Breaking News

బాలుడు అదృశ్యం

నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌ (నవీపేట్‌) జనవరి 03: నవీపేట మండల కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ కాలొనీకి చెందిన రాధోడ్‌ కిరణ్‌ కుమార్‌(15) డిసెంబర్‌ 28న అదృష్యం అయినట్లు ఎస్‌ఐ వేణు గోపాల్‌ తెలిపారు.

ఎస్‌ఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కిరణ్‌ కుమార్‌ సక్రమంగా పాఠశాకు వెళ్లడం లేదని, దీంతో తండ్రి రాథోడ్‌ హుస్సేన్‌ కిరణ్‌ను మందలించడంతో పాఠశాలకు వెళ్లకుండా దారి తప్పి పోయినట్లు తండ్రి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

రెండు, మూడు రోజులుగా గాలించిన ఫలితం లేకపోవడం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కోన్నారు.

Check Also

గ్రామాల్లో తనిఖీ బందాలు ఎప్పుడైనా రావచ్చు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పనులను తనిఖీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *