Breaking News

నిర్లక్ష్యం చేస్తే ఆటోలపై చర్యలు

నిజామాబాద్‌ క్రైం;

నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌, జనవరి 03: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆటోలపై కఠినంగా వ్యవహరిస్తామని ఒకటో టౌన్‌ ఎస్‌ హెచ్‌ఓ శ్రీనివాసులు అన్నారు.

నిజామాబాద్‌ నగరంలోని బస్టాండ్‌ సమీపంలో అటో డ్రైవర్లు రోడ్డుకు ఇరువైపుల ఇష్టారితిన పార్కింగ్‌ చేస్తున్న ఆటోలను, అధికంగా ఉన్న ప్యాసింజరు సీట్లు ఉన్న అటోలను సీజ్‌ చేసారు. ప్రతి ఆటోకు తప్పనిసరిగా టాప్‌ నెంబర్లు, ఆటో యజమాని పేరు సె నంబర్లు ఉండాలని అన్నారు. ఈ నిబంధనలను పాటించని వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌వో హెచ్చరించారు.

ఆటోలలో జరిగే అసాంఘీక కార్యకలాపాలను అరికట్టలంటే ఆటోల యజమానులు ప్రయాణీకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

అనంతరం ద్విచక్ర వాహనాల నంబరు ప్లేట్లను పరిశీలించారు. నిబంధనల ప్రకారం నంబరు ప్లేట్లు తెలుపు రంగులో అంకెలు నలుపు రంగులో ఉండాలని అన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. వాహనచోదకులు, ఆటో డ్రైవర్లు, యజమానులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోని పోలీసులకు సహకిరించాలని తెలిపారు.

Check Also

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చట్టానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *