Breaking News

కరెంట్‌ షాక్‌తో ఇల్లు దగ్దం… తల్లికూతుళ్ల సజీవ దహనం… దొంగల ముఠాపై అనుమానం

నిజామాబాద్‌ క్రైం, జనవరి 5;

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; నిజామాబాద్‌ నగరంలోని బ్రహ్మపురి కాలనీలో ఇల్లు దగ్దం అయి తల్లికూతుళ్లు అనుమానస్పదంగా సజీవ దహనం అయ్యారు. చైన్‌ స్నాచింగ్‌ దొంగల ముఠాకు చెందిన వారే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే పోలీసుల మాత్రం ఇది కరెంట్‌ షాట్‌ సర్కూట్‌ వల్లే జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కరెంట్‌ షాక్‌తో ఇల్లు దగ్దం అయి అందులో తల్లి కూతురు సజీవ దహనం అయ్యారు. ఆదివారం అర్థరాత్రి తర్వాత జరిగిన ఈ సంఘటనతో నిజామాబాద్‌ నగరం అవాక్కయింది. ఇంట్లో ఉన్న ఇద్దరికి ఇద్దరు సీజవ దహనం కావడం హృదవిదారకంగా మారింది. నిజామాబాద్‌ నగర రెండో టౌన్‌ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

బ్రహ్మపురి కాలనీలో రాజలక్షి(70) ఆమె కూతురు భూలక్ష్మి(30) నిద్రిస్తున్నారు. అయితే అర్థరాత్రి తర్వాత అనుమానస్పదంగా ఇల్లు దగ్దం అయ్యే అక్కడిక్కడే మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం నగరంలో చైన్‌ స్నాచింగ్‌ ముఠాను పట్టుకునేందుకు భూలక్ష్మి పోలీసులకు సహకరించింది. ఈమె సహకారంతోనే దొంగలను పట్టుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మరోపక్క తల్లికూతుల్లు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారని, వీరికి ఇతర కుటుంబ సభ్యులు ఎవరు లేరని స్థానికులు చెబుతున్నారు. అయితే రెండో టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆసీఫ్‌ కరెంట్‌ షాక్‌ మరణించినట్లు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Check Also

గ్రామాల్లో తనిఖీ బందాలు ఎప్పుడైనా రావచ్చు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పనులను తనిఖీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *