఆర్‌… మార్చి 7న హైదరాబాద్‌లో నిరసన సభ… మంద కృష్ణమాదిగ

నిజామాబాద్‌, జనవరి 3 ; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ;తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన వర్గానికి తప్పా ఎవరికి ఏం చేసింది లేదని, ప్రధానంగా మహిళలను మోసం చేసారని ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్తాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ఆర్‌ అండ్‌ బి వసతి గృహాంలో విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్‌ రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వకుండా మోసంగించారని విమర్శించారు. దీనిని వ్యతిరేకిస్తూ ...

Read More »

ఉమ్మడి రాష్ట్రాల ఫుట్‌బాల్‌ పోటీలకు……

నిజామాబాద్‌ స్పోర్స్ట్‌, జనవరి 3 ; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫుట్‌బాల్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రాల అంతర్‌ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ టోర్నీకి నిజామాబాద్‌ జిల్లా జట్టు ప్రాతినిధ్యం వహించనుంది. జిల్లా నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో ప్రతిభవంతులైన 16 మంది ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేశారు. జిల్లా సంఘం అధ్యక్ష , కార్యదర్శులు షకీల్‌, ఖలీల్‌ శుక్రవారం డీఎస్‌ మైదానంలో జట్టు ఎంపికను ఖరారు చేశారు. ఈ నెల ...

Read More »

5వ తేదీలోపు ఫీజు చెల్లించాలి

నిజామాబాద్‌, జనవరి 3; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; హైదరాబాద్‌ హిందీ ప్రచారసభ పరీక్షలకు అర్హులైన వారు ఈ నెల 5వ తేదీలోగా తమ పరీక్ష ఫీజు చెల్లించాలని హిందీ పండిత్‌ పరీక్షల కో-ఆర్డినేటర్‌ మహ్మద్‌సలీం తెలిపారు. 8, 9వ తరగతి చదివినవారు విశారద పరీక్షలకు, విశారద లేదా 10 తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన వారు భూషణ్‌ పరీక్ష రాయటానికి, ఇంటర్‌లో ద్వితీయబాష హిందీలో ఉత్తీర్ణులైన వారు విద్వాన్‌ పరీక్షలు రాయటానికి అర్హులని ఆయన వివరించారు. పరీక్షలకు హాజరయ్యే వారు ఈ నెల ...

Read More »

హుష్‌… ప్రభుత్వాసుపత్రిలో దొంగలు పడ్డారు..! ఆక్సిజన్‌ పైపులల చోరీ… అధికారుల నిర్లక్ష్యం… సెక్యూరిటీ వైఫల్యం …

నిజామాబాద్‌ క్రైం, జనవరి 3; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; ప్రతి రోజు వందల మందితో కిటకిటాలాడే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దొంగలు పడ్డారు. ఏకంగా పక్కగా అమర్చిన ఆక్సిజన్‌ పైపులను దొంగిలించారు. గురువారం రాత్రి ఏడో అంతస్తులోని ఆపరేషన్‌ థియేటర్‌కు సెంట్రల్‌ ఆక్సిజన్‌ పైపులైన్‌ నుంచి ఆక్సిజన్‌ సరఫరా అయ్యె కాపర్‌, అల్యూమినియం పైపులు ఉన్నాయి. రోగాలకు అత్యవసర చికిత్స ఇవ్వడంలో ఈ పైపులు చాల కీలకం. అయితే ఈ పైపులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. పోలీసు బూత్‌లో సిబ్బంది విధుల్లో ...

Read More »

4న అథ్లెటిక్స్‌ జిల్లా జట్ల ఎంపిక

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, జనవరి 2; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో ఈ నెల 4న ఆదివారం రోజు అథ్లెటిక్స్‌లో అండర్‌-10, అండర్‌-12, అండర్‌-14 బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యలు నరాల రత్నాకర్‌, కార్యదర్శి డి. సాయిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరశివారులోని రాజారాం స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఎంపికలు మొదలవుతాయన్నారు. సీనియర్‌ వ్యాయామ ఉపాధ్యాయులు మహ్మద్‌ అన్వర్‌ సారథ్యంలో పలువురు పీఈటీలు ఎంపికలు నిర్వహిస్తామన్నారు. పోటీ పడదలచుకున్న బాలబాలికలు తమ ...

Read More »

ఇందూరులో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ మీట్‌

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, జనవరి 2; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో జిల్లా కేంద్రంలో ఈ నెల 11,12 తేదీల్లో ఒకటో తెలంగాణ సబ్‌జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరాల రత్నాకర్‌, కార్యదర్శి డి. సాయిలు వెల్లడించారు. రాజారాం స్టేడియంలో పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని 10 జిల్లాల క్రీడాకారులు ఇందులో పోటీపడతారన్నారు. వీరికి భోజన, వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అండర్‌-10, అండర్‌-12, అండర్‌-14 ...

Read More »

4న తెలంగాణ విద్యావంతుల వేదిక మూడవ మహాసభ

నిజామాబాద్‌ అర్భన్‌, జనవరి 2; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా మూడో మహాసభను ఈ నెల 4న నిర్వహిస్తున్నట్లు విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఆశానారాయణ తెలిపారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలెకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బస్వాగార్డెన్‌లో ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ముత్యాల హన్మంత్‌ రెడ్డి, తెలంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరాం, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌ ...

Read More »

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు శిక్షణ

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 2; నిజామాబాద్‌ న్యూస్‌డాట్‌ ఇన్‌; కొత్త ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొత్త పాఠ్యాంశాలపై ఈ నెల 5,6,7 తేదీల్లో మూడు రోజుల పాటు జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుడు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో శ్రీనివాసచారీ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ డివిజన్‌ ఉపాధ్యాయులకు తెలుగు, గణితం ఆర్‌బివిఆర్‌ఆర్‌ పాఠశాలలో , ఆంగ్లం, జీవశాస్త్రం విశ్వభారతిలో, హిందీ, భౌతికం, జీవశాస్త్రం కాకతీయ పాఠశాలలో ఉంటుదన్నారు. బోధన్‌ డివిజన్‌ ఉపాధ్యాయులకు తెలుగు, గణితం ఆంథోని పాఠశాలలో, హిందీ, భౌతికశాస్త్రం విజుసాయి ...

Read More »